Posted on 2025-09-12 12:12:20
రానున్న నాలుగు రోజులు రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు కురువనున్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి లో నిర్వహించనున్న కృతజ్ఞత సభ వాయిదా..
ఇటీవల కామారెడ్డిలో ఏర్పడ్డ వరద ప్రభావం వల్ల కోలుకోని ప్రజల మధ్య సభ నిర్వహించడం మంచిది కాదంటూ కాంగ్రెస్లోని మరికొందరు సీనియర్ నేతల భిన్నాభిప్రాయాలు...
డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్:కాంగ్రెస్ పార్టీ ఈ నెల 15న కామారెడ్డిలో నిర్వహించ తలపెట్టిన బీసీ కృతజ్ఞత సభ వాయిదా పడింది. భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో సభను వాయిదా వేయాలని అధికార పార్టీ నిర్ణయించింది. 42 శాతం బీసీ రిజర్వేషన్లపై మేనిఫెస్టోలో ఇచ్చిన హామీని నిలబెట్టుకున్న తరుణంలో బహిరంగ సభ నిర్వహించాలని కాంగ్రెస్ పార్టీ తలచింది. ఎక్కడైతే బీసీ డిక్లరేషన్ సభ నిర్వహించారో అక్కడే కృతజ్ఞత సభ నిర్వహించాలని నిర్ణయించింది. గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ కామారెడ్డిలో జరిగిన బహిరంగ సభలో బీసీ డిక్లరేషన్‌ను విడుదల చేసింది. అప్పట్లో పార్టీ అగ్ర నేతలతో పాటు కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్యను ఆహ్వానించింది. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన హస్తం పార్టీ.. బీసీలకు ఇచ్చిన హామీ మేరకు 42 శాతం అమలు కోసం అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపంచింది. అది ప్రస్తుతం రాష్ట్రపతి వద్ద పెండింగ్‌లో ఉంది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో రిజర్వేషన్లపై పరిమితి ఎత్తివేస్తూ, బీసీలకు 42 శాతం కోటా పెంచుతూ జీవో జారీ చేసింది. అయితే ఇప్పటికే ముఖ్యమంత్రి కృతజ్ఞత సభకు ఏర్పాట్లు కూడా ప్రారంభమయ్యాయి. పలువురు మంత్రులు కూడాఎప్పటికప్పుడు ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. అయితే, సభకు గడువు సమీపిస్తున్న తరుణంలో వాతావరణం ప్రతికూలంగా మారింది. మరో నాలుగైదు రోజుల పాటు రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ప్రకటించింది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ సభను వాయిదా వేయాలని నిర్ణయించింది. మళ్లీ ఎప్పుడు నిర్వహించేది త్వరలోనే ఆ పార్టీ శ్రేణుల నుండి వినికిడి వినిపిస్తుంది.
"ఆరోగ్య సమస్యల అవగాహనపై నర్సింగ్ విద్యార్థుల క్షేత్ర పర్యటన"
Posted On 2026-07-11 13:59:01
Readmore >
శబరిమలలో కీలక సంస్కరణలను ప్రవేశపెట్టిన దేవస్వంబోర్డు అధ్యక్షుడు కె. జయకుమార్
Posted On 2026-07-11 13:49:13
Readmore >
రెండు చోట్ల ఓటు ఉంటే ఏడాది జైలు : రాష్ట్ర అధికారి సి.సుదర్శన్‌రెడ్డి
Posted On 2026-07-11 13:46:55
Readmore >
షాబాద్ ఆరు హత్యల కేసులో రాజ్‌కుమార్‌పై ఎఫ్ఐఆర్ లో కీలక అంశాలు
Posted On 2026-07-11 13:46:16
Readmore >
భద్రాద్రి కొత్తగూడెం : టిఆర్ హ్యూమన్ రైట్స్ యాంటీ కరప్షన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గుర్తింపు కార్డుల పంపిణీ
Posted On 2026-07-11 13:44:17
Readmore >
ఇందిరమ్మ ఇల్లు ఇప్పిస్తానని ₹1 లక్ష డిమాండ్... సిరిసిల్ల మున్సిపల్ వైస్ చైర్మన్ వైస్ చైర్మన్‌పై కేసు
Posted On 2026-07-10 18:53:44
Readmore >
క్షణాల్లో స్పందించిన పిట్లం పోలీసులు : ఆత్మహత్యాయత్నం నుంచి మహిళకు రక్షణ
Posted On 2026-07-10 18:24:01
Readmore >