| Daily భారత్
Logo




సర్వీస్ రివాల్వర్‌తో కాల్చుకొని IPS ఆఫీసర్ ఆత్మహత్య

News

Posted on 2025-10-07 13:17:27

Share: Share


సర్వీస్ రివాల్వర్‌తో కాల్చుకొని IPS ఆఫీసర్ ఆత్మహత్య

డైలీ భారత్, చండీగఢ్:IPS ఆఫీసర్ తన సర్వీస్ రివాల్వర్‌తో కాల్చుకొని ఆత్మహత్య చేసుకున్నారు. ఈ విషాద ఘటన చండీగఢ్‌లో మంగళవారం చోటుచేసుకుంది. హర్యానా క్యాడర్‌కు చెందిన సీనియర్ ఐపీఎస్ అధికారి వై. పూరణ్ కుమార్  ఆయన ఇంట్లో కాల్చుకుని సూసైడ్ చేసుకున్నారు. ఆయన ప్రస్తుతం అదనపు డీజీపీ హోదాలో ఉన్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, సెక్టార్ 11లోని తమ నివాసంలో పూరణ్ కుమార్ తన సర్వీస్ రివాల్వర్‌తో కాల్చుకుని మృతి చెందారు. కాల్పుల శబ్దం బయటకు వినిపించకుండా ఉండేందుకు ఆయన ఇంటి బేస్‌మెంట్‌లో ఈ ఘటనకు పాల్పడినట్లు సమాచారం. చాలాసేపటి తర్వాత ఆయన కూతురు బేస్‌మెంట్‌కు వెళ్లి చూడగా, తండ్రి మృతదేహం పడి ఉంది. ఆమె పోలీసులకు సమాచారం అందించారు.

పూరణ్ కుమార్ భార్య, హర్యానా క్యాడర్‌కు చెందిన ఐఏఎస్ అధికారిణి అయిన అమ్నీత్ పి. కుమార్ ఈ ఘటన జరిగిన సమయంలో ఇంట్లో లేరు. ఆమె ప్రస్తుతం హర్యానా ముఖ్యమంత్రి నాయబ్ సింగ్ సైనీ నేతృత్వంలో ఓ అధికారిక ప్రతినిధి బృందంతో కలిసి జపాన్ పర్యటనలో ఉన్నారు. వై. పూరణ్ కుమార్ ఆత్మహత్యకు గల కారణాలు ఇంకా తెలియరాలేదు. ఆయన సర్వీస్ రివాల్వర్‌ను సోమవారం తన గన్‌మ్యాన్ నుండి తీసుకున్నట్లు తెలుస్తోంది. వై.పూరణ్ కుమార్ తన కెరీర్‌లో సీనియారిటీ, అంతర్గత వ్యవహారాలపై తరచుగా అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారని హోం మంత్రి అనిల్ విజ్‌కు కూడా పలుమార్లు లేఖలు రాశారని తెలుస్తోంది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, ఫోరెన్సిక్ నిపుణులు దర్యాప్తు ప్రారంభించారు. సీనియర్ పోలీసు అధికారి ఆత్మహత్య చేసుకోవడం ఉన్నతాధికారులను, సహోద్యోగులను దిగ్భ్రాంతికి గురిచేసింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు విచారణ అనంతరం తెలియనున్నాయి.

Image 1

తెలంగాణను దేశంలోనే అగ్రగామి పారిశ్రామిక రాష్ట్రంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యం : ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి

Posted On 2026-07-10 03:55:48

Readmore >
Image 1

తలసేమియా లైఫ్ సేవర్ అవార్డును అందుకున్న వాసవి క్లబ్ బీబీపేట్

Posted On 2026-07-09 15:56:35

Readmore >
Image 1

పోలీసు స్టేష‌న్ స్థ‌లాన్ని కాపాడిన హైడ్రా

Posted On 2026-07-08 19:27:58

Readmore >
Image 1

మహిళలు, చిన్నారులకు భరోసా... బాధితులకు అండగా జిల్లా భరోసా కేంద్రం

Posted On 2026-07-08 14:21:40

Readmore >
Image 1

సర్పంచుల ఫోరం రాష్ట్ర అధ్యక్షులు భూమన్న యాదవ్ ను కలిసిన బిక్కనూరు మండల సర్పంచులు

Posted On 2026-07-08 14:18:42

Readmore >
Image 1

వైరా నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం దృష్టికి బహిరంగ విజ్ఞప్తి

Posted On 2026-07-08 07:55:23

Readmore >
Image 1

ప్రభుత్వ ఆసుపత్రిలో దారుణ హత్య.. కత్తితో భార్య గొంతు కోసిన భర్త

Posted On 2026-07-08 07:13:19

Readmore >
Image 1

రాజన్న సిరిసిల్ల డబుల్ మర్డర్: భూ వివాదంతో రెండు హత్యలు, నిందితుడికి యావజ్జీవ ఖైదు

Posted On 2026-07-07 14:17:19

Readmore >
Image 1

పేలుళ్ల కేసులో గుజరాత్ హైకోర్టు సంచలన తీర్పు

Posted On 2026-07-07 14:05:48

Readmore >
Image 1

ప్రియుడు కోసం మెడపై నుంచి తోసేసి చావకపోతే.. హార్పిక్‌ ఎక్కించి భర్తను చంపేసిన భార్య

Posted On 2026-07-07 14:04:52

Readmore >