| Daily భారత్
Logo




నిజామాబాద్ జిల్లాలో దొంగతనాలు ఇతర జిల్లాలో వాహనాల విక్రయాలు

News

Posted on 2025-10-16 16:39:17

Share: Share


నిజామాబాద్ జిల్లాలో దొంగతనాలు ఇతర జిల్లాలో వాహనాల విక్రయాలు

ముఠాలో ఇద్దరు అరెస్టు..12 వాహనాలు స్వాధీనం

పరారీలో ముఠా సభ్యుల కీలక సూత్రదారి

డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్:నిజామాబాద్, నిర్మల్, జగిత్యాల్ జిల్లాలో వాహనాలు దొంగతనాలు చేసి ఫేక్ నంబర్ ప్లేట్లతో జగిత్యాల్ జిల్లాలో అమ్మకాలు చేసే ముఠాలో ఇద్దరు సభ్యులను సీసీఎస్ పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు. వారి వద్ద నుంచి వాహనాలను స్వాధీనం చేసుకోగా కీలక సూత్రదారులైన ముగ్గురి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. తీగ లాగితే డొంక కదిలినట్లు ఇటీవల జగిత్యాల జిల్లాలో ఒక ఆటోకు స్థానిక పోలీసులు ఫైన్ వేశారు. అయితే ఫైన్ మాత్రం కామారెడ్డి జిల్లా వాసికి వచ్చింది. సదరు ఆటో యజమాని తాను ఎన్నడు జగిత్యాల్ జిల్లాలో తిరిగింది లేదు, తాను ఎలా ఫైన్ కట్టేదని పోలీసు అధికారులకు ఫిర్యాదు చేశారు. ఈ విషయంపై నిజామాబాద్ పోలీసు కమిషనర్ సాయిచైతన్య సీసీఎస్ టీం ఆధ్వర్యంలో విచారణకు ఆదేశించారు. సీపీ ఆదేశాల మేరకు సీసీఎస్ ఏసీపీ కత్రోజు నాగేంద్రచారి, సిఐలు సాయినాథ్, సురేష్, ఎస్సై గోవింద్, సిబ్బంది ఆధ్వర్యంలో కేసును చేదించినట్లు పోలీసు కమిషనర్ సాయిచైతన్య తెలిపారు. గురువారం నిజామాబాద్ సీసీఎస్ ఏసీపీ కార్యాలయంలో పోలీసు కమిషనర్ సాయిచైతన్య విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. సీసీఎస్ టీం ఆధ్వర్యంలో విశ్వసనీయ సమాచారం మేరకు ఆటోనగర్ కు  చెందిన ఆటో డ్రైవర్ షేక్ ఫాజిల్, ఆటో నగర్ కు చెందిన ఎలక్ట్రిషియన్ గా పని చేసే మహ్మద్ నవాజ్ లను అదుపులోకి తీసుకున్నారు. వారిని విచారించగా నిజామాబాద్ నగరంలోని ఆటోనగర్ కు చెందిన షేక్ ఆలీ, ఆలీంలతో పాటు పీఎంపీ వైద్యుడిగా పని చేస్తున్న ఆటోనగర్ కు చెందిన మహ్మద్ వాహిద్ పాషాలతో కలిసి నిజామాబాద్, బోధన్, ఆర్మూర్, ముథోల్ జిల్లాలో ఆటోలో, బైక్ లు దొంగతనాలకు పాల్పడినట్లు షేక్ ఫాజిల్, మహ్మద్ నవాజ్ లు సీసీఎస్ పోలీసుల విచారణలో ఒప్పుకున్నారు. వారిచ్చిన సమాచారంతో వాటిని అమ్మిన జగిత్యాల్ జిల్లాలో, కోరుట్లలో 9 ఆటోలో, మూడు మోటార్ సైకిళ్ళను రికవరి చేశారు. ఇందులో ఫాజిల్,నవాజ్ లను అరెస్టు చేయగా షేక్ ఆలీ, ఆలీం,మహ్మద్ వాహిద్ లు పరారీలో ఉన్నారని తెలిపారు. సంబంధిత ఆటోలో, బైక్ లను కొనుగోలు చేసిన జగిత్యాల్ జిల్లా కోరుట్ల మండలం బెండపల్లి గ్రామానికి చెందిన మహ్మద్ ఇమ్రాన్, మహ్మద్ ఇలియాస్ ల ద్వారా వాహనాలను రికవరి చేసినట్లు తెలిపారు. ఇప్పటి వరకు 4 ఆటోలో,3 మోటార్ సైకిళ్ళ అడ్రస్ లు లభించాయని వాటిని ఆయా పోలీస్ స్టేషన్ లకు అప్పగిస్తామని సీసీఎస్ ఏసీపీ తెలిపారు. పరారీలో ఉన్న ముగ్గురి కోసం గాలిస్తున్నట్లు తెలిపారు. ఈ కేసులో ప్రధానంగా దొంగతనాలు చేసిన వాహనాలను ఫేక్ నంబర్లతో విక్రయించి సొమ్ము చేసుకుంటున్న మూఠాను పట్టుకోవడంలో సీసీఎస్ టీం పని తీరును నిజామాబాద్ పోలీసు కమిషనర్ సాయి చైతన్య అభినందించారు. ఈ విలేకరుల సమావేశంలో సీసీఎస్ ఏసీపీ నాగేంద్రచారి, సిఐలు సాయినాథ్, సురేష్, ఎస్సై నారాయణ, కానిస్టేబుళ్ళు ఉన్నారు.

Image 1

పోలీసు స్టేష‌న్ స్థ‌లాన్ని కాపాడిన హైడ్రా

Posted On 2026-07-08 19:27:58

Readmore >
Image 1

మహిళలు, చిన్నారులకు భరోసా... బాధితులకు అండగా జిల్లా భరోసా కేంద్రం

Posted On 2026-07-08 14:21:40

Readmore >
Image 1

సర్పంచుల ఫోరం రాష్ట్ర అధ్యక్షులు భూమన్న యాదవ్ ను కలిసిన బిక్కనూరు మండల సర్పంచులు

Posted On 2026-07-08 14:18:42

Readmore >
Image 1

వైరా నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం దృష్టికి బహిరంగ విజ్ఞప్తి

Posted On 2026-07-08 07:55:23

Readmore >
Image 1

ప్రభుత్వ ఆసుపత్రిలో దారుణ హత్య.. కత్తితో భార్య గొంతు కోసిన భర్త

Posted On 2026-07-08 07:13:19

Readmore >
Image 1

రాజన్న సిరిసిల్ల డబుల్ మర్డర్: భూ వివాదంతో రెండు హత్యలు, నిందితుడికి యావజ్జీవ ఖైదు

Posted On 2026-07-07 14:17:19

Readmore >
Image 1

పేలుళ్ల కేసులో గుజరాత్ హైకోర్టు సంచలన తీర్పు

Posted On 2026-07-07 14:05:48

Readmore >
Image 1

ప్రియుడు కోసం మెడపై నుంచి తోసేసి చావకపోతే.. హార్పిక్‌ ఎక్కించి భర్తను చంపేసిన భార్య

Posted On 2026-07-07 14:04:52

Readmore >
Image 1

ఆల్ ఇండియా కాంగ్రెస్ మహిళా అధ్యక్షురాలు ఆల్కలాంబ ని మర్యాదపూర్వకంగా కలిసిన మాజీ మున్సిపల్ చైర్‌పర్సన్ గడ్డం ఇందుప్రియ

Posted On 2026-07-07 14:03:47

Readmore >
Image 1

ప్రభుత్వ పాఠశాలలకే పిల్లలను పంపిద్దాం

Posted On 2026-07-07 08:21:25

Readmore >