Posted on 2025-08-26 15:14:13
మరుగుదొడ్లు దుర్వాసన వస్తున్న పట్టింపు లేదు.
సమయపాలనా లేదు అంతా నా ఇష్టమే అంటున్న వార్డెన్
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దుమ్ముగూడెం గిరిజన బాలుర పిఎంహెచ్ వసతి గృహం ను సందర్శించిన పిడిఎస్యు బృందం.
డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దుమ్ముగూడెం గిరిజన బాలుర పోస్ట్ మెట్రిక్ వసతి గృహం వార్డెన్ విద్యార్థుల పట్ల నిర్లక్ష్యంగా ఉంటూ మరుగుదొడ్లు దురువాసన వస్తున్న ఎలాంటి పట్టింపు లేకుండా వ్యవహరించి గిరిజన విద్యార్థులను మోసం చేస్తున్నారని. పి డి ఎస్ యు రాష్ట్ర అధ్యక్షులు కాంపాటి పృథ్వీ, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నేత మునిగేలా శివ ప్రశాంత్ అన్నారు సోమవారం విద్యార్థి పోరుబాట యాత్ర చెర్ల లో ప్రారంభమై దుమ్ముగూడెం చేరుకున్న యాత్ర బృందం గిరిజన పోస్టుమెటిక్ వసతి గృహానికి చేరుకుంది. ఈ సందర్భంగా విద్యార్థుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. మరుగుదొడ్లు పరిశీలించగా విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా లేకపోవడమే కాకుండా డోర్లు పగిలి ఉన్నాయని మరికొన్ని మరుగుదొడ్లకు అసలు డోర్లు ఇవ్వని. మరుగుదొడ్ల లోన అమర్చిన బేషన్లో సరిగా లేక మరింత దురు వాసన వస్తుందని తెలిపారు. అలాగే హాస్టల్ కి దోమతెరలు లేకపోవడంతో పలిగిపోయిన కిటికీల నుండి దోమలు విపరీతంగా రావడం వలన విద్యార్థులు అనారోగ్యాలకు గురవుతున్నారని వారు అన్నారు. అదేవిధంగా వార్డెన్ సరైన టైం కు వసతి గృహానికి హాజరు కాడని తన ఇష్టం వచ్చిన టైంకి వచ్చి వెళ్తాడని విద్యార్థులు తెలిపారు. సాయంత్రం యాత్ర వెళ్లిన సమయానికి విద్యార్థుల దగ్గర ఉండవలసిన వార్డెన్ వార్డెన్ నిర్లక్ష్య వైఖరి బట్టబయలైందని అన్నారు. సమయపాలన లేకుండా విద్యార్థులకు మెనూ సరిగా అందించకుండా అంతా నా ఇష్టం అనే రీతిలో వ్యవహరిస్తున్న నిర్లక్ష్యపు వార్డునుపై పిఓ గారు స్పందించి చర్యలు తీసుకోవాలని అన్నారు. అధికారులు అందరూ అందుబాటులో ఉన్న ఐటిడిఏ భద్రాచలం కు కూత వేటు దూరంలో ఉన్న దుమ్ముగూడెం లోనే ఇంత నిర్లక్ష్యంగా ఉంటే సంబంధిత జిల్లా అధికారి ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. జిల్లా అధికారిని కలవడం కానీ విద్యార్థులను కలవడం గానీ వారితో మాట్లాడటం గాని సమస్యలు తెలుసుకోవడం కానీ చేయడం లేదని కనీసం జిల్లా అధికారి పేరు కూడా విద్యార్థులకు తెలియకపోవడం వారి పని విధానానికి నిదర్శనమని వారు తెలిపారు.
ఈ కార్యక్రమంలో సాయి, రామ్ చరణ్, అబ్దుల్ గని, జార్జ్, శ్రావణి, సంధ్య, మనీ భార్గవి, విష్ణువర్ధన్ తదితరులు పాల్గొన్నారు.
విద్యార్థుల్లో సేవాభావం పెంపొందించే స్కౌట్స్ & గైడ్స్ ఉద్యమం : కంకణాల రాంరెడ్డి
Posted On 2026-07-12 16:55:14
Readmore >
బాన్సువాడలో పోలీసు వ్యవస్థకు నూతన ఊపు... రూ.44 లక్షలతో 4 భవనాల ప్రారంభం
Posted On 2026-07-12 16:48:16
Readmore >
తెలంగాణకు మూడు బులెట్ ట్రైన్స్ : కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్
Posted On 2026-07-12 03:35:06
Readmore >
ఆరుగురిని చంపిన నిందితుడిపై రూ.2 లక్షల రివార్డు ప్రకటించిన పోలీసులు
Posted On 2026-07-11 17:04:24
Readmore >