Posted on 2025-08-28 08:22:25
ఇలాంటి పరిస్థితుల్లో ప్రజలు ఎలాంటి అపోహాలను నమ్మవద్దు
ప్రజల భద్రతా దృష్ట్యా 24 X 7 పోలీస్ అధికారులు , సిబ్బంది అప్రమత్తంగా ఉండాలి.
సీపీ సాయి చైతన్య ఆదేశాలు జారి
డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్: నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు పడుతున్న సందర్భంగా ప్రజలు అప్రమత్తంగా ఉండవలెను ఎవరు కూడా అనవసరంగా బయటకు వెళ్లొద్దని ప్రజలను కోరారు.
గణేష్ మండలి నిర్వాహకులు మండపం వద్ద తగు జాగ్రత్తలు తప్పనిసరి పాటించాలి ప్రధానంగా విద్యుత్ తీగల వద్దకు ఎవరు వెళ్ళవద్దని సూచించారు. ముంపు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు.
పొంగిపొర్లనున్న వాగులు, వంకలు వద్దకు వెళ్లవద్దని, జలాశయాలు, చెరువులు, కుంటలు చూడడానికి వెళ్లకూడదు – ప్రమాదానికి గురయ్యే అవకాశముంది. కావున అట్టి ప్రదేశాలకు ప్రజలు ఎవరు కూడా వెళ్లకూడదన్నారు. వ్యవసాయ పనుల నిమిత్తం పొలాలకు వెళ్లే రైతులు తగిన జాగ్రత్తలు పాటించాలని సూచించారు.
పురాతన కట్టడాలు లేదా పురాతనమైన ఇండ్లు పురాతనమైన గోడలు ఉన్నట్లయితే వర్షతాకిడికి నాని కింద పడే అవకాశాలు ఉన్నాయి కావున ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు.ఎక్కడైనా వరద ఉదృతి తలెత్తిన సందర్భంలో పోలీసు సిబ్బంది, అధికారులు వెంటనే స్పందించి సహాయక చర్యలు చేపట్టి ప్రాణ నష్టం లేకుండా చూడాలని అధికారులకు, సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు. వినాయక విగ్రహం ప్రతిష్టించిన చోటా మండపము నిర్వాహకులు తప్పనిసరిగా అన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవాలి ఎవరు కూడా కరెంటు తీగల వద్దకు వెళ్ళకుండ అప్రమత్తంగా ఉండాలన్నారు.రెవెన్యూ , మునిసిపల్ , వ్యవసాయం , గ్రామీణాభివృద్ధి , పశుసంవర్ధక , ప్రజా రవాణా, నీటిపారుదల వంటి అన్ని విభాగాలతో సరైన సమన్వయం చేసుకోవాలి అని సంబంధిత పోలీసు అధికారులకు ఆదేశాలు జారీ చేయడం జరిగింది.అత్యవసర సమయంలో డయల్ 100 ( లేదా )పోలీస్ కంట్రోల్ రూమ్ నెంబర్:8712659700( లేదా) సంబంధిత పోలీస్ స్టేషన్ ఫోన్ నెంబర్ కు సంప్రదించాలని సూచించారు.
తెలంగాణకు మూడు బులెట్ ట్రైన్స్ : కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్
Posted On 2026-07-12 03:35:06
Readmore >
ఆరుగురిని చంపిన నిందితుడిపై రూ.2 లక్షల రివార్డు ప్రకటించిన పోలీసులు
Posted On 2026-07-11 17:04:24
Readmore >