Posted on 2025-08-15 08:11:57
డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్: నగరంలోని ఎన్డీసీసీబీ బ్యాంకులో 79 వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా జాతీయ జెండాను చైర్మన్ కుంట రమేష్ రెడ్డి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈరోజు మనం అందరం ప్రశాంతంగా స్వేచ్ఛగా బ్రతుకుతున్నామంటే ఎంతో మంది దేశం కోసం ప్రాణాలు అర్పించిన వారి త్యాగాల వల్లే ప్రతి ఒక్కరూ స్వేచ్ఛగా బతుకుతున్నారని ఆయన అన్నారు. అలాగే రాష్ట్ర ప్రభుత్వం రైతుల కోసం ఎన్డీసీసీబీ బ్యాంక్ ద్వారా రుణాలను అందిస్తూ రైతుల అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తుందని అన్నారు. అలాగే స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఎస్ ఏ రైటింగ్ లో తమ ప్రతిభను చాటిన విద్యార్థినిలకు బహుమతులు అందించారు. అదేవిధంగా ఎన్ డి సి సి బి, పి ఎ సి ఎస్ ఎస్ బ్యాంక్ ఇలా చైర్మన్లు డైరెక్టర్ల పదవీ కాలాన్ని మరో ఆరు నెలలు పెంచడాన్ని తాము ఎంతగానో సంతోషిస్తున్నట్లు తమకు ఈ అవకాశం కల్పించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. వారిచ్చిన అవకాశాన్ని సద్వినియోగం పరుచుకొని బ్యాంకు లాభాన్ని మరింత రెట్టింపు స్థాయిలో పైకి తెస్తామని ఆయన అన్నారు.
జూలై 13న మాస శివరాత్రి విశిష్టత.. శివాభిషేకానికి అత్యంత పవిత్రమైన రోజు
Posted On 2026-07-13 05:57:44
Readmore >
విద్యార్థుల్లో సేవాభావం పెంపొందించే స్కౌట్స్ & గైడ్స్ ఉద్యమం : కంకణాల రాంరెడ్డి
Posted On 2026-07-12 16:55:14
Readmore >
బాన్సువాడలో పోలీసు వ్యవస్థకు నూతన ఊపు... రూ.44 లక్షలతో 4 భవనాల ప్రారంభం
Posted On 2026-07-12 16:48:16
Readmore >
తెలంగాణకు మూడు బులెట్ ట్రైన్స్ : కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్
Posted On 2026-07-12 03:35:06
Readmore >