| Daily భారత్
Logo




ప్రైవేట్ ఆసుపత్రులు క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ చట్టం నియమాలను తప్పనిసరిగా పాటించాలి : హనుమకొండ జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్

News

Posted on 2025-10-16 15:47:03

Share: Share


ప్రైవేట్  ఆసుపత్రులు  క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ చట్టం నియమాలను తప్పనిసరిగా పాటించాలి : హనుమకొండ జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్

హనుమకొండ జిల్లా కలెక్టరేట్ లో క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్, రిజిస్టరింగ్ అథారిటీ సమావేశం

డైలీ భారత్, హనుమకొండ: జిల్లాలోని ప్రైవేట్ క్లినిక్ లు, ఆసుపత్రులు  క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ చట్టం నియమాలను తప్పనిసరిగా పాటించాలని హనుమకొండ జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్ అన్నారు. 

గురువారం హనుమకొండ జిల్లా కలెక్టరేట్ లోని మినీ కాన్ఫరెన్స్ హాలులో క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్, రిజిస్టరింగ్ అథారిటీ సమావేశాన్ని జిల్లా కలెక్టర్ నిర్వహించారు. 

జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ అప్పయ్య ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ సమావేశంలో ఐఎంఏ, తానా, గైనకాలజిస్ట్ అసోసియేషన్, డెంటల్, ఆయుర్వేదిక్, హోమియో, యునాని, ఫిజియోథెరపి అసోసియేషన్ల ప్రతినిధులతో  ప్రభుత్వ నియమ నిబంధనలు మేరకు క్లినిక్ లు, ఆసుపత్రుల ఏర్పాటు, నిర్వహణ, అనుమతులు, ఫీజుల పట్టిక, ఫైర్ సేఫ్టీ, బయో మెడికల్ వేస్ట్ మేనేజ్మెంట్, తదితర అంశాలపై సమావేశంలో  చర్చించారు. 

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్ మాట్లాడుతూ ప్రభుత్వ అనుమతులు లేకుండా ఆసుపత్రులు, క్లినిక్ లు నిర్వహించవద్దని, చట్టం నియమాలకు అనుగుణంగా నిర్వహించడంలో అసోసియేషన్లు  సహకరించాలని సూచించారు.   ప్రైవేట్ ఆసుపత్రుల వద్ద పార్కింగ్ సమస్యలు తలెత్తుతున్నాయని, వీటిపై తరచుగా ఫిర్యాదులు అందుతున్నాయని అన్నారు. ఆసుపత్రిల వద్ద సరైన పార్కింగ్ స్థలం ఉండే విధంగా  ఆసుపత్రుల యాజమాన్యాలు  చూసుకోవాలన్నారు. కొత్తగా ఏర్పాటు చేసే ఆస్పత్రులకు ప్రభుత్వ నిబంధనల మేరకు నిర్మించాలని,  ఆక్యుపెన్సి సర్టిఫికెట్ ను  తప్పనిసరిగా తీసుకోవాలని, ఫైర్ సేఫ్టీ నిబంధనలు పాటిస్తేనే ఆసుపత్రులకు అనుమతులు ఇవ్వబడతాయన్నారు. అదేవిధంగా కాలుష్య నియంత్రణ మండలి ( పి సి బి ) మార్గదర్శకాల ప్రకారం బయో మెడికల్ వేస్ట్ చార్జీలను ఆసుపత్రుల వద్ద తీసుకోవాలని సంబంధిత ఏజెన్సీని ఆదేశించారు. ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు వైద్య సేవల నిమిత్తం ఆస్పత్రులు, క్లినిక్ లకు వచ్చే రోగులకు రాసే చీటీ లో కాంపోజిషన్ తో పాటు  మందుల వివరాలు అర్థమయ్యే విధంగా పెద్ద అక్షరాల( క్యాపిటల్ లెటర్స్)తో  చీటీలో వైద్యులు తప్పనిసరిగా రాయలన్నారు. ప్రతి ఆసుపత్రిలో వైద్య సేవల రుసుమును తెలియజేసే విధంగా ఛార్జీల పట్టిక ప్రదర్శించాలన్నారు.  సమావేశంలో చర్చించిన విధంగా ఛార్జీ ల పట్టిక ప్రదర్శనతో పాటు, క్యాపిటల్ లెటర్స్ తో ప్రిస్క్రిప్షన్ రాసే విధంగా ఐఎంఏ, తానా అసోసియేషన్ల సభ్యులకు తెలియజేస్తామని ఆ అసోసియేషన్ల ప్రతినిధులు కలెక్టర్ కు సమాధానమి చ్చారు. ప్రతి ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలలు, జిమ్ సెంటర్లు, అవసరమైన ఇతర చోట్ల సిపిఆర్ ప్రాముఖ్యతను గురించి తెలియజేస్తూ శిక్షణ ఇవ్వడానికి అసోసియేషన్లు సహకరించాలని సూచించారు. అదేవిధంగా  ఆరోగ్యాంశాలకు సంబంధించి ప్రజలు, విద్యార్థులకు అవగాహన కల్పించడానికి భాగస్వాములు కావాలని తెలిపారు. ఈ విషయమై అసోసియేషన్ లప్రతినిధులు స్పందిస్తూ  ఆరోగ్య అంశాలకు సంబంధించి అవగాహన కార్యక్రమాలలో పాల్గొంటామని తెలియజేశారు. 

ఈ సమావేశంలో జిల్లా అదనపు కలెక్టర్ వెంకట్ రెడ్డి, ఐఎంఏ జిల్లా అధ్యక్షుడు  డాక్టర్ నాగార్జున రెడ్డి, రెడ్ క్రాస్ చైర్మన్ డాక్టర్ విజయ్ చందర్ రెడ్డి, గైనకాలజిస్ట్ ల అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు డాక్టర్ శ్రీలక్ష్మి, డాక్టర్ రాధిక, ఐడిఏ అధ్యక్షుడు డాక్టర్ ప్రీతం రెడ్డి, ఆయుర్వేదిక్ అసోసియేషన్ ప్రతినిధి డాక్టర్ రవీందర్, హోమియో అసోసియేషన్ ప్రతినిధి డాక్టర్ సుధాకర్ రావు, ఫిజియోథెరపీ అసోసియేషన్ ప్రతినిధి సురేష్ కుమార్, స్టాటిస్టికల్ అధికారి ప్రసన్న కుమార్, డెమో అశోక్ రెడ్డి, ఇతర అధికారులు పాల్గొన్నారు.

Image 1

పోలీసు స్టేష‌న్ స్థ‌లాన్ని కాపాడిన హైడ్రా

Posted On 2026-07-08 19:27:58

Readmore >
Image 1

మహిళలు, చిన్నారులకు భరోసా... బాధితులకు అండగా జిల్లా భరోసా కేంద్రం

Posted On 2026-07-08 14:21:40

Readmore >
Image 1

సర్పంచుల ఫోరం రాష్ట్ర అధ్యక్షులు భూమన్న యాదవ్ ను కలిసిన బిక్కనూరు మండల సర్పంచులు

Posted On 2026-07-08 14:18:42

Readmore >
Image 1

వైరా నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం దృష్టికి బహిరంగ విజ్ఞప్తి

Posted On 2026-07-08 07:55:23

Readmore >
Image 1

ప్రభుత్వ ఆసుపత్రిలో దారుణ హత్య.. కత్తితో భార్య గొంతు కోసిన భర్త

Posted On 2026-07-08 07:13:19

Readmore >
Image 1

రాజన్న సిరిసిల్ల డబుల్ మర్డర్: భూ వివాదంతో రెండు హత్యలు, నిందితుడికి యావజ్జీవ ఖైదు

Posted On 2026-07-07 14:17:19

Readmore >
Image 1

పేలుళ్ల కేసులో గుజరాత్ హైకోర్టు సంచలన తీర్పు

Posted On 2026-07-07 14:05:48

Readmore >
Image 1

ప్రియుడు కోసం మెడపై నుంచి తోసేసి చావకపోతే.. హార్పిక్‌ ఎక్కించి భర్తను చంపేసిన భార్య

Posted On 2026-07-07 14:04:52

Readmore >
Image 1

ఆల్ ఇండియా కాంగ్రెస్ మహిళా అధ్యక్షురాలు ఆల్కలాంబ ని మర్యాదపూర్వకంగా కలిసిన మాజీ మున్సిపల్ చైర్‌పర్సన్ గడ్డం ఇందుప్రియ

Posted On 2026-07-07 14:03:47

Readmore >
Image 1

ప్రభుత్వ పాఠశాలలకే పిల్లలను పంపిద్దాం

Posted On 2026-07-07 08:21:25

Readmore >