| Daily భారత్
Logo




ఎంబీబీఎస్ విద్యార్థిని చితకబాదిన పీజీ విద్యార్థులు

News

Posted on 2025-08-24 03:59:12

Share: Share


ఎంబీబీఎస్ విద్యార్థిని చితకబాదిన పీజీ విద్యార్థులు

వివాదాలకు, కేరాఫ్ అడ్రస్ గా జిల్లా మెడికల్ కళాశాల

గతంలో ఇలాంటి ఘటనలు జరిగిన మారని తీరు

మెడికల్ కళాశాలలో సీనియర్ విద్యార్థుల ర్యాగింగ్ కలకలం? 

డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్:నిజామాబాద్​ జిల్లా కేంద్రంలో ప్రభుత్వ మెడికల్​ కళాశాలలో దారుణం చోటుచేసుకుంది. ఎంబీబీఎస్​ నాలుగో సంవత్సరం చదువుతున్న విద్యార్థిపై సీనియర్​లు (పీజీ విద్యార్థులు) ర్యాగింగ్​కు పాల్పడ్డారు. సుమారు పది మంది విద్యార్థుల వరకు కలిసి అమాయకుడిని చితకబాదారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపుతుంది.బాధితుడి కథనం ప్రకారం..

హైదరాబాద్​ సమీపంలోని పటాన్​చెరుకు చెందిన యువకుడు​ రాహుల్​ నిజామాబాద్​లోని ప్రభుత్వ మెడికల్​ కాలేజీలో ఎంబీబీఎస్​ నాలుగో సంవత్సరం చదువుతున్నాడు. కాగా, ఇంటర్నల్​ డ్యూటీలో భాగంగా బాధిత విద్యార్థి ప్రభుత్వ జనరల్​ హాస్పిటల్​లో విధులు నిర్వర్తించాడు. అయితే రాహుల్​ విధులకు గైర్హాజరైనట్లు సీనియర్​లు(పీజీ విద్యార్థులు) రిజిస్టర్​లో నమోదు చేశారు. బాధిత విద్యార్థి ఈ విషయమై శనివారం  సీనియర్​ల వద్దకు వెళ్లి అడిగాడు. తాను డ్యూటీ చేసినా కూడా.. ఎందుకు గైర్హాజరు వేశారని అడిగాడు. దీంతో మమ్మల్నే నిలదీస్తావా.. అంటూ సీనియర్​లు బాధిత విద్యార్థిపై మూకుమ్మడి దాడికి పాల్పడ్డారు. సుమారు అర గంట పాటు ర్యాగింగ్​ చేపట్టారు. ప్రశ్నలతో విసిగించారు. ఫోన్​ లాగేసుకున్నారు. తనకు ఆరోగ్యం సరిగా లేదు.. జాండిస్​ అయ్యాయి.. తనను వదిలేయమని ప్రాధేయపడినా.. వదిలిపెట్టకుండా కొట్టారని బాధిత విద్యార్థి పేర్కొన్నారు. మెడికల్​ కాలేజీలో జరిగిన ర్యాగింగ్​, మెడికల్​ విద్యార్థిపై దాడి విషయం బయటకు రాకుండా కళాశాల అధికారులు విశ్వప్రయత్నం చేస్తున్నారు. లోలోపలే కాంప్రమైస్​ చేసేందుకు బాధిత విద్యార్థిపై ఒత్తిడి తీసుకొస్తున్నారు. తప్పు చేసిన సీనియర్​ల విషయంలో మెడికో లీగల్​ కేసు (ఎమ్మెల్సీ)  ఇష్యూ చేసేందుకు మీనమేషాలు లెక్కిస్తున్నారు.

Image 1

ప్రతి చుక్క విలువైనదే : సిరిసిల్లలో జల సంరక్షణ ప్రతిజ్ఞ

Posted On 2026-07-12 17:19:03

Readmore >
Image 1

విద్యార్థుల్లో సేవాభావం పెంపొందించే స్కౌట్స్ & గైడ్స్ ఉద్యమం : కంకణాల రాంరెడ్డి

Posted On 2026-07-12 16:55:14

Readmore >
Image 1

బాన్సువాడలో పోలీసు వ్యవస్థకు నూతన ఊపు... రూ.44 లక్షలతో 4 భవనాల ప్రారంభం

Posted On 2026-07-12 16:48:16

Readmore >
Image 1

కొత్తగూడెంలో జనసేన జెండా రెపరెప

Posted On 2026-07-12 16:40:00

Readmore >
Image 1

విజయవాడ ఆటోనగర్‌లో భారీ అగ్ని ప్రమాదం... 7 బస్సులు దగ్ధం

Posted On 2026-07-12 10:39:25

Readmore >
Image 1

కామారెడ్డి పట్టణంలో రెడ్డి చికెన్ మార్కెట్ ప్రారంభం

Posted On 2026-07-12 09:55:45

Readmore >
Image 1

ముఖ్యమంత్రి పీఠంపై ఉండి హుందాతనం కోల్పోయిన రేవంత్ రెడ్డి

Posted On 2026-07-12 09:34:30

Readmore >
Image 1

తెలంగాణకు మూడు బులెట్ ట్రైన్స్ : కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్

Posted On 2026-07-12 03:35:06

Readmore >
Image 1

ప్రముఖ లెజెండరీ సింగర్ ఎస్.జానకి కన్నుమూత

Posted On 2026-07-11 17:25:49

Readmore >
Image 1

ఆరుగురిని చంపిన నిందితుడిపై రూ.2 లక్షల రివార్డు ప్రకటించిన పోలీసులు

Posted On 2026-07-11 17:04:24

Readmore >