Posted on 2025-08-26 17:39:38
డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్:దేవాలయ పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో వినాయక చవితి పండగ సందర్భంగా అనేక గ్రామాలు దూర ప్రాంతాల నుంచి అడవుల నుంచి తిరిగి చాలామంది చిరు వ్యాపారులు గణపతి పూజ సామాగ్రి ఆకులు, కొమ్మలు,పువ్వులు, పండ్లు తీసుకువచ్చి భక్తుల కోసం రోడ్డు పక్కన చిన్న దుకాణాలు ఏర్పాటు చేసుకొని విక్రయిస్తుంటే వారికి ట్రాఫిక్ పోలీసులు ఇబ్బంది కలిగిస్తున్నరని తెలిసి నిజామాబాద్ టౌన్ ట్రాఫిక్ ఏసీపీకి కలిసి వినతి పత్రం అందించారు . వీక్లీ బజార్, గాంధీచౌక్ నుంచి పెద్ద బజార్ సంబంధించిన ఏరియాల్లో చిన్న చిన్న వ్యాపారులను ఇబ్బందికి గురి చేయవద్దని అక్కడకి అక్కడి నుండి వెళ్లే ట్రాఫిక్ ని డైవర్షన్ చేయాలని హిందూ పరిరక్షణ కమిటీ సభ్యులు పటేల్ ప్రసాద్ ట్రాఫిక్ ఏసిపి ని కలిశారు. అట్లాగే మంగళ, బుధవారాల్లో ట్రాఫిక్ చలాన్ ల పేరిట హిందువులను ఫైన్ ల హింసించవద్దని వినతి పత్రం ఇవ్వడం జరిగిందన్నారు . దానికి ఏసిపి సానుకూలంగా స్పందించి మేము సహకరిస్తామని ఎలాంటి ఇబ్బందులు కానివ్వమని తెలిపారు. కార్యక్రమంలో పటేల్ ప్రసాద్, స్వామి, రామరాజు, కిషన్, రాహుల్ ,ప్రతాప్ ,చోటు, మహేష్ తదితరులు పాల్గొన్నారు.
విద్యార్థుల్లో సేవాభావం పెంపొందించే స్కౌట్స్ & గైడ్స్ ఉద్యమం : కంకణాల రాంరెడ్డి
Posted On 2026-07-12 16:55:14
Readmore >
బాన్సువాడలో పోలీసు వ్యవస్థకు నూతన ఊపు... రూ.44 లక్షలతో 4 భవనాల ప్రారంభం
Posted On 2026-07-12 16:48:16
Readmore >
తెలంగాణకు మూడు బులెట్ ట్రైన్స్ : కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్
Posted On 2026-07-12 03:35:06
Readmore >
ఆరుగురిని చంపిన నిందితుడిపై రూ.2 లక్షల రివార్డు ప్రకటించిన పోలీసులు
Posted On 2026-07-11 17:04:24
Readmore >