| Daily భారత్
Logo




ప్రాణం తీసిన పదివేల అప్పు

News

Posted on 2025-10-16 19:34:36

Share: Share


ప్రాణం తీసిన పదివేల అప్పు

డైలీ భారత్ న్యూస్, నర్సంపేట /నల్లబెల్లి క్రైమ్: పది వేల రూపాయల అప్పు ఓ నిండు ప్రాణాన్ని బలిగొన్న విషాద ఘటన వరంగల్ జిల్లా నల్లబెల్లి మండలం కొండాపురం గ్రామంలో జరిగింది. కుటుంబ సభ్యులు, పోలీసుల  తెలిపిన వివరాల ప్రకారం. కొండాపురం  గ్రామానికి చెందిన మెరుగుత్తి రమేశ్, సురేశ్ అన్నదమ్ములు . కాగా నాలుగు నెలల కిందట తమ్ముడు సురేశ్ వద్ద అన్న రమేశ్ అవసర నిమిత్తంకి రూ.10 వేలు అప్పుగా తీసుకున్నాడు. ఈ క్రమంలోనే తల్లి సమ్మక్కతో ఇంటి స్థల విషయంపై గొడవ పడుతుండగా అదే సమయంలో మద్యం మత్తులో ఇంటికి వచ్చిన సురేశ్ తన అన్నని డబ్బులు ఇవ్వాలంటూ రమేశ్తో గొడవకు దిగాడు. ఇద్దరి మధ్య మాటామాటా పెరుగగా క్షణికావేశంలో సురేశ్ కత్తితో అన్న వీపు పై పొట్ట భాగంలో దాడి చేశాడు. పక్కనే ఉన్న వదిన స్వరూప ఆపడానికి ప్రయత్నించగా ఆమె ఛాతి పైనా దాడికి దిగాడు. ఇద్దరికీ తీవ్ర గాయాలు కావడంతో స్థానికులు ఆస్పత్రికి తరలించారు. ఈ క్రమంలో చికిత్స పొందుతూ స్వరూప మృతి చెందింది. రమేశ్ను మెరుగైన చికిత్స కోసం ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. ఈ విషయం పై మృతురాలి కొడుకు శివకుమార్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై గోవర్ధన్ తెలిపారు.

Image 1

పోలీసు స్టేష‌న్ స్థ‌లాన్ని కాపాడిన హైడ్రా

Posted On 2026-07-08 19:27:58

Readmore >
Image 1

మహిళలు, చిన్నారులకు భరోసా... బాధితులకు అండగా జిల్లా భరోసా కేంద్రం

Posted On 2026-07-08 14:21:40

Readmore >
Image 1

సర్పంచుల ఫోరం రాష్ట్ర అధ్యక్షులు భూమన్న యాదవ్ ను కలిసిన బిక్కనూరు మండల సర్పంచులు

Posted On 2026-07-08 14:18:42

Readmore >
Image 1

వైరా నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం దృష్టికి బహిరంగ విజ్ఞప్తి

Posted On 2026-07-08 07:55:23

Readmore >
Image 1

ప్రభుత్వ ఆసుపత్రిలో దారుణ హత్య.. కత్తితో భార్య గొంతు కోసిన భర్త

Posted On 2026-07-08 07:13:19

Readmore >
Image 1

రాజన్న సిరిసిల్ల డబుల్ మర్డర్: భూ వివాదంతో రెండు హత్యలు, నిందితుడికి యావజ్జీవ ఖైదు

Posted On 2026-07-07 14:17:19

Readmore >
Image 1

పేలుళ్ల కేసులో గుజరాత్ హైకోర్టు సంచలన తీర్పు

Posted On 2026-07-07 14:05:48

Readmore >
Image 1

ప్రియుడు కోసం మెడపై నుంచి తోసేసి చావకపోతే.. హార్పిక్‌ ఎక్కించి భర్తను చంపేసిన భార్య

Posted On 2026-07-07 14:04:52

Readmore >
Image 1

ఆల్ ఇండియా కాంగ్రెస్ మహిళా అధ్యక్షురాలు ఆల్కలాంబ ని మర్యాదపూర్వకంగా కలిసిన మాజీ మున్సిపల్ చైర్‌పర్సన్ గడ్డం ఇందుప్రియ

Posted On 2026-07-07 14:03:47

Readmore >
Image 1

ప్రభుత్వ పాఠశాలలకే పిల్లలను పంపిద్దాం

Posted On 2026-07-07 08:21:25

Readmore >