Posted on 2025-08-16 17:29:29
శ్రీకృష్ణుని వేషాధారణలతో ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన చిన్నారులు
డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్:నగరంలోని మారుతి నగర్ లో గల మురళీకృష్ణ ఆలయంలో కృష్ణాష్టమి వేడుకలను రెండు రోజుల పాటు నిర్వహించనున్నట్లు మురళీకృష్ణ ఆలయ అర్చకులు వెంకటేశ్వరశర్మ, ఆలయ ఛైర్మన్ రాములు
తెలిపారు. శనివారం కృష్ణాష్టమి సందర్భంగా తెల్లవారుజామున నుండి స్వామివారికి పంచామృతాభిషేకాలు, హారతులు ఇచ్చి భక్తులకు దర్శనం కల్పించడం జరిగిందన్నారు. ఆలయానికి వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ముందస్తు చర్యలు చేపట్టామని అన్నారు. అదేవిధంగా ఆదివారం ఉదయం 9 గంటలకు స్వామివారి పల్లకీ సేవ, మధ్యాహ్నం ఒంటి గంటకు అన్న ప్రసాద వితరణ చేపట్టనున్నట్లు వారు పేర్కొన్నారు. ఇదిలా ఉండగా నగరంలోని ఆర్మూర్ రోడ్డు లో గల మురళీకృష్ణ ఆలయంతో పాటు జిల్లా వ్యాప్తంగా పలు శ్రీకృష్ణ ఆలయాల్లో కృష్ణాష్టమి సందర్భంగా భక్తులు ఉదయం నుంచే కృష్ణుడి ఆలయాలను సందర్శించి పూజలు చేస్తున్నారు. దీంతో కృష్ణుడి మందిరాలు కితకిత లాడాయి పలుచోట్ల చిన్నారులు శ్రీకృష్ణుని వేషాధారణతో ఆటల పోటీలు, ఉట్టి కొట్టే కార్యక్రమాలను నిర్వహించారు. శ్రీకృష్ణుని వేషాధారణతో చిన్ని చిన్ని చిన్నారులు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. మరోవైపు ఇస్కాన్ ఆధ్వర్యంలో శ్రీకృష్ణ జన్మాష్టమి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు.
విద్యార్థుల్లో సేవాభావం పెంపొందించే స్కౌట్స్ & గైడ్స్ ఉద్యమం : కంకణాల రాంరెడ్డి
Posted On 2026-07-12 16:55:14
Readmore >
బాన్సువాడలో పోలీసు వ్యవస్థకు నూతన ఊపు... రూ.44 లక్షలతో 4 భవనాల ప్రారంభం
Posted On 2026-07-12 16:48:16
Readmore >
తెలంగాణకు మూడు బులెట్ ట్రైన్స్ : కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్
Posted On 2026-07-12 03:35:06
Readmore >
ఆరుగురిని చంపిన నిందితుడిపై రూ.2 లక్షల రివార్డు ప్రకటించిన పోలీసులు
Posted On 2026-07-11 17:04:24
Readmore >