Posted on 2025-10-06 16:17:55
దొంగతనం కేసులో ఇద్దరు వ్యక్తులకు మూడు సంవత్సరాల జైలు శిక్షతోపాటు ఐదు వేల రూపాయల జరిమానా విధిస్తూ సిరిసిల్ల ప్రథమ న్యాయమూర్తి ప్రవీణ్ సోమవారం తీర్పు వెల్లడించినట్లు సిరిసిల్ల పట్టణ సీఐ కృష్ణ తెలిపారు.
డైలీ భారత్, సిరిసిల్ల: సిరిసిల్ల చెందిన ఆడెపు లక్ష్మణ్ తేది 7.10.2017 నాడు కళ్యాణ లక్ష్మి ఫంక్షన్ హాల్ లో కొడుకు ప్రశాంత్ వివాహం సందర్భంగా మధ్యాహ్నం 12 గంటలకు ఇంటికి తాళం వేసి పోయినాడు.రెండు గంటలకు ఇంటిలో కిరాయికి ఉన్నవారు భోజనాల అనంతరం వచ్చి చూడగా ఇంటికి వేసిన తాళం పగలగొట్టబడి తలుపులు తెరిచి ఉండగా వారు మాకు తెలపగా వెంటనే మేము వచ్చి చూడగా హాలులో మరియు బెడ్ రూమ్లో గల ఇనుప బీరువాల తాళాలు తెరిచి ఉండి సామాన్లు చిందర వందరగా పడి వేసి ఉన్న ఈ బీరువాలో గల బంగారం మువ్వల హారం డజన్ 4 తులాలు ఒక బంగారు కమ్మలు జత, ఒక రింగ్ ఒక నాగపని బంగారు వీటి మొత్తం విలువ దాదాపు 80 వేల రూపాయలు కనిపించలేదు ఎవరో గుర్తుతెలియని దొంగలు పగలు మా ఇంటి తాళం పగలగొట్టి చొరబడి బంగారు నగలు ఎత్తుకు పోయినరని ఆడెపు లక్ష్మణ్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా ఎస్ఐ అంజయ్య కేసు నమోదు చేసినంతరం సి.ఐ శ్రీనివాసరావు దొంగతనం చేసిన నిందితులను పట్టుకొని రిమాండ్కు తరలించి అనంతరం కోర్టులో ఛార్జిషీట్ దాఖలు చేసినారు.
సీఎం ఎస్ ఎస్. ఐ.శ్రావణ్ ఆధ్వర్యంలో కోర్టు కానిస్టేబుల్ వేముల నరేష్ ఎనిమిది మంది(8) సాక్షులను ప్రవేశపెట్టగా ప్రాసిక్యూషన్ తరపున పబ్లిక్ ప్రాసిక్యూటర్ చేలుమల సందీప్ వాదించగా కేసు పూర్వపారాలు పరిశీలించిన న్యాయమూర్తి ప్రవీణ్ గారు నేరస్తులు అయినా బొడ్డు సాయి, పూదరి రాజులకు మూడు సంవత్సరాల కఠిన కారాగారా జైలు శిక్షతోపాటు ఒక్కొక్కరికి 5000 రూపాయల జరిమానా విధించడం జరిగిందని సిరిసిల్ల పట్టణ సిఐ కే .కృష్ణ తెలిపారు.
తెలంగాణను దేశంలోనే అగ్రగామి పారిశ్రామిక రాష్ట్రంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యం : ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి
Posted On 2026-07-10 03:55:48
Readmore >
తలసేమియా లైఫ్ సేవర్ అవార్డును అందుకున్న వాసవి క్లబ్ బీబీపేట్
Posted On 2026-07-09 15:56:35
Readmore >
మహిళలు, చిన్నారులకు భరోసా... బాధితులకు అండగా జిల్లా భరోసా కేంద్రం
Posted On 2026-07-08 14:21:40
Readmore >
సర్పంచుల ఫోరం రాష్ట్ర అధ్యక్షులు భూమన్న యాదవ్ ను కలిసిన బిక్కనూరు మండల సర్పంచులు
Posted On 2026-07-08 14:18:42
Readmore >
వైరా నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం దృష్టికి బహిరంగ విజ్ఞప్తి
Posted On 2026-07-08 07:55:23
Readmore >
ప్రభుత్వ ఆసుపత్రిలో దారుణ హత్య.. కత్తితో భార్య గొంతు కోసిన భర్త
Posted On 2026-07-08 07:13:19
Readmore >
రాజన్న సిరిసిల్ల డబుల్ మర్డర్: భూ వివాదంతో రెండు హత్యలు, నిందితుడికి యావజ్జీవ ఖైదు
Posted On 2026-07-07 14:17:19
Readmore >
ప్రియుడు కోసం మెడపై నుంచి తోసేసి చావకపోతే.. హార్పిక్ ఎక్కించి భర్తను చంపేసిన భార్య
Posted On 2026-07-07 14:04:52
Readmore >