Posted on 2025-10-04 18:12:30
నిందితుల్లో ఒకరిని అరెస్టు చేసిన పోలీసులు
కామారెడ్డి సబ్ డివిజన్ ఎస్పీ చైతన్య రెడ్డి వెల్లడి..
డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్:విజయదశమి రోజు అర్ధరాత్రి కలకలం రేపిన దాడుల ఘటనపై పోలీసులు విచారణ ముమ్మరం చేశారు. ఘటనకు కారకులైన ఒకరిని అరెస్ట్ చేసి రిమాండ్ చేశారు.
ఈ మేరకు శనివారం తన కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో కామారెడ్డి సబ్ డివిజన్ ఏఎస్పీ చైతన్య రెడ్డి వివరాలు వెల్లడించారు. విజయదశమి రోజు అర్ధరాత్రి తమకు ‘100’కు కాల్ వచ్చిందని, వెంటనే తమ సిబ్బంది ఆ ప్రాంతానికి వెళ్లగా.. అక్కడ రెండు గ్రూప్లు కొట్టుకుంటున్నాయని తెలిపారు. ఈ ఘటనలో పలువురిని అదుపులోకి తీసుకుని విచారించగా గాజుముక్కతో దాడి జరిగినట్లు తేలిందన్నారు. అలాగే కేతన్, ప్రఫుల్ అనే ఇద్దరు యువకులపై సిద్దార్థ్ అనే వ్యక్తి పాత కక్షల నేపథ్యంలో గాజు ముక్కతో దాడి చేశాడన్నారు. ఈ దాడిలో నలుగురికి గాయాలయ్యాయని, సిద్దార్థ్ అనే వ్యక్తిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లు తెలిపారు. చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు ఎవరు పాల్పడినా వదిలిపెట్టేది లేదని ఏఎస్పీ హెచ్చరించారు. సమావేశంలో పట్టణ సీఐ నరహరి పాల్గొన్నారు.
తెలంగాణను దేశంలోనే అగ్రగామి పారిశ్రామిక రాష్ట్రంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యం : ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి
Posted On 2026-07-10 03:55:48
Readmore >
తలసేమియా లైఫ్ సేవర్ అవార్డును అందుకున్న వాసవి క్లబ్ బీబీపేట్
Posted On 2026-07-09 15:56:35
Readmore >
మహిళలు, చిన్నారులకు భరోసా... బాధితులకు అండగా జిల్లా భరోసా కేంద్రం
Posted On 2026-07-08 14:21:40
Readmore >
సర్పంచుల ఫోరం రాష్ట్ర అధ్యక్షులు భూమన్న యాదవ్ ను కలిసిన బిక్కనూరు మండల సర్పంచులు
Posted On 2026-07-08 14:18:42
Readmore >
వైరా నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం దృష్టికి బహిరంగ విజ్ఞప్తి
Posted On 2026-07-08 07:55:23
Readmore >
ప్రభుత్వ ఆసుపత్రిలో దారుణ హత్య.. కత్తితో భార్య గొంతు కోసిన భర్త
Posted On 2026-07-08 07:13:19
Readmore >
రాజన్న సిరిసిల్ల డబుల్ మర్డర్: భూ వివాదంతో రెండు హత్యలు, నిందితుడికి యావజ్జీవ ఖైదు
Posted On 2026-07-07 14:17:19
Readmore >