Posted on 2025-10-13 14:08:25
అయినవారు, కట్టుకున్న భార్య తన అంగ వైకల్యాన్ని చూసి వెలివేశారు
తన అంగవైకల్యాన్ని చూసైనా పింఛన్ ఇప్పించండి సారు
డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్: రోడ్డు ప్రమాదంలో తన మోకాలికి తీవ్ర గాయమై మోకాలు చిప్ప అరిగిపోవడంతో కుటుంబ పోషణ సంపాదించడం లేదని తన కుటుంబ సభ్యులు, తన భార్యతో సహా తనను ఇంటి నుండి వెలివేసారని నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని సాయి నగర్ కు చెందిన భీమ్రావు చౌహాన్ అనే వ్యక్తి తనకు పింఛన్ వచ్చే అర్హత ఉన్న పలుమార్లు పింఛన్ ఇప్పించాలని కలెక్టరేట్ కు వచ్చి వినతి పత్రాలు సమర్పించిన తమకు న్యాయం జరగడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. వివరాలు ఇలా ఉన్నాయి. నగరంలోని వర్ని రోడ్డు లోని సాయి నగర్ కాలనీకి చెందిన 58 సంవత్సరాల వయసుగల భీమ్రావు చౌహన్ అనే వ్యక్తి గత ఆరు సంవత్సరాల క్రితం రోడ్డు ప్రమాదంలో మోకాలికి తీవ్ర గాయాలు కావడంతో వైద్యులు మోకాలు చిప్ప కు వైద్యులు రాడ్డు వేశారు. అది కాస్త రాడ్డు అరిగిపోయి నడవలేని పరిస్థితిగా మారిందని, సంపాదన లేక తినడానికి తిండి లేక కష్టంగా ఇబ్బందిగా ఉందని ఆయన తన ఆవేదనను వెలగక్కారు. తన తన వైకల్యాన్ని చూసి తనకు పుట్టిన కన్న కొడుకులు బిడ్డలు, భార్య ఇంట్లో నుంచి వెలివేసారని సంపాదిస్తేనే ఇంట్లో ఉండాలని తనను ఇంట్లో నుండి గెంటివేశారని ఆవేదన వ్యక్తం చేశారు. తన అంగవైకల్యాన్ని చూసి ప్రభుత్వం, జిల్లా కలెక్టర్ తనకు వృద్ధాప్య పింఛన్ అయిన, వికలాంగ పించన్ అయినా ఇప్పించాలని ఆయన కోరారు. ఆయన పరిస్థితిని చూసి మానవతా దృక్పథంతో అదే కాలనీకి చెందిన టి యు సి ఐ సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ కార్యవర్గ సభ్యులు సాయికుమార్ అతనిని సోమవారం ప్రజావాణికి తీసుకువచ్చి బాధితుని సమస్యలను జిల్లా కలెక్టర్ ప్రాంగణంలో ప్రజావాణిలో వినతి పత్రం అందించారు.
తలసేమియా లైఫ్ సేవర్ అవార్డును అందుకున్న వాసవి క్లబ్ బీబీపేట్
Posted On 2026-07-09 15:56:35
Readmore >
మహిళలు, చిన్నారులకు భరోసా... బాధితులకు అండగా జిల్లా భరోసా కేంద్రం
Posted On 2026-07-08 14:21:40
Readmore >
సర్పంచుల ఫోరం రాష్ట్ర అధ్యక్షులు భూమన్న యాదవ్ ను కలిసిన బిక్కనూరు మండల సర్పంచులు
Posted On 2026-07-08 14:18:42
Readmore >
వైరా నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం దృష్టికి బహిరంగ విజ్ఞప్తి
Posted On 2026-07-08 07:55:23
Readmore >
ప్రభుత్వ ఆసుపత్రిలో దారుణ హత్య.. కత్తితో భార్య గొంతు కోసిన భర్త
Posted On 2026-07-08 07:13:19
Readmore >
రాజన్న సిరిసిల్ల డబుల్ మర్డర్: భూ వివాదంతో రెండు హత్యలు, నిందితుడికి యావజ్జీవ ఖైదు
Posted On 2026-07-07 14:17:19
Readmore >
ప్రియుడు కోసం మెడపై నుంచి తోసేసి చావకపోతే.. హార్పిక్ ఎక్కించి భర్తను చంపేసిన భార్య
Posted On 2026-07-07 14:04:52
Readmore >
ఆల్ ఇండియా కాంగ్రెస్ మహిళా అధ్యక్షురాలు ఆల్కలాంబ ని మర్యాదపూర్వకంగా కలిసిన మాజీ మున్సిపల్ చైర్‌పర్సన్ గడ్డం ఇందుప్రియ
Posted On 2026-07-07 14:03:47
Readmore >