Posted on 2025-10-20 08:09:48
డైలీ భారత్, నల్లగొండ:తెలంగాణలో ఇటీవల కొన్ని దారుణ సంఘటనలు చోటుచేసుకున్నాయి. ఇవి కుటుంబాల మధ్య ఉద్రిక్తతలు, ఆర్థిక సమస్యలు, సామాజిక ఒత్తిళ్ల కారణంగా తల్లిదండ్రులు తమ పిల్లలను హత్య చేసి ఆత్మహత్యకు పాల్పడుతున్న ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. వారం రోజుల క్రితం హైదరాబాద్ బలానగర్‌లో 27 ఏళ్ల మహిళ తన ఇద్దరు పిల్లలను హత్య చేసి ఆత్మహత్యకు పాల్పడింది. అలాగే కృష్ణా జిల్లా చిలకలపాడు గ్రామంలో ఒక వ్యక్తి తన ఇద్దరు పిల్లలను విషం తాగించి హత్య చేసి, ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తాజాగా ఇలాంటి ఘటనే నల్లగొండ జిల్లాలో చోటు చేసుకుంది.
కొండమల్లేపల్లి కి చెందిన ఓ మహిళ తన ఇద్దరు పిల్లలను చంపి, ఆ తర్వాత తాను ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటనతో కొండమల్లేపల్లి లో పండగ పూట విషాద ఛాయలు అలుముకున్నాయి. ఈ సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృతులు నాగలక్ష్మి(27) అవంతిక(9) నాగసాయి (7)గా గుర్తించారు. కుటుంబ కలహాల కారణంగా మహిళ ఈ దారుణానికి ఒడిగట్టినట్లు బంధువులు చెబుతున్నారు. కాగా ఈ ఘటనకు సంబంధించిన పూర్తి సమాచారం అందుబాటులోకి రావాల్సి ఉంది.
మహిళలు, చిన్నారులకు భరోసా... బాధితులకు అండగా జిల్లా భరోసా కేంద్రం
Posted On 2026-07-08 14:21:40
Readmore >
సర్పంచుల ఫోరం రాష్ట్ర అధ్యక్షులు భూమన్న యాదవ్ ను కలిసిన బిక్కనూరు మండల సర్పంచులు
Posted On 2026-07-08 14:18:42
Readmore >
వైరా నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం దృష్టికి బహిరంగ విజ్ఞప్తి
Posted On 2026-07-08 07:55:23
Readmore >
ప్రభుత్వ ఆసుపత్రిలో దారుణ హత్య.. కత్తితో భార్య గొంతు కోసిన భర్త
Posted On 2026-07-08 07:13:19
Readmore >
రాజన్న సిరిసిల్ల డబుల్ మర్డర్: భూ వివాదంతో రెండు హత్యలు, నిందితుడికి యావజ్జీవ ఖైదు
Posted On 2026-07-07 14:17:19
Readmore >
ప్రియుడు కోసం మెడపై నుంచి తోసేసి చావకపోతే.. హార్పిక్ ఎక్కించి భర్తను చంపేసిన భార్య
Posted On 2026-07-07 14:04:52
Readmore >
ఆల్ ఇండియా కాంగ్రెస్ మహిళా అధ్యక్షురాలు ఆల్కలాంబ ని మర్యాదపూర్వకంగా కలిసిన మాజీ మున్సిపల్ చైర్‌పర్సన్ గడ్డం ఇందుప్రియ
Posted On 2026-07-07 14:03:47
Readmore >