Posted on 2025-08-11 16:58:32
డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్:నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ ఆధ్వర్యంలో, మార్వాడిగల్లీలోని తన నివాసంలో శ్రావణ మాస పర్వదినాన్ని పురస్కరించుకొని కాశీ విశ్వనాథునికి భక్తిశ్రద్ధలతో మహా రుద్రాభిషేకం కార్యక్రమం నిర్వహించారు. ఈ పుణ్య కార్యక్రమంలో పది మంది ప్రముఖ వేద పండితులు పాల్గొని, శాస్త్రోక్తంగా మహాదేవునికి గంగాజలంతో, పంచామృతాలతో రుద్రాభిషేకం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతు " ఇందూర్ జిల్లా ప్రజల ప్రజల సంక్షేమం, ఆరోగ్యం, అభివృద్ధి మరియు లోక కళ్యాణం కోసం ఈ రుద్రాభిషేకాన్ని గత 50 ఏళ్లనుండి నిర్వహించడం జరుగుతుందని అన్నారు. ఆధ్యాత్మిక దైవ కార్యక్రమాలు నిర్వహించడం వలన మన సంస్కృతి, సంప్రదాయాలు పెంపొందించడంతో పాటు మనశాంతి, దృఢ సంకల్పం కలుగుతుందన్నారు. మహాదేవుని ఆశీస్సులతో సమాజం శాంతిగా, సుసంపన్నంగా ఉండాలి. ప్రజలకు మంచి జరగాలని మనసారా కోరుకున్నట్లు" తెలిపారు. వేద ఘోషల నడుమ ఎంతో ఆధ్యాత్మికతతో సాగిన ఈ కార్యక్రమంలో పలువురు భక్తులు, స్థానిక ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.
హెల్మెట్ లేకపోతే పెట్రోల్ లేదు... రాజన్న సిరిసిల్లలో నిబంధన అమలు...
Posted On 2026-07-13 13:25:59
Readmore >
జూలై 13న మాస శివరాత్రి విశిష్టత.. శివాభిషేకానికి అత్యంత పవిత్రమైన రోజు
Posted On 2026-07-13 05:57:44
Readmore >
విద్యార్థుల్లో సేవాభావం పెంపొందించే స్కౌట్స్ & గైడ్స్ ఉద్యమం : కంకణాల రాంరెడ్డి
Posted On 2026-07-12 16:55:14
Readmore >
బాన్సువాడలో పోలీసు వ్యవస్థకు నూతన ఊపు... రూ.44 లక్షలతో 4 భవనాల ప్రారంభం
Posted On 2026-07-12 16:48:16
Readmore >
తెలంగాణకు మూడు బులెట్ ట్రైన్స్ : కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్
Posted On 2026-07-12 03:35:06
Readmore >