Posted on 2025-10-16 18:45:17
డైలీ భారత్ న్యూస్, నర్సంపేట:బిసిలకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏకగ్రీవంగా తీర్మానం చేసినటువంటి 42 శాతం రిజర్వేషన్ బిల్లును కేంద్ర ప్రభుత్వం 9 షెడ్యూల్ లో చేర్చి రాజ్యాంగంలో అమలు పరచాలని తెలంగాణ జనసమితి రాష్ట్ర ఉపాధ్యక్షలు అంబటి శ్రీనివాస్ డిమాండ్ చేస్తూ గురువారం ఆర్డీఓకు వినతి పత్రం అందించారు.ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ విద్య ఉద్యోగాలతో పాటు రాజకీయాల్లో బిసిలకు రిజర్వేషన్ లు పెంచాలని గత కొంత కాలంగా జరుగుతున్న పోరాటంలో భాగంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బిసిలకు రిజర్వేషన్ లు కల్పించాలని శాసనసభలో ఏకగ్రీవంగా తీర్మాణం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపించిందన్నారు.రాష్ట్ర ప్రభుత్వం పంపిన బిల్లును కేంద్ర ప్రభుత్వం పరిగణలోనికి తీసుకోకుండా 9వ షెడ్యూల్ లో చేర్చక పోవడంవల్ల బిసి లకు రిజర్వేషన్ లో అన్యాయం జరుగుతుందన్నారు. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం వెంటనే బిసి బిల్లును 9వ షెడ్యూల్ లో చేర్చి రక్షణ కల్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో జి రాంచేందర్, షేక్ జావీద్ తో పాటు పలువురు పాల్గొన్నారు.
మహిళలు, చిన్నారులకు భరోసా... బాధితులకు అండగా జిల్లా భరోసా కేంద్రం
Posted On 2026-07-08 14:21:40
Readmore >
సర్పంచుల ఫోరం రాష్ట్ర అధ్యక్షులు భూమన్న యాదవ్ ను కలిసిన బిక్కనూరు మండల సర్పంచులు
Posted On 2026-07-08 14:18:42
Readmore >
వైరా నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం దృష్టికి బహిరంగ విజ్ఞప్తి
Posted On 2026-07-08 07:55:23
Readmore >
ప్రభుత్వ ఆసుపత్రిలో దారుణ హత్య.. కత్తితో భార్య గొంతు కోసిన భర్త
Posted On 2026-07-08 07:13:19
Readmore >
రాజన్న సిరిసిల్ల డబుల్ మర్డర్: భూ వివాదంతో రెండు హత్యలు, నిందితుడికి యావజ్జీవ ఖైదు
Posted On 2026-07-07 14:17:19
Readmore >
ప్రియుడు కోసం మెడపై నుంచి తోసేసి చావకపోతే.. హార్పిక్ ఎక్కించి భర్తను చంపేసిన భార్య
Posted On 2026-07-07 14:04:52
Readmore >
ఆల్ ఇండియా కాంగ్రెస్ మహిళా అధ్యక్షురాలు ఆల్కలాంబ ని మర్యాదపూర్వకంగా కలిసిన మాజీ మున్సిపల్ చైర్‌పర్సన్ గడ్డం ఇందుప్రియ
Posted On 2026-07-07 14:03:47
Readmore >