Posted on 2025-10-05 16:49:28
స్థానిక సంస్థలు ఉన్నాయని ప్రకృతి విపత్తులపై రాజకీయాలు చేయడం సిగ్గుమాలిన చర్య
హరీష్ రావు కామారెడ్డి జిల్లాలో పర్యటనపై ప్రభుత్వ సలహాదారుడు షబ్బీర్ అలీ విమర్శలు
డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్:కామారెడ్డి జిల్లా ప్రజలు వరదలతో అల్లాడితే నెలరోజుల తర్వాత తీరిగ్గా వచ్చి పరామర్శిస్తారా.. అంటూ మాజీ మంత్రి హరీశ్ రావును రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ ప్రశ్నించారు. హరీష్ రావు ఎల్లారెడ్డి నియోజకవర్గంలో వరద బాధితులను పరామర్శించడాన్ని తప్పుబట్టారు. ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేశారు.
ప్రకృతి విపత్తుపై రాజకీయం చేయడం సిగ్గుచేటని షబ్బీర్ అలీ విమర్శించారు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్న పదేళ్లలో వర్షాలు, వడగళ్ల వానలతో ఎన్నోసార్లు పంట నష్టం జరిగినా ఏ ఒక్కసారి కూడా రైతులను ఆదుకోలేదన్నారు. ప్రస్తుతం హరీష్ రావు ఇక్కడి ప్రజలపై ప్రేమతో రాలేదని, స్థానిక ఎన్నికల్లో పరువు కాపాడుకోవడానికి వచ్చారని విమర్శించారు. కుటుంబ సమస్యల నుంచి తేరుకొని బాధితులను పరామర్శించడానికి నెల రోజులు పట్టిందని ఎద్దేవా చేశారు. నాడు ప్రజల నివాసాలు నీళ్లలో కొట్టుకుపోయి హాహాకారాలు చేస్తుంటే బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు ఎటుపోయారని ప్రశ్నించారు. వర్షాల్లో ప్రమాదమని తెలిసి కూడా సీఎం రేవంత్ రెడ్డి హెలికాప్టర్లో ముంపు ప్రాంతాలు పరిశీలించడానికి వచ్చారని పేర్కొన్నారు. వాతావరణం అనుకూలించక ప్రజలను పరామర్శించలేకపోయారన్నారు. తిరిగి రెండు రోజుల్లో వచ్చి నష్టపోయిన రైతులతో మాట్లాడి వారి కుటుంబాలకు తక్షణ సహాయం కింద రూ.11వేలు, చనిపోయిన వారి కుటుంబాలకు రూ.4 లక్షలు అందించారని గుర్తు చేశారు. కలెక్టర్ కార్యాలయంలో రివ్యూ నిర్వహించి అధికారులను సర్వే చేసి నివేదిక ఇవ్వాలని ఆదేశించారని, అధికారుల నివేదికను కేంద్రానికి పంపించారన్నారు.
తెలంగాణను దేశంలోనే అగ్రగామి పారిశ్రామిక రాష్ట్రంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యం : ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి
Posted On 2026-07-10 03:55:48
Readmore >
తలసేమియా లైఫ్ సేవర్ అవార్డును అందుకున్న వాసవి క్లబ్ బీబీపేట్
Posted On 2026-07-09 15:56:35
Readmore >
మహిళలు, చిన్నారులకు భరోసా... బాధితులకు అండగా జిల్లా భరోసా కేంద్రం
Posted On 2026-07-08 14:21:40
Readmore >
సర్పంచుల ఫోరం రాష్ట్ర అధ్యక్షులు భూమన్న యాదవ్ ను కలిసిన బిక్కనూరు మండల సర్పంచులు
Posted On 2026-07-08 14:18:42
Readmore >
వైరా నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం దృష్టికి బహిరంగ విజ్ఞప్తి
Posted On 2026-07-08 07:55:23
Readmore >
ప్రభుత్వ ఆసుపత్రిలో దారుణ హత్య.. కత్తితో భార్య గొంతు కోసిన భర్త
Posted On 2026-07-08 07:13:19
Readmore >
రాజన్న సిరిసిల్ల డబుల్ మర్డర్: భూ వివాదంతో రెండు హత్యలు, నిందితుడికి యావజ్జీవ ఖైదు
Posted On 2026-07-07 14:17:19
Readmore >