Posted on 2025-10-16 11:14:01
బీడీఎస్ఎఎఫ్ నిజామాబాద్ జిల్లా అధ్యక్షులు సంజయ్ తల్లారే
డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్:బహుజన డెమోక్రటిక్ స్టూడెంట్ ఫెడరేషన్ ( బి డి ఎస్ ఎఫ్ ) జిల్లా కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు సంజయ్ తల్లారే మాట్లాడుతూ ఏదైతే ఈనెల 18న బీసీ బంద్ ఉందో దానికి బహుజన డెమోక్రటిక్ స్టూడెంట్ ఫెడరేషన్ జిల్లా కమిటీ తరఫున సంపూర్ణ మద్దతు తెలియజేస్తూ బందులో పాల్గొనడం జరుగుతుందని తెలిపారు. ఈ సందర్భంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వలు ఏదైతే బీసీలకు రావాల్సిన వాట ఉందో అది ఇవ్వకుండా అన్యాయం చేస్తుందని అని అన్నారు. 42% బిసి రిజర్వేషన్లను రాజ్యాంగంలోని 9 వ షెడ్యూల్ చేర్చాలని కేంద్రంలోని బిజెపి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ 18 బిసి రాష్ట్ర బంద్ కు మద్దతుగా ఆయన మాట్లాడుతూ స్థానిక సంస్థల్లో 42% బిసి రిజర్వేషన్ అమలు చేయడానికి రాజ్యాంగంలోని 9వ షెడ్యూల్ చేర్చే విధంగా తెలంగాణ రాష్ట్రంలోని బిసి కులాల ప్రజలు బిజెపి కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేందుకు 18 బిసి రాష్ట్ర బంద్ లో పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. 42% బిసి రిజర్వేషన్లను రాజ్యాంగంలోని 9 వ షెడ్యూల్ చేర్చే భాధ్యత కేంద్రంలోని బిజెపి ప్రభుత్వానిదేనని సంజయ్ తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం స్థానిక సంస్థల్లో 42% బిసి రిజర్వేషన్లను ప్రకటించినప్పుడు అసెంబ్లీలో మద్దతు ప్రకటించిన బిజెపి, బీఆర్ఎస్ పార్టీ లు ఇప్పుడు 9వ జీవో పై హైకోర్టు స్టే ఇవ్వడంతో మాట మార్చి మొత్తం నెపం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంపై నెట్టి రాజకీయ లబ్ధి పొందేందుకు బిజెపి,బీఆర్ఎస్ పార్టీలు ప్రయత్నించడం భావ్యం కాదన్నారు. 18 బిసి రాష్ట్ర బంద్ కు ఎస్సీ ఎస్టీ మత మైనారిటీలు సంపూర్ణ మద్దతు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు ఉదయ్, రాకేష్, నరేందర్, మంగేష్ తదితరులు పాల్గొన్నారు
మహిళలు, చిన్నారులకు భరోసా... బాధితులకు అండగా జిల్లా భరోసా కేంద్రం
Posted On 2026-07-08 14:21:40
Readmore >
సర్పంచుల ఫోరం రాష్ట్ర అధ్యక్షులు భూమన్న యాదవ్ ను కలిసిన బిక్కనూరు మండల సర్పంచులు
Posted On 2026-07-08 14:18:42
Readmore >
వైరా నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం దృష్టికి బహిరంగ విజ్ఞప్తి
Posted On 2026-07-08 07:55:23
Readmore >
ప్రభుత్వ ఆసుపత్రిలో దారుణ హత్య.. కత్తితో భార్య గొంతు కోసిన భర్త
Posted On 2026-07-08 07:13:19
Readmore >
రాజన్న సిరిసిల్ల డబుల్ మర్డర్: భూ వివాదంతో రెండు హత్యలు, నిందితుడికి యావజ్జీవ ఖైదు
Posted On 2026-07-07 14:17:19
Readmore >
ప్రియుడు కోసం మెడపై నుంచి తోసేసి చావకపోతే.. హార్పిక్ ఎక్కించి భర్తను చంపేసిన భార్య
Posted On 2026-07-07 14:04:52
Readmore >
ఆల్ ఇండియా కాంగ్రెస్ మహిళా అధ్యక్షురాలు ఆల్కలాంబ ని మర్యాదపూర్వకంగా కలిసిన మాజీ మున్సిపల్ చైర్‌పర్సన్ గడ్డం ఇందుప్రియ
Posted On 2026-07-07 14:03:47
Readmore >