Posted on 2025-10-05 08:04:49
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని ఏజెన్సీ ప్రాంత ప్రజలకు పోలీస్ శాఖ ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటుంది : భద్రాచలం ఏఎస్పీ విక్రాంత్ కుమార్ సింగ్ ఐపిఎస్
డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం:భద్రాద్రి కొత్తగూడెంజిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపిఎస్ ఆదేశాల మేరకు చర్ల మండలంలోని ఛత్తీస్ఘడ్ రాష్ట్ర సరిహద్దు గ్రామాలైన బట్టిగూడెం,బత్తినపల్లి మరియు రామచంద్రాపురం గ్రామాలను భద్రాచలం ఏఎస్పి విక్రాంత్ కుమార్ సింగ్ ఐపిఎస్ సందర్శించారు.CRPF 141Bn కంపెనీ కమాండర్ సెబాస్టియన్,చర్ల సీఐ రాజు వర్మ మరియు ఇతర పోలీస్ అధికారులు,సిబ్బందితో కలిసి ఈ మూడు మావోయిస్ట్ ప్రభావిత గ్రామాల్లోని 120 కుటుంబాలను సందర్శించారు.వరద ప్రభావిత ప్రాంతాల్లో నివసిస్తున్న ఈ మూడు గ్రామాల ప్రజలకు nestle కంపెనీ వారి సహకారంతో నిత్యావసర వస్తువులను అందించారు.ఈ సందర్భంగా ఏఎస్పీ మాట్లాడుతూ జిల్లా ఎస్పీ సారథ్యంలో ఏజెన్సీ ప్రజలకు పోలీస్ శాఖ ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటుందని,మావోయిస్ట్ ప్రభావిత ప్రాంతాల్లో నివసించే ఆదివాసీలకు విద్య,వైద్యం,రవాణా వంటి కనీస సౌకర్యాలను కల్పించడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని అన్నారు.ఇందులో భాగంగానే జిల్లాలో ఏజెన్సీ ప్రాంతాల్లో ఇప్పటివరకు ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టడం జరిగిందని తెలిపారు.వరద ప్రభావిత ప్రాంతాల్లో నివసించే అదీవాసీ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.వర్షాల అనంతరం పరిసర ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని అన్నారు.డెంగీ,మలేరియా వంటి విషజ్వరాల బారిన పడకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు.అభివృద్ధి నిరోధకులైన నిషేదిత మావోయిస్టులకు ఎవ్వరూ సహకరించవద్దని కోరారు.ప్రత్యక్షంగానైనా,పరోక్షంగానైనా మావోయిస్టులకు సహకరిస్తే,అట్టి వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకొనబడతాయని అన్నారు.మారుమూల ఏజెన్సీ ప్రజలకు నిత్యావసర వస్తువులను అందించడానికి ముందుకొచ్చిన Nestle కంపెనీ వారికి ఈ సందర్బంగా ప్రత్యేక ధన్యవాదములు తెలిపారు.
తెలంగాణను దేశంలోనే అగ్రగామి పారిశ్రామిక రాష్ట్రంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యం : ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి
Posted On 2026-07-10 03:55:48
Readmore >
తలసేమియా లైఫ్ సేవర్ అవార్డును అందుకున్న వాసవి క్లబ్ బీబీపేట్
Posted On 2026-07-09 15:56:35
Readmore >
మహిళలు, చిన్నారులకు భరోసా... బాధితులకు అండగా జిల్లా భరోసా కేంద్రం
Posted On 2026-07-08 14:21:40
Readmore >
సర్పంచుల ఫోరం రాష్ట్ర అధ్యక్షులు భూమన్న యాదవ్ ను కలిసిన బిక్కనూరు మండల సర్పంచులు
Posted On 2026-07-08 14:18:42
Readmore >
వైరా నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం దృష్టికి బహిరంగ విజ్ఞప్తి
Posted On 2026-07-08 07:55:23
Readmore >
ప్రభుత్వ ఆసుపత్రిలో దారుణ హత్య.. కత్తితో భార్య గొంతు కోసిన భర్త
Posted On 2026-07-08 07:13:19
Readmore >
రాజన్న సిరిసిల్ల డబుల్ మర్డర్: భూ వివాదంతో రెండు హత్యలు, నిందితుడికి యావజ్జీవ ఖైదు
Posted On 2026-07-07 14:17:19
Readmore >