Posted on 2025-10-16 18:46:44
రాష్ట్ర ముఖ్య ఎలక్ట్రోరల్ అధికారి సుదర్శన్ రెడ్డి
డైలీ భారత్ న్యూస్, వరంగల్:నూతన ఓటర్లకు గుర్తింపు కార్డులను తపాలా శాఖ ద్వారా అందించే విధంగా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ముఖ్య ఎలక్ట్రోరల్ అధికారి సుదర్శన్ రెడ్డి అన్నారు. గురువారం హైదరాబాద్ లోని రాష్ట్ర ముఖ్య ఎలక్ట్టోరల్ అధికారి కార్యాలయం నుండి ఇతర అధికారులతో కలిసి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రాష్ట్రంలోని అన్ని జిల్లాల జిల్లా ఎన్నికల అధికారులు-కలెక్టర్లు, సహాయ ఎన్నికల అధికారులు, తహసిల్దార్లతో సమీక్ష సమావేశం నిర్వహించారు. జిల్లా కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాలు నుండి జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద పాల్గొన్నారు.ఈ సందర్భంగా రాష్ట్ర ముఖ్య ఎలక్ట్రోరల్ అధికారి మాట్లాడుతూ నూతనంగా ఓటర్లుగా నమోదైన ప్రతి ఒక్కరికి తపాలా శాఖ ద్వారా ఓటర్ గుర్తింపు కార్డులను పంపిణీ చేయాలని తెలిపారు.
ఓటరు జాబితాలో 100 సంవత్సరాల వయసు కలిగిన ఓటర్లను గుర్తించి వారి వయసును తగిన ఆధారాలతో సమర్పించాలని తెలిపారు. బూత్ స్థాయి అధికారులకు గుర్తింపు కార్డులు పంపిణీ చేయాలని, ఫారం 6, 7, 8 దరఖాస్తులను వెంటనే పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలని తెలిపారు. ఈ విసిలో డిఆర్ఓ మరియు ఆర్డీవో వరంగల్ ఇన్చార్జ్ విజయలక్ష్మి, నర్సంపేట ఆర్డిఓ ఉమారాణి సంబంధిత తహసీల్దార్లు పాల్గొన్నారు
మహిళలు, చిన్నారులకు భరోసా... బాధితులకు అండగా జిల్లా భరోసా కేంద్రం
Posted On 2026-07-08 14:21:40
Readmore >
సర్పంచుల ఫోరం రాష్ట్ర అధ్యక్షులు భూమన్న యాదవ్ ను కలిసిన బిక్కనూరు మండల సర్పంచులు
Posted On 2026-07-08 14:18:42
Readmore >
వైరా నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం దృష్టికి బహిరంగ విజ్ఞప్తి
Posted On 2026-07-08 07:55:23
Readmore >
ప్రభుత్వ ఆసుపత్రిలో దారుణ హత్య.. కత్తితో భార్య గొంతు కోసిన భర్త
Posted On 2026-07-08 07:13:19
Readmore >
రాజన్న సిరిసిల్ల డబుల్ మర్డర్: భూ వివాదంతో రెండు హత్యలు, నిందితుడికి యావజ్జీవ ఖైదు
Posted On 2026-07-07 14:17:19
Readmore >
ప్రియుడు కోసం మెడపై నుంచి తోసేసి చావకపోతే.. హార్పిక్ ఎక్కించి భర్తను చంపేసిన భార్య
Posted On 2026-07-07 14:04:52
Readmore >
ఆల్ ఇండియా కాంగ్రెస్ మహిళా అధ్యక్షురాలు ఆల్కలాంబ ని మర్యాదపూర్వకంగా కలిసిన మాజీ మున్సిపల్ చైర్‌పర్సన్ గడ్డం ఇందుప్రియ
Posted On 2026-07-07 14:03:47
Readmore >