| Daily భారత్
Logo




మాజీ ఎమ్మెల్యే కొండా లక్ష్మారెడ్డి కన్నుమూత

News

Posted on 2025-10-13 08:46:16

Share: Share


మాజీ ఎమ్మెల్యే కొండా లక్ష్మారెడ్డి కన్నుమూత

డైలీ భారత్, రంగారెడ్డి:రంగారెడ్డి జిల్లా చేవెళ్ల నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే కొండా లక్ష్మారెడ్డి(84) కన్నుమూశారు. గతకొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్ అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ సోమవారం తెల్లవారుజామున ఉదయం 5.30 గంటల సమయంలో తుదిశ్వాస విడిచారు. నగరంలోని మహా ప్రస్థానంలో మధ్యాహ్నం 3 గంటలకు ఆయన అంత్యక్రియలు జరగనున్నాయని కుటుంబసభ్యులు తెలిపారు.

తెలంగాణ రాజకీయాల్లో తీవ్ర విషాదం నెలకొంది. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే కొండా లక్ష్మారెడ్డి(84) కన్నుమూశారు. గతకొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్ అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ సోమవారం తెల్లవారుజామున ఉదయం 5.30 గంటల సమయంలో తుదిశ్వాస విడిచారు. నగరంలోని మహా ప్రస్థానంలో మధ్యాహ్నం 3 గంటలకు ఆయన అంత్యక్రియలు జరగనున్నాయని కుటుంబసభ్యులు తెలిపారు. ఈయన కాంగ్రెస్ లో వివిధ హోదాల్లో పనిచేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏపీసీసీ ప్రతినిధి, గ్రీవెన్స్ సెల్ ఛైర్మన్‌తో పాటు పలు కీలక బాధ్యతలను లక్ష్మారెడ్డి నిర్వర్తించారు. 1999, 2014లో హైదరాబాద్ లోక్‌సభ స్థానం నుంచి ఓటమి పాలయ్యారు.

జర్నలిజం పట్ల మక్కువతో లక్ష్మారెడ్డి 1980లో స్థానిక వార్తా సంస్థ NSSను మొదలుపెట్టారు. జూబ్లీహిల్స్ జర్నలిస్ట్స్ కోఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ, ప్రెస్ క్లబ్ ఆఫ్ హైదరాబాద్ అధ్యక్షుడిగా కూడా ఆయన సేవలందించారు. ఉమ్మడి ఏపీలో మంత్రిగా పనిచేపిన కొండా వెంకట రంగారెడ్డి మనవడు లక్ష్మారెడ్డి కావడం గమనార్హం. ఆయన మరణ వార్త తెలిసిన తెలుగు కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, రాజకీయ నేతలు సంతాపం ప్రకటిస్తున్నారు.

చేవెళ్ల మాజీ ఎమ్మెల్యే కొండా లక్ష్మా రెడ్డి మృతిపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంతాపం వ్యక్తం చేశారు. ఎన్ఎస్ఎస్ వార్తా ఏజెన్సీ స్థాపకుడిగా, ఎమ్మెల్యేగా, ప్రెస్ క్లబ్ అధ్యక్షుడిగా, జూబ్లీహిల్స్ జర్నలిస్ట్ కోఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ ప్రెసిడెంట్ గా ఆయన సేవలందించారని కొనియాడారు. లక్ష్మారెడ్డి కుటుంబ సభ్యులకు సీఎం సానుభూతి తెలియజేశారు.

Image 1

తలసేమియా లైఫ్ సేవర్ అవార్డును అందుకున్న వాసవి క్లబ్ బీబీపేట్

Posted On 2026-07-09 15:56:35

Readmore >
Image 1

పోలీసు స్టేష‌న్ స్థ‌లాన్ని కాపాడిన హైడ్రా

Posted On 2026-07-08 19:27:58

Readmore >
Image 1

మహిళలు, చిన్నారులకు భరోసా... బాధితులకు అండగా జిల్లా భరోసా కేంద్రం

Posted On 2026-07-08 14:21:40

Readmore >
Image 1

సర్పంచుల ఫోరం రాష్ట్ర అధ్యక్షులు భూమన్న యాదవ్ ను కలిసిన బిక్కనూరు మండల సర్పంచులు

Posted On 2026-07-08 14:18:42

Readmore >
Image 1

వైరా నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం దృష్టికి బహిరంగ విజ్ఞప్తి

Posted On 2026-07-08 07:55:23

Readmore >
Image 1

ప్రభుత్వ ఆసుపత్రిలో దారుణ హత్య.. కత్తితో భార్య గొంతు కోసిన భర్త

Posted On 2026-07-08 07:13:19

Readmore >
Image 1

రాజన్న సిరిసిల్ల డబుల్ మర్డర్: భూ వివాదంతో రెండు హత్యలు, నిందితుడికి యావజ్జీవ ఖైదు

Posted On 2026-07-07 14:17:19

Readmore >
Image 1

పేలుళ్ల కేసులో గుజరాత్ హైకోర్టు సంచలన తీర్పు

Posted On 2026-07-07 14:05:48

Readmore >
Image 1

ప్రియుడు కోసం మెడపై నుంచి తోసేసి చావకపోతే.. హార్పిక్‌ ఎక్కించి భర్తను చంపేసిన భార్య

Posted On 2026-07-07 14:04:52

Readmore >
Image 1

ఆల్ ఇండియా కాంగ్రెస్ మహిళా అధ్యక్షురాలు ఆల్కలాంబ ని మర్యాదపూర్వకంగా కలిసిన మాజీ మున్సిపల్ చైర్‌పర్సన్ గడ్డం ఇందుప్రియ

Posted On 2026-07-07 14:03:47

Readmore >