| Daily భారత్
Logo




డా. చిటికెన కిరణ్ కుమార్ కు రాజన్న సిరిసిల్ల జిల్లా సాహితీ సమితి సన్మానం

News

Posted on 2025-10-02 12:05:35

Share: Share


డా. చిటికెన కిరణ్ కుమార్ కు రాజన్న సిరిసిల్ల జిల్లా సాహితీ సమితి సన్మానం

డైలీ భారత్, రాజన్న సిరిసిల్ల: డా. చిటికెన కిరణ్ కుమార్ ను రాజన్న సిరిసిల్ల జిల్లా సాహితీ సమితి గురువారం సిరిసిల్లలో సన్మానించారు. సాహిత్యంలో కథా, కవిత, విమర్శలలో తనదైన ముద్ర వేసిన  ఇంటర్నేషనల్ బెనెవోలెంట్ రీసర్చ్ ఫోరం సభ్యుడు, ఓ తండ్రి తీర్పు లఘు చిత్ర కథకులు, ప్రముఖ సాహితీవేత్త డాక్టర్ చిటికెన కిరణ్ కుమార్ ను ఇటీవల అఖిల భారత పద్మశాలి సంక్షేమ సంఘం వారు హైదరాబాద్ లో జాతీయ కవి, స్వర్గీయ డా.వడ్డేపల్లి కృష్ణ జాతీయ సాహిత్య తొలి పురస్కారంతో సత్కరించారు. ఈ సందర్భంగా రాజన్న సిరిసిల్ల జిల్లా సాహితీ సమితి అధ్యక్షులు డా.జనపాల శంకరయ్య, ప్రధాన కార్యదర్శి వెంగళ లక్ష్మణ్  లు కిరణ్ కుమార్ ను సిరిసిల్లలో సన్మానించారు. సాహితీ సమితి అధ్యక్షులు డా. జానపాల శంకరయ్య మాట్లాడుతూ వంద పైచిలుకు పత్రికలలో చిటికెన రచనలు చేయడం చాలా గొప్ప విషయం అని తెలిపారు. ప్రధాన కార్యదర్శి వెంగళ లక్ష్మణ్ మాట్లాడుతూ  వేలాది లలిత గీతాలు రాసిన మహాకవి వడ్డేపల్లి కృష్ణ తొలి పురస్కారం చిటికెన అందుకోవడం మనకు గర్వించదగ్గ విషయమని అన్నారు. ముందు ముందు మరిన్ని పురస్కారాలు డా. చిటికెన కిరణ్ కుమార్ అందుకోవాలని  ఆకాంక్షించారు. గాంధీ జయంతి పూర్వ ప్రధాని జై జవాన్ జై కిసాన్ అంటూ సైనికులకు ఊపిరినూదిన లాల్ బహదూర్ శాస్త్రి జయంతి ఘనంగా జరిగింది.

కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా  జిల్లా గ్రంధాలయ సంస్థ పూర్వ అధ్యక్షులు ఆకునూరి శంకరయ్య, రాజన్న సిరిసిల్ల జిల్లా సాహితి సమితి సహా అధ్యక్షులు కోడం నారాయణ, సంఘ సేవకులు  దొంత దేవదాస్, వ్యాపారవేత్త  ఏనుగుల ఎల్లయ్య, లక్ష్మీరాజం తదితరులు పాల్గొన్నారు.

Image 1

ఎస్సీ సెల్ జూలూరుపాడు మండల అధ్యక్షుడు గా మంద బాబు

Posted On 2026-07-10 06:26:41

Readmore >
Image 1

తెలంగాణను దేశంలోనే అగ్రగామి పారిశ్రామిక రాష్ట్రంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యం : ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి

Posted On 2026-07-10 03:55:48

Readmore >
Image 1

తలసేమియా లైఫ్ సేవర్ అవార్డును అందుకున్న వాసవి క్లబ్ బీబీపేట్

Posted On 2026-07-09 15:56:35

Readmore >
Image 1

పోలీసు స్టేష‌న్ స్థ‌లాన్ని కాపాడిన హైడ్రా

Posted On 2026-07-08 19:27:58

Readmore >
Image 1

మహిళలు, చిన్నారులకు భరోసా... బాధితులకు అండగా జిల్లా భరోసా కేంద్రం

Posted On 2026-07-08 14:21:40

Readmore >
Image 1

సర్పంచుల ఫోరం రాష్ట్ర అధ్యక్షులు భూమన్న యాదవ్ ను కలిసిన బిక్కనూరు మండల సర్పంచులు

Posted On 2026-07-08 14:18:42

Readmore >
Image 1

వైరా నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం దృష్టికి బహిరంగ విజ్ఞప్తి

Posted On 2026-07-08 07:55:23

Readmore >
Image 1

ప్రభుత్వ ఆసుపత్రిలో దారుణ హత్య.. కత్తితో భార్య గొంతు కోసిన భర్త

Posted On 2026-07-08 07:13:19

Readmore >
Image 1

రాజన్న సిరిసిల్ల డబుల్ మర్డర్: భూ వివాదంతో రెండు హత్యలు, నిందితుడికి యావజ్జీవ ఖైదు

Posted On 2026-07-07 14:17:19

Readmore >
Image 1

పేలుళ్ల కేసులో గుజరాత్ హైకోర్టు సంచలన తీర్పు

Posted On 2026-07-07 14:05:48

Readmore >