| Daily భారత్
Logo




టమోటా రైతులకు అండగా ఉంటాం : మంత్రి అచ్చెన్నాయుడు

News

Posted on 2025-10-06 14:01:14

Share: Share


టమోటా రైతులకు అండగా ఉంటాం : మంత్రి అచ్చెన్నాయుడు

రైతులు ఆందోళన చెందొద్దని హామీ ఇచ్చిన మంత్రి అచ్చెన్నాయుడు

డైలీ భారత్, అమరావతి: రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు టమోటా ధరలపై రైతులకు భరోసా ఇచ్చారు. ఏవైనా ఇబ్బందులు తలెత్తినపుడు, రైతులకు ఎటువంటి నష్టం కలగకుండా ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని మంత్రి హామీ ఇచ్చారు. ఆదివారం రాప్తాడు మార్కెట్‌లో టమోటా ధరలు గరిష్టం రూ.18, కనిష్టం రూ.9, మోడల్ ధర రూ.12గా ఉన్నాయి. 30–40 మెట్రిక్ టన్నుల సరుకు పత్తికొండ మార్కెట్‌కు వస్తుందని, దసరా సెలవుల కారణంగా 10 టన్నులు అదనంగా చేరినట్లు, రోడ్లపై 2వ గ్రేడ్ క్వాలిటీ టమాటాలు వేసి గందరగోళం సృష్టించబడినట్లు మంత్రి వివరించారు. ఇప్పటివరకు 10 మెట్రిక్ టన్నుల టమోటాలను వివిధ రైతు బజార్లకు పంపించామని, ఈ రోజు పత్తికొండ మార్కెట్ నుంచి 10 మెట్రిక్ టన్నులు చిత్తూరు ప్రొసెసింగ్ యూనిట్‌కు, 15 మెట్రిక్ టన్నులు రైతు బజార్లకు పంపిణీ చేయనున్నట్లు చెప్పారు. తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్రకు సరుకు వర్షాల కారణంగా తగ్గిన నేపథ్యంలో, ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల వల్ల టమాటా అమ్మకాలు మందగించాయని మంత్రి అచ్చెన్నాయుడు వివరించారు. ప్రస్తుతం టమాటాలకు ట్రెండింగ్ ధర బట్టి రైతులకు మంచి ధర లభిస్తోంది. ఏవైనా ఇబ్బందులు తలెత్తితే ప్రభుత్వం అన్ని విధాలుగా రైతులను ఆదుకుంటుందని మంత్రి హామీ ఇచ్చారు.

Image 1

తెలంగాణను దేశంలోనే అగ్రగామి పారిశ్రామిక రాష్ట్రంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యం : ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి

Posted On 2026-07-10 03:55:48

Readmore >
Image 1

తలసేమియా లైఫ్ సేవర్ అవార్డును అందుకున్న వాసవి క్లబ్ బీబీపేట్

Posted On 2026-07-09 15:56:35

Readmore >
Image 1

పోలీసు స్టేష‌న్ స్థ‌లాన్ని కాపాడిన హైడ్రా

Posted On 2026-07-08 19:27:58

Readmore >
Image 1

మహిళలు, చిన్నారులకు భరోసా... బాధితులకు అండగా జిల్లా భరోసా కేంద్రం

Posted On 2026-07-08 14:21:40

Readmore >
Image 1

సర్పంచుల ఫోరం రాష్ట్ర అధ్యక్షులు భూమన్న యాదవ్ ను కలిసిన బిక్కనూరు మండల సర్పంచులు

Posted On 2026-07-08 14:18:42

Readmore >
Image 1

వైరా నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం దృష్టికి బహిరంగ విజ్ఞప్తి

Posted On 2026-07-08 07:55:23

Readmore >
Image 1

ప్రభుత్వ ఆసుపత్రిలో దారుణ హత్య.. కత్తితో భార్య గొంతు కోసిన భర్త

Posted On 2026-07-08 07:13:19

Readmore >
Image 1

రాజన్న సిరిసిల్ల డబుల్ మర్డర్: భూ వివాదంతో రెండు హత్యలు, నిందితుడికి యావజ్జీవ ఖైదు

Posted On 2026-07-07 14:17:19

Readmore >
Image 1

పేలుళ్ల కేసులో గుజరాత్ హైకోర్టు సంచలన తీర్పు

Posted On 2026-07-07 14:05:48

Readmore >
Image 1

ప్రియుడు కోసం మెడపై నుంచి తోసేసి చావకపోతే.. హార్పిక్‌ ఎక్కించి భర్తను చంపేసిన భార్య

Posted On 2026-07-07 14:04:52

Readmore >