Posted on 2025-08-21 14:57:27
డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్: స్వర్గీయ మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ జయంతి సందర్భంగా జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కాంగ్రెస్ భవన్ నందు రాజీవ్ గాంధీ విగ్రహానికి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించారు.అనంతరం వినాయక్ నగర్ లోని రాజీవ్ గాంధీ విగ్రహానికి పూనమాలవేసి నివాళులు అర్పించారు.
ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా జిల్లా గ్రంధాలయ చైర్మన్ అంతా రెడ్డి రాజారెడ్డి, పీసీసీ ప్రధాన కార్యదర్శి రాంభూపాల్ పాల్గొన్నారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ
ఈ సందర్భంగా అంత రెడ్డి రాజారెడ్డి మాట్లాడుతూ రాజీవ్ గాంధీ అతి చిన్న వయసులో దేశానికి ప్రధాని అయిన నాయకుడని, ఆయన కుటుంబం దేశం కోసం ప్రాణాలు అర్పించిందని దేశసేవ కోసమే వారి కుటుంబం అంకితమైందని ఆయన తెలిపారు. 18 సంవత్సరాల వయసులోని యువతకు ఓటు హక్కు కల్పించి తమకు నచ్చిన ప్రజా ప్రతినిధిని ఎన్నుకునే హక్కు కల్పించిన నాయకుడని,అదే విధంగా ఐటి రంగాన్ని దేశానికి పరిచయం చేసి విప్లమాత్మకంగా దేశ అభివృద్ధికి కృషి చేసిన నాయకుడని, అదే విధంగా గ్రామాలు అభివృద్ధి చెందినప్పుడే దేశాలు బాగుంటాయి అని చెప్పిన గాంధీ మాటలను నమ్మిన ఆయన గ్రామపంచాయతీలకే నేరుగా నిధులు ఇవ్వడం ద్వారా గ్రామాలు అభివృద్ధి చెందుతాయని భావించి ఆర్టికల్ 73, 74 సవరణ ద్వారా నేరుగా గ్రామపంచాయతీలకే నిధులు అందించిన వ్యక్తి రాజీవ్ గాంధీ అని అన్నారు. ఈ సందర్భంగా రాంభూపాల్ మాట్లాడుతూ రాజీవ్ గాంధీ ప్రధానిగా దేశ అభివృద్ధికి ఎంతో కృషి చేశారని, రాజీవ్ గాంధీ గారు తీసుకున్న సుదీర్ఘ నిర్ణయాల వలన ఈ రోజు దేశం ప్రపంచ స్థాయిలో అభివృద్ధిలో ముందుంది అని, దేశానికి ఐటీ రంగాన్ని అందించిన నాయకుడని రాజీవ్ గాంధీ తీసుకొచ్చిన సంస్కరణ వల్లే దేశం అభివృద్ధి చెందుతుంది అని, యువతకు 18 సంవత్సరాలలో ఓటు హక్కు కల్పించడం గాని, నేరుగా గ్రామ పంచాయతీలకు నిధులు అందించడం గాని రాజీవ్ గాంధీ తీసుకున్న నిర్ణయాలనీ ఆయన అన్నారు.
ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్టీ సెల్ అధ్యక్షులు యాదగిరి, జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు విపుల్ గౌడ్ ,మాజీ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు బొబ్బిలి రామకృష్ణ, మహిళా కాంగ్రెస్ నాయకులు పోల ఉష, యాస్ సి సెల్ నగర అధ్యక్షులు వినయ్, అవిన్, ఎస్టీ సెల్ నగర అధ్యక్షులు సుభాష్ జాదవ్, లవంగ ప్రమోద్, రాజేంద్రప్రసాద్, బంటు బలరాం, అపర్ణ,ఆడే ప్రవీణ్ కుమార్ మరియు తదితరులు పాల్గొన్నారు.
విద్యార్థుల్లో సేవాభావం పెంపొందించే స్కౌట్స్ & గైడ్స్ ఉద్యమం : కంకణాల రాంరెడ్డి
Posted On 2026-07-12 16:55:14
Readmore >
బాన్సువాడలో పోలీసు వ్యవస్థకు నూతన ఊపు... రూ.44 లక్షలతో 4 భవనాల ప్రారంభం
Posted On 2026-07-12 16:48:16
Readmore >
తెలంగాణకు మూడు బులెట్ ట్రైన్స్ : కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్
Posted On 2026-07-12 03:35:06
Readmore >
ఆరుగురిని చంపిన నిందితుడిపై రూ.2 లక్షల రివార్డు ప్రకటించిన పోలీసులు
Posted On 2026-07-11 17:04:24
Readmore >