Posted on 2025-08-23 10:00:42
డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్:ప్రాచీన పద్దతి ని, ప్రతి ఆచార వ్యవహారాలు సామాజిక చైతన్యాన్ని ప్రకృతిని సంరక్షించి లోక కళ్యాణాన్ని కునే విధంగా ఉంటే దానికి విరుద్దంగా నేటి ఆచారం పర్యావరణ వినాశనానికి దోహదపడుతున తరుణంలో నిజామాబాద్ జిల్లాకు చెందిన ప్రముఖ లోకల్ ఛానెల్ కే6 ఆధ్వర్యంలో పర్యావరణ రక్షణకై ఉచిత మట్టి గణపతుల పంపిణీ కార్యక్రమం గత 13 సంవత్సరాలుగా కొనసాగుతుందని వానల్ వ్యవస్థాపకులు సామ జయ ప్రకాశ్ రెడ్డి జి. శ్రీనివాస్ లు తెలిపారు. ఇందులో భాగంగానే పర్యవరణ పరిరక్షణకై భక్తులకు మట్టి గణపతులను ఉచితంగా అందించి ఒక నూతన యానికి శ్రీకారం చుట్టిందని ప్రజలు తమ వంతు బాధ్యతగా మట్టి గణపతులే పూజించాలనే " ఆలోచనలో పడడం చాలా సంతోషదాయకమని ప్రతి సారి మాదిరిగానే ఈ సారి కూడా 6 మాశాల నుండే కలకత్తా నుండి మట్టి గణపతుల తయారికి ఆర్డర్ చేసి 25 వేల మట్టి గణపతులను తీసుకురావడం ఉంది. ఈ నెల 27న వినాయక చవితి పండుగ సందర్భంగా ఒక రోజు ముందు 26వ తేదీ గళవారం ఉదయం 10 గంటలకు ఉచితంగా మట్టి గణపతుల పంపిణీ K6, కార్యాలయం సుభాష్ 5 నిజామాబాద్, ఎన్సీఎన్ కార్యాలయ మామిడిపల్లి ఎక్స్ రోడ్డు ఆర్మూర్ నందు ఉచిత మట్టి గణపతుల పంపిణీ కార్యక్రమం ఉంటుందనిఫౌండర్, సీఈవో శ్రీనివాస్ తెలిపారు. ఈ నెల 26వ తేదీన -గళవారం ఉదయం 10 గంటల నుండి నిజామాబాద్ సుభాష్ నగర్ లో గల జిల్లా పరిషత్ కే6, జి టి పి ఎల్,రోషిని, సామా మ్యూజిక్, సామా బ్రాడ్ బ్యాండ్ ఇలా ఆధ్వర్యంలో ఉదయం 10 గంటల నుండి మట్టి గణపతుల ఉచిత పంపిణీ కార్యక్రమం వుందని చెప్పారు. ఈ -క్రమానికి ముఖ్య అతిధులుగా నందిపేట్ కేదారేశ్వర ఆశ్రమ వ్యవస్థాపకులు శ్రీశ్రీశ్రీ మంగిరాములు జో రాజ్ మరియు ఆర్మూర్ కు చెందిన అవార్డు గ్రహీత గురుస్వామి ప్రముఖ పండితులు గణపతి ఉపాసకులు బల్యపల్లి సుబ్బారావు చేతుల మీదుగా మట్టి గణపతులు పంపిణీ చేస్తున్నట్లు చైర్మన్ సామ ప్రకాశ్ రెడ్డి ఫౌండర్, సీఈవో శ్రీనివాస్ తెలిపారు.
ప్రజలు ఈ సువర్ణ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ఉచితంగా పంపిణీ చేస్తున్న మట్టి పతులను పూజించి ఆ భగవంతుని కృపకు పాత్రులు కావాలని కోరారు. మట్టి గణపతిని పూజిద్దాం, పర్యావరన్ని కాపాడాలని పిలుపునిచ్చారు.
విద్యార్థుల్లో సేవాభావం పెంపొందించే స్కౌట్స్ & గైడ్స్ ఉద్యమం : కంకణాల రాంరెడ్డి
Posted On 2026-07-12 16:55:14
Readmore >
బాన్సువాడలో పోలీసు వ్యవస్థకు నూతన ఊపు... రూ.44 లక్షలతో 4 భవనాల ప్రారంభం
Posted On 2026-07-12 16:48:16
Readmore >
తెలంగాణకు మూడు బులెట్ ట్రైన్స్ : కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్
Posted On 2026-07-12 03:35:06
Readmore >
ఆరుగురిని చంపిన నిందితుడిపై రూ.2 లక్షల రివార్డు ప్రకటించిన పోలీసులు
Posted On 2026-07-11 17:04:24
Readmore >