| Daily భారత్
Logo




మూడు సంవత్సరాల పాపని హింసించిన కేసులోని నిందితుడికి జైలు మరియు జరిమానా

News

Posted on 2025-08-25 19:32:55

Share: Share


మూడు సంవత్సరాల పాపని హింసించిన కేసులోని నిందితుడికి జైలు మరియు జరిమానా

మూడు సంవత్సరాల పాపని హింసించిన కేసులోని నిందితుడికి 2 సంవత్సరాల జైలు మరియు రూ.10,000/- రూపాయలు జరిమానా విధించిన గౌరవ ఒంగోలు Spl JFCM Excise కోర్ట్ వారు

డైలీ భారత్, ప్రకాశం జిల్లా: నాగులుప్పలపాడు మండలంలోని మాచవరం గ్రామానికి చెందిన భూపతి సుధీర్ తండ్రి రామంజనేయులు 32 సంవత్సరాలు అనే వ్యక్తి ఒక మహిళతో సన్నిహిత సంబంధం పెట్టుకొని ఆమె పాప (3 సం) అడ్డుగా ఉందని, నిరంతరం పాపను కొట్టుతూ చిత్రహింసలకి గురి చేయడంతో అ విషయం తెలుసుకున్న శిశు సంరక్షణ శాఖ అధికారి పురుషోత్తమ రావు ఫిర్యాదు మేరకు సదురు విషయం గురించి నాగులుప్పలపాడు పోలీస్ స్టేషన్ నందు పిర్యాధి చేయగా అప్పటి  స్టేషన్ SHO  K. పాండురంగరావు (HC 158) కేసు నమోదు చేయగా అప్పటి SI A శశికుమార్ అన్ని కోణాల్లో కేసును దర్యాప్తు చేపట్టి నిందితుల పై ఛార్జ్ షీట్ కోర్టులో దాఖలు చేసారు.

అనంతరం అడిషనల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ P శ్రావన్ కుమార్ ప్రాసిక్యూషన్ తరుపున వాదించారు. పోలీస్ సిబ్బంది సాక్షులను కోర్ట్ లో సమయానుసారం హాజరు పరుస్తూ ప్రకాశం జిల్లా ఎస్పీ మార్గదర్శకత్వంలో  సమర్థవంతంగా విచారణ నడిపి సరైన సాక్ష్యాధారాలతో నిందితుడుపై నేరనిరూపణ చేసినందున తేది 25.08.2025 న స్పెషల్ జుడిషియల్ మెజిస్ట్రేట్ ఆఫ్ ఫస్ట్ క్లాస్ & ఎక్సైజ్ కోర్టు ఒంగోలు శ్రీమతి కోమలి వల్లీ భూపతి సుధీర్ కు 2 సంవత్సరాల జైలు మరియు రూ10,000/- రూపాయలు, చొప్పున జరిమానా విధిస్తూ తీర్పునిచ్చారు. 

సదరు కేసులో సరైన సాక్ష్యాధారాలు కోర్ట్ లో ప్రవేశపెట్టి సమర్థవంతంగా ట్రయల్ మానిటరింగ్ చేసి నిందితరాలకు శిక్షించబడటంలో క్రియాశీలక పాత్ర పోషించిన అప్పటి  నాగులుప్పల పాడు SI A శశికుమార్  ప్రస్తుత  నాగులుప్పల పాడు SI షేక్ రజియా సుల్తానా బేగం, K. పాండురంగరావు (HC 158)మరియు NG పాడు కోర్టు కానిస్టేబుల్ D.L. నారాయణ(PC- 3650), S.హరికృష్ణ (PC-2499) లను ప్రకాశం జిల్లా ఎస్పీ ఏఆర్ దామోదర్ ఐ. పీ.ఎస్ ప్రత్యేకంగా అభినందించారు.

Image 1

ప్రతి చుక్క విలువైనదే : సిరిసిల్లలో జల సంరక్షణ ప్రతిజ్ఞ

Posted On 2026-07-12 17:19:03

Readmore >
Image 1

విద్యార్థుల్లో సేవాభావం పెంపొందించే స్కౌట్స్ & గైడ్స్ ఉద్యమం : కంకణాల రాంరెడ్డి

Posted On 2026-07-12 16:55:14

Readmore >
Image 1

బాన్సువాడలో పోలీసు వ్యవస్థకు నూతన ఊపు... రూ.44 లక్షలతో 4 భవనాల ప్రారంభం

Posted On 2026-07-12 16:48:16

Readmore >
Image 1

కొత్తగూడెంలో జనసేన జెండా రెపరెప

Posted On 2026-07-12 16:40:00

Readmore >
Image 1

విజయవాడ ఆటోనగర్‌లో భారీ అగ్ని ప్రమాదం... 7 బస్సులు దగ్ధం

Posted On 2026-07-12 10:39:25

Readmore >
Image 1

కామారెడ్డి పట్టణంలో రెడ్డి చికెన్ మార్కెట్ ప్రారంభం

Posted On 2026-07-12 09:55:45

Readmore >
Image 1

ముఖ్యమంత్రి పీఠంపై ఉండి హుందాతనం కోల్పోయిన రేవంత్ రెడ్డి

Posted On 2026-07-12 09:34:30

Readmore >
Image 1

తెలంగాణకు మూడు బులెట్ ట్రైన్స్ : కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్

Posted On 2026-07-12 03:35:06

Readmore >
Image 1

ప్రముఖ లెజెండరీ సింగర్ ఎస్.జానకి కన్నుమూత

Posted On 2026-07-11 17:25:49

Readmore >
Image 1

ఆరుగురిని చంపిన నిందితుడిపై రూ.2 లక్షల రివార్డు ప్రకటించిన పోలీసులు

Posted On 2026-07-11 17:04:24

Readmore >