Posted on 2025-10-16 05:01:59
డైలీ భారత్, నాగర్ కర్నూలు:నాగర్ కర్నూలు జిల్లా శ్రీపురం గ్రామంలో ఓ దారుణమైన హత్య కేసు వెలుగులోకి వచ్చింది. భార్య వివాహేతర సంబంధం భర్త ప్రాణాలను బలితీసుకున్న ఘటన కలకలం రేపుతోంది. హత్యను యాక్సిడెంట్ మృతిగా చిత్రీకరించే ప్రయత్నం చేసినా, మృతుడి కుటుంబ సభ్యుల అనుమానంతో నిజం వెలుగులోకి వచ్చింది. నాగర్ కర్నూల్ డీఎస్పీ బి.శ్రీనివాసులు మీడియా సమావేశంలో కేసు వివరాలను వెల్లడించారు.
జిల్లాలోని శ్రీపురం గ్రామానికి చెందిన రాములు (35) ప్లంబర్‌గా పని చేస్తూ, తన భార్య మానస (35) ముగ్గురు పిల్లలతో కలిసి జీవనం సాగించేవారు. 6 నెలల క్రితం వారి ఇంట్లో బంగారు ఆభరణాల చోరీ జరిగింది. చోరీ చేసినవారు ఎవరో తెలుసుకోవాలని మానస, నాగర్ కర్నూల్ మండలం పెద్ద ముద్దునూరు గ్రామానికి చెందిన మంత్రగాడు సురేష్ గౌడ్ (27) దగ్గరకు వెళ్లారు. అక్కడి నుంచి వారిద్దరి మధ్య సాన్నిహిత్యం పెరిగి వివాహేతర సంబంధంగా మారింది. ఈ సంబంధంపై భర్త రాములకు అనుమానం వచ్చి భార్యతో తరచూ గొడవలు జరగడం మొదలయ్యాయి. భర్త బ్రతికుంటే తమ వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉంటాడని భావించిన మానస, తన ప్రియుడు సురేష్ గౌడ్‌తో కలిసి రాములను హత్య చేయాలని పన్నాగం పన్నింది. తమ సంబంధానికి భర్త అడ్డొస్తున్నాడని, అతడిని అంతమొందించాలని మానస తన ప్రియుడిని కోరింది.
సురేష్ గౌడ్, రాములును హత్య చేయించేందుకు తన వద్ద పని చేసే బాల్ పీరు, హనుమంతులతో రూ.2.80 లక్షల కు ఒప్పందం కుదుర్చుకున్నాడు. ఈ నెల 8వ తేదీన మానస, తన పుట్టింటిలో వివాహం ఉందని చెప్పి వెళ్లింది. ఇదే సమయంలో భర్తను హత్య చేస్తే ఎవరికి అనుమానం రాదని భావించింది. రాములను పెద్ద ముద్దునూరు గ్రామానికి పిలిపించి, సురేష్ గౌడ్, బాల్ పీరు, హనుమంతులు కలిసి అతనికి మద్యం తాగించారు. మద్యం మత్తులో ఉన్న రాములుకు ముక్కు, నోరుపై టేపు అడ్డంగా అంటించి శ్వాస ఆడకుండా చేసి హత్య చేశారు. అనంతరం మృతదేహాన్ని రోడ్డుపై పడేసి గాయాలు చేసి, రోడ్డు ప్రమాదంలో మృతి చెందినట్లుగా చిత్రీకరించారు. ఈ హత్య చేసి తప్పించేందుకు ప్రయత్నం చేశారు
రహదారి పక్కన పడి ఉన్న రాములు మృతదేహాన్ని చూసిన స్థానికులు కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. ఘటనా స్థలిని పరిశీలించిన రాములు తండ్రికి అనుమానం వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. మానస- సురేష్ మధ్య అక్రమ సంబంధం ఉందని, కొంతకాలంగా గొడవలు జరుగుతున్నాయని, మానస ప్రవర్తనపై మృతుడి తల్లిదండ్రులకు అనుమానం ఉండటం వల్ల వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు పోస్టుమార్టం నివేదిక ఆధారంగా ఇది ప్రమాద మృతి కాదని నిర్ధారించారు. రాములు శ్వాస ఆగి మరణించాడని వైద్యులు వెల్లడించారు. పోలీసుల విచారణలో చివరకు మానస, సురేష్ గౌడ్, బాల్ పీరు, హనుమంతులు హత్య చేసినట్లు అంగీకరించారు. నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు వారిని కోర్టులో హాజరుపరిచి రిమాండ్కు తరలించారు.
"మానస, సురేష్ గౌడ్ వివాహేతర సంబంధం ఉంది. భర్త బ్రతికుంటే తమ వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉంటాడని భావించింది. మానస పుట్టింటిలో వివాహం ఉందని చెప్పి వెళ్లింది. ఇదే సమయంలో భర్తను హత్య చేస్తే ఎవరికి అనుమానం రాదని భావించారు. సురేష్ గౌడ్, బాల్ పీరు, హనుమంతులు కలిసి సురేష్ గౌడ్కు మద్యం తాగించారు. మద్యం మత్తులో ఉన్న రాములుకు ముక్కు, నోరుపై టేపు అడ్డంగా అంటించి శ్వాస ఆడకుండా చేసి హత్య చేశారు. రోడ్డు ప్రమాదంలో మృతి చెందినట్లుగా చిత్రికరించారు. పోలీసులు విచారణలో వారు హత్య చేసినట్లు ఒప్పుకున్నారు."
మహిళలు, చిన్నారులకు భరోసా... బాధితులకు అండగా జిల్లా భరోసా కేంద్రం
Posted On 2026-07-08 14:21:40
Readmore >
సర్పంచుల ఫోరం రాష్ట్ర అధ్యక్షులు భూమన్న యాదవ్ ను కలిసిన బిక్కనూరు మండల సర్పంచులు
Posted On 2026-07-08 14:18:42
Readmore >
వైరా నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం దృష్టికి బహిరంగ విజ్ఞప్తి
Posted On 2026-07-08 07:55:23
Readmore >
ప్రభుత్వ ఆసుపత్రిలో దారుణ హత్య.. కత్తితో భార్య గొంతు కోసిన భర్త
Posted On 2026-07-08 07:13:19
Readmore >
రాజన్న సిరిసిల్ల డబుల్ మర్డర్: భూ వివాదంతో రెండు హత్యలు, నిందితుడికి యావజ్జీవ ఖైదు
Posted On 2026-07-07 14:17:19
Readmore >
ప్రియుడు కోసం మెడపై నుంచి తోసేసి చావకపోతే.. హార్పిక్ ఎక్కించి భర్తను చంపేసిన భార్య
Posted On 2026-07-07 14:04:52
Readmore >
ఆల్ ఇండియా కాంగ్రెస్ మహిళా అధ్యక్షురాలు ఆల్కలాంబ ని మర్యాదపూర్వకంగా కలిసిన మాజీ మున్సిపల్ చైర్‌పర్సన్ గడ్డం ఇందుప్రియ
Posted On 2026-07-07 14:03:47
Readmore >