| Daily భారత్
Logo




ప్రజాస్వామ్యానికి దొంగఓట్లు గొడ్డలి పెట్టు : మాజీ ఎమ్మెల్యే కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డి

News

Posted on 2025-10-07 13:01:18

Share: Share


ప్రజాస్వామ్యానికి దొంగఓట్లు గొడ్డలి పెట్టు : మాజీ ఎమ్మెల్యే కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డి

ఆకులమైలారంలో సంతకాల సేకరణలో కిచ్చెన్న

రాజ్యాంగం, రిజర్వేషన్లపై బీజేపీ దాడి చేస్తోంది

మహేశ్వరం నియోజకవర్గం కాంగ్రెస్ ఇన్ఛార్జి కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డి

డైలీ భారత్, రంగారెడ్డి జిల్లా: కాంగ్రెస్ కు అనుకూలంగా ఉన్న కొన్ని వర్గాల ఓట్లను బీజేపీ ఈసీ తొలగిస్తూ,కుట్రలకు పాల్పడుతున్నారని మహేశ్వరం నియోజకవర్గం కాంగ్రెస్ ఇన్ఛార్జి కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డి ఆరోపించారు.మంగళవారం  కందుకూరు మండలం ఆకులమైలారంలో ఓట్ల చోరీపై సంతకాల సేకరణ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కేఎల్ఆర్ హాజరయ్యారు.ఈ సందర్భంగా కేంద్ర సర్కార్ బీజేపీపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. రాజ్యాంగంపై దాడి చేయటం ఈసీతో కుమ్మక్కు అయి అర్హుల ఓట్లను తొలగిస్తున్నారని లక్ష్మారెడ్డి మండిపడ్డారు.

అంబేడ్కర్, జగ్జీవన్ రామ్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు.కులం, మతం ఆధారంగా ఓట్లను తొలగిస్తున్న కేంద్ర ప్రభుత్వంపై రాహుల్ గాంధీ ఇప్పటికే దేశవ్యాప్తంగా ఉద్యమిస్తున్నట్లు కేఎల్ఆర్ గుర్తు చేశారు.బీఆర్ఎస్ హయాంలో జల్ పల్లి మున్సిపాలిటీలో వేలాది దొంగఓట్లు నమోదు చేశారని కిచ్చెన్న ఆరోపించారు.అర్హుల ఓట్లు తొలగించినా... బయట వ్యక్తుల ఓట్లు నమోదు చేసినా... ఉద్యమించాలని మహేశ్వరం నియోజకవర్గం పిలుపునిచ్చారు.

రిజర్వేషన్లు, రాజ్యాంగాన్ని అంతం చేయాలని బీజేపీ చూస్తుందని కేఎల్ఆర్ విమర్శించారు. ప్రతీ బూత్ స్థాయిలో వంద సంతకాలు పెట్టించి ఈసీకి నిరసన తెలపాలని కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డి కోరారు.ఈ సందర్భంగా కేఎల్ఆర్ ఆధ్వర్యంలో పలు పార్టీల నాయకులు కాంగ్రెస్ కండువాలు కప్పుకున్నారు. ఈ కార్యక్రమంలో కందుకూరు, మహేశ్వరం మండల నాయకులు, మాజీ ప్రజాప్రతినిధులు, మహిళా విభాగం నాయకురాళ్లు పాల్గొన్నారు.

Image 1

తెలంగాణను దేశంలోనే అగ్రగామి పారిశ్రామిక రాష్ట్రంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యం : ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి

Posted On 2026-07-10 03:55:48

Readmore >
Image 1

తలసేమియా లైఫ్ సేవర్ అవార్డును అందుకున్న వాసవి క్లబ్ బీబీపేట్

Posted On 2026-07-09 15:56:35

Readmore >
Image 1

పోలీసు స్టేష‌న్ స్థ‌లాన్ని కాపాడిన హైడ్రా

Posted On 2026-07-08 19:27:58

Readmore >
Image 1

మహిళలు, చిన్నారులకు భరోసా... బాధితులకు అండగా జిల్లా భరోసా కేంద్రం

Posted On 2026-07-08 14:21:40

Readmore >
Image 1

సర్పంచుల ఫోరం రాష్ట్ర అధ్యక్షులు భూమన్న యాదవ్ ను కలిసిన బిక్కనూరు మండల సర్పంచులు

Posted On 2026-07-08 14:18:42

Readmore >
Image 1

వైరా నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం దృష్టికి బహిరంగ విజ్ఞప్తి

Posted On 2026-07-08 07:55:23

Readmore >
Image 1

ప్రభుత్వ ఆసుపత్రిలో దారుణ హత్య.. కత్తితో భార్య గొంతు కోసిన భర్త

Posted On 2026-07-08 07:13:19

Readmore >
Image 1

రాజన్న సిరిసిల్ల డబుల్ మర్డర్: భూ వివాదంతో రెండు హత్యలు, నిందితుడికి యావజ్జీవ ఖైదు

Posted On 2026-07-07 14:17:19

Readmore >
Image 1

పేలుళ్ల కేసులో గుజరాత్ హైకోర్టు సంచలన తీర్పు

Posted On 2026-07-07 14:05:48

Readmore >
Image 1

ప్రియుడు కోసం మెడపై నుంచి తోసేసి చావకపోతే.. హార్పిక్‌ ఎక్కించి భర్తను చంపేసిన భార్య

Posted On 2026-07-07 14:04:52

Readmore >