| Daily భారత్
Logo




నిజామాబాద్ మెడికల్ కాలేజ్ విద్యార్థులు వైద్యరంగంలో రాణించి భవిష్యత్తులో మంచి డాక్టర్లుగా ఎదగాలి

News

Posted on 2025-10-15 17:39:43

Share: Share


నిజామాబాద్ మెడికల్ కాలేజ్ విద్యార్థులు వైద్యరంగంలో రాణించి భవిష్యత్తులో మంచి డాక్టర్లుగా ఎదగాలి

పవిత్రమైన వైద్య వృత్తిలో చదువుతున్న  మెడికల్ కాలేజ్ లో ఇటీవల జరిగిన దురదృష్టకరమైన ఘటన పునరావృతం కావొద్దు

 డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్: నిజామాబాద్ మెడికల్ కాలేజ్ లో చదువుతున్న మెడికో స్టూడెంట్లు వైద్యరంగంలో రాణించి రాబోయే తరంలో కాబోయే డాక్టర్లుగా ఎదగాలని మాజీ మంత్రి బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి పేర్కొన్నారు. బుధవారం మెడికల్ కళాశాలలో నిర్వహించిన ఎలైగజర్ కార్యక్రమంలో భాగంగా అన్వయ ఈవెంట్లో బోధన్ ఎమ్మెల్యే తన సతీమణి సుచరిత రెడ్డి తో హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లా మెడికల్ కాలేజీలో విద్యార్థులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రొఫెసర్లు మంచి చదువును తగిన ఫ్యాకల్టీతో అందించాలని ఆయన కోరారు. భవిష్యత్తులో నిజామాబాద్ మెడికల్ కాలేజ్ నుంచి దేశవ్యాభవిష్యత్తులో నిజామాబాద్ మెడికల్ కాలేజ్ నుంచి  దేశ, రాష్ట్రవ్యాప్తంగా మంచి డాక్టర్లు వైద్య సేవలు అందిస్తున్నారని పేరు తీసుకురావడమే తన సంకల్పమని ఆయన అన్నారు. తన వల్లే నిజాంబాద్ కు మెడికల్ కళాశాల వచ్చిందని వేదికపై ఉన్న పెద్దలు చెప్పారు కానీ తాను తెచ్చినంత మాత్రాన మంచి వైద్య వృత్తిలో రాణించి పేదవారికి నాణ్యమైన వైద్యం అందించాలని అప్పుడే తాను అనుకున్న లక్ష్యం నెరవేరుతుందని ఆయన అన్నారు. మెడికల్ కళాశాలలో వసతులు ఇబ్బందికరంగా ఉందన్న వాస్తవం నిజమేనని 6 నెలల తర్వాత వైద్య వృత్తి చదివే విద్యార్థులకు కోసం మెడికల్ కళాశాలలో అత్యాధునిక హాస్టల్ వసతిని కల్పిస్తామని ఆయన అన్నారు. ఇటీవల మెడికల్ కళాశాలకు పోలీసులు రావడం జరిగిందని అది తన దృష్టికి వచ్చిందని ఎవరో నలుగురు ఐదుగురు కలిసి వైద్య వృత్తికి చెడ్డ పేరు కలిగించే పనిచేస్తున్నారని మీరు ఎంచుకున్న వృత్తి ఏంటి మెడికల్ కళాశాలలో ర్యాగింగ్ జరగడం ఏంటి అని విద్యార్థులను ప్రశ్నించారు. ఇకపై ర్యాగింగ్ అనే విషయం మెడికల్ కళాశాలలో వినకుండా ప్రొఫెసర్లు ప్రిన్సిపల్ లు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని విద్యార్థులు కూడా ర్యాగింగ్ కు దూరంగా ఉండాలని ఆయన కోరారు. తెలంగాణలోనే నెంబర్ వన్ మెడికల్ కాలేజ్గా నిజామాబాద్ మెడికల్ కాలేజ్ నిలబడాలని తన లక్ష్యమని అది నెరవేర్చాల్సిన బాధ్యత మెడికల్ కాలేజీ విద్యార్థులపైనే ఉందన్నారు. అవసరమైతే విద్యార్థుల కోసం ప్రభుత్వం నుండే కాకుండా వేదిక పైన ఉన్న వారు కూడా డబ్బులు స్వచ్ఛందంగా అందివ్వాలని కోరారు. ఆయన మాట ప్రకారం కాకతీయ విద్యా సంస్థల చైర్మన్ రజనీకాంత్ మెడికల్ కళాశాలలో మరమ్మత్తుల కోసం 50,000, బోధన్ ఎమ్మెల్యే సతీమణి సుచరిత 50,000 రూపాయలు, ఎన్ డి సి సి బి బ్యాంక్ చైర్మన్ కుంట రమేష్ రెడ్డి 50 వేల రూపాయలు స్వచ్ఛందంగా మెడికల్ కాలేజీ అభివృద్ధికి ముందుకు వచ్చినందున వారికి కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి సుచరిత దంపతులకు రాముడి సీత అవతారంలో ఉన్న వైద్య విద్యార్థులు పూలమాలలతో సత్కరించారు.


కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు గడగు గంగాధర్, ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహర్ బిన్ హుందాన్, ఎన్ డి సి సి బి చైర్మన్ రమేష్ రెడ్డి, జిజిహెచ్ సూపరిండెంట్ శ్రీనివాస్, మెడికల్ కాలేజ్ ప్రిన్సిపల్ కృష్ణమోహన్, ప్రొఫెసర్లు జలగం తిరుపతిరావు, నాగ మోహన్ రావు, ప్రముఖ వైద్యురాలు కవిత రెడ్డి తదితరులు పాల్గొన్నారు.


Image 1

పోలీసు స్టేష‌న్ స్థ‌లాన్ని కాపాడిన హైడ్రా

Posted On 2026-07-08 19:27:58

Readmore >
Image 1

మహిళలు, చిన్నారులకు భరోసా... బాధితులకు అండగా జిల్లా భరోసా కేంద్రం

Posted On 2026-07-08 14:21:40

Readmore >
Image 1

సర్పంచుల ఫోరం రాష్ట్ర అధ్యక్షులు భూమన్న యాదవ్ ను కలిసిన బిక్కనూరు మండల సర్పంచులు

Posted On 2026-07-08 14:18:42

Readmore >
Image 1

వైరా నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం దృష్టికి బహిరంగ విజ్ఞప్తి

Posted On 2026-07-08 07:55:23

Readmore >
Image 1

ప్రభుత్వ ఆసుపత్రిలో దారుణ హత్య.. కత్తితో భార్య గొంతు కోసిన భర్త

Posted On 2026-07-08 07:13:19

Readmore >
Image 1

రాజన్న సిరిసిల్ల డబుల్ మర్డర్: భూ వివాదంతో రెండు హత్యలు, నిందితుడికి యావజ్జీవ ఖైదు

Posted On 2026-07-07 14:17:19

Readmore >
Image 1

పేలుళ్ల కేసులో గుజరాత్ హైకోర్టు సంచలన తీర్పు

Posted On 2026-07-07 14:05:48

Readmore >
Image 1

ప్రియుడు కోసం మెడపై నుంచి తోసేసి చావకపోతే.. హార్పిక్‌ ఎక్కించి భర్తను చంపేసిన భార్య

Posted On 2026-07-07 14:04:52

Readmore >
Image 1

ఆల్ ఇండియా కాంగ్రెస్ మహిళా అధ్యక్షురాలు ఆల్కలాంబ ని మర్యాదపూర్వకంగా కలిసిన మాజీ మున్సిపల్ చైర్‌పర్సన్ గడ్డం ఇందుప్రియ

Posted On 2026-07-07 14:03:47

Readmore >
Image 1

ప్రభుత్వ పాఠశాలలకే పిల్లలను పంపిద్దాం

Posted On 2026-07-07 08:21:25

Readmore >