| Daily భారత్
Logo




కామారెడ్డిలో వరద పరిస్థితిపై ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్న రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క

News

Posted on 2025-08-28 08:39:20

Share: Share


కామారెడ్డిలో వరద పరిస్థితిపై ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్న రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క

తాజా వరద పరిస్థితిపై అధికారులతో సమీక్షించిన మంత్రి

డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్:కామారెడ్డి జిల్లాలో వరద పరిస్థితులపై హైదరాబాద్ నుంచి జిల్లా ఇన్చార్జి మంత్రి సీతక్క టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సమావేశంలో ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ, జహీరాబాద్ ఎంపీ సురేష్ షెట్ట్కర్, కలెక్టర్, ఎస్పీతో పాటు అన్ని విభాగాల జిల్లా అధికారులు పాల్గొన్నారు.

అధికారులు జిల్లాలోని వర్షాల తీవ్రత, వరద ఉధృతి, నష్ట పరిస్థితులపై మంత్రికి వివరాలు అందించారు. వర్షం తగ్గుముఖం పట్టినప్పటికీ, ఎలాంటి అప్రమత్తత లోపం జరగకుండా చూడాలని మంత్రి సీతక్క స్పష్టం చేశారు. వర్షం పూర్తిగా ఆగే వరకు సహాయక చర్యలు నిరంతరం కొనసాగించాలని ఆదేశాలు జారీ చేశారు. ప్రభావిత ప్రాంతాల్లో అధికారులు ప్రత్యక్ష పర్యటనలు నిర్వహించాలని సూచించారు. లోతట్టు ప్రాంతాల ఇళ్లను పరిశీలించి, నీరు చేరిన ఇళ్లలోని ప్రజలను వెంటనే పునరావాస కేంద్రాలకు తరలించాలని ఆదేశించారు. నీటి ముంపు ఉన్న ఇళ్ల నుంచి నీరు బయటకు పంపే చర్యలు చేపట్టాలన్నారు. విద్యుత్, వ్యవసాయ, మంచినీటి సరఫరా, పంచాయతీరాజ్ శాఖలు తక్షణమే నష్టాన్ని అంచనా వేసి నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. అధికారులు క్షేత్రస్థాయిలో అందుబాటులో ఉండి ప్రజలకు మనోధైర్యం కల్పించాలన్నారు. గ్రామాల్లో శానిటేషన్ పనులను వేగవంతం చేసి వ్యాధులు వ్యాప్తి చెందకుండా చూడాలన్నారు. వాగులు, చెరువుల వద్దకు ప్రజలు వెళ్లకుండా నియంత్రణ చర్యలు చేపట్టాలన్నారు.

ముంపు ప్రభావిత ప్రాంతాల్లో ముందస్తు హెచ్చరికలు జారీ చేసి ప్రజలను అప్రమత్తం చేయాలని సూచనలు చేశారు. ఎక్కడా ప్రాణ నష్టం జరగకుండా అత్యంత జాగ్రత్తలు పాటించాలన్నారు.

వాతావరణం అనుకూలించగానే స్వయంగా జిల్లాలో పర్యటించి పరిస్థితులను సమీక్షిస్తామని మంత్రి సీతక్క తెలిపారు.

Image 1

విజయవాడ ఆటోనగర్‌లో భారీ అగ్ని ప్రమాదం... 7 బస్సులు దగ్ధం

Posted On 2026-07-12 10:39:25

Readmore >
Image 1

కామారెడ్డి పట్టణంలో రెడ్డి చికెన్ మార్కెట్ ప్రారంభం

Posted On 2026-07-12 09:55:45

Readmore >
Image 1

ముఖ్యమంత్రి పీఠంపై ఉండి హుందాతనం కోల్పోయిన రేవంత్ రెడ్డి

Posted On 2026-07-12 09:34:30

Readmore >
Image 1

తెలంగాణకు మూడు బులెట్ ట్రైన్స్ : కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్

Posted On 2026-07-12 03:35:06

Readmore >
Image 1

ప్రముఖ లెజెండరీ సింగర్ ఎస్.జానకి కన్నుమూత

Posted On 2026-07-11 17:25:49

Readmore >
Image 1

ఆరుగురిని చంపిన నిందితుడిపై రూ.2 లక్షల రివార్డు ప్రకటించిన పోలీసులు

Posted On 2026-07-11 17:04:24

Readmore >
Image 1

సిరిసిల్లలో ఆస్తి కోసం మేనమామ హత్య... నిందితుడు అరెస్ట్

Posted On 2026-07-11 16:48:18

Readmore >
Image 1

నిందితుడిని పోలీసులే కాపాడుతున్నారు...బాలిక మేనమామ నరేష్

Posted On 2026-07-11 16:27:29

Readmore >
Image 1

జూదంపై బిచ్కుంద పోలీసులు దాడి... ముగ్గురు పట్టివేత

Posted On 2026-07-11 15:49:13

Readmore >
Image 1

పొల్యూషన్ సర్టిఫికెట్‌పై వాహనదారులకు ఊరట!

Posted On 2026-07-11 15:19:25

Readmore >