Posted on 2025-10-20 11:20:29
రాష్ట్ర డీజీపీ ప్రకటన
డైలీ భారత్, హైదరాబాద్: కరడుగట్టిన నేరస్తుడు షేక్ రియాజ్ చేతిలో దారుణ హత్యకు గురైన పోలీస్ కానిస్టేబుల్ ఎంపల్లి ప్రమోద్ కుమార్‌కు పోలీసు శాఖ తరుపున ఘన నివాళులు అర్పించారు డీజీపీ శివధర్ రెడ్డి.
సోమవారం మీడియాతో మాట్లాడుతూ..
తెలంగాణలో లా అండ్ ఆర్డర్‌ను పూర్తి స్థాయిలో కాపాడేందుకు తెలంగాణ పోలీసు శాఖ నిబద్ధతతో ఉందని డీజీపీ స్పష్టం చేశారు. ఎలాంటి తీవ్ర నేరస్తులను అయినా కఠినంగా అణచివేస్తామని వెల్లడించారు. భర్త ప్రమోద్‌ను పోగొట్టుకున్న అతని భార్య ప్రణీతకు, అతి చిన్న వయసులోనే తండ్రిని కోల్పోయిన అతని ముగ్గురు కుమారులకు, వారి కుటుంబానికి ప్రభుత్వం, పోలీసు శాఖ పూర్తి స్థాయిలో అండగా ఉంటామని హామీ ఇచ్చారు.
జీవో ఆర్టీ నెంబ 411 ప్రకారం ఒక కోటి రూపాయలు ఎక్స్ గ్రేషియా ఇవ్వనున్నట్లు ప్రకటించారు. కానిస్టేబుల్ పదవీ విరమణ వరకు లాస్ట్ పే డ్రాన్ సాలరీతో పాటు కుటుంబ సభ్యులలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇస్తామన్నారు. జీవో 155 ప్రకారం 300 గజాల ఇంటి స్థలం మంజూరు చేస్తామన్నారు. అలాగే పోలీస్ భద్రత సంక్షేమం నుంచి 16 లక్షల ఎక్స్ గ్రేషియా, పోలీస్ వెల్ఫేర్ నుంచి 8 లక్షల రూపాయల ఎక్స్ గ్రేషియాను ప్రమోద్ కుటుంబానికి చెల్లించి వారి కుటుంబానికి అండగా ఉంటామని ప్రకటించారు డీజీపీ. విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన వారికి తెలంగాణ రాష్ట్ర పోలీస్ శాఖ తరుపున డీజీపీ శివధర్ రెడ్డి నివాళులర్పించారు.
మహిళలు, చిన్నారులకు భరోసా... బాధితులకు అండగా జిల్లా భరోసా కేంద్రం
Posted On 2026-07-08 14:21:40
Readmore >
సర్పంచుల ఫోరం రాష్ట్ర అధ్యక్షులు భూమన్న యాదవ్ ను కలిసిన బిక్కనూరు మండల సర్పంచులు
Posted On 2026-07-08 14:18:42
Readmore >
వైరా నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం దృష్టికి బహిరంగ విజ్ఞప్తి
Posted On 2026-07-08 07:55:23
Readmore >
ప్రభుత్వ ఆసుపత్రిలో దారుణ హత్య.. కత్తితో భార్య గొంతు కోసిన భర్త
Posted On 2026-07-08 07:13:19
Readmore >
రాజన్న సిరిసిల్ల డబుల్ మర్డర్: భూ వివాదంతో రెండు హత్యలు, నిందితుడికి యావజ్జీవ ఖైదు
Posted On 2026-07-07 14:17:19
Readmore >
ప్రియుడు కోసం మెడపై నుంచి తోసేసి చావకపోతే.. హార్పిక్ ఎక్కించి భర్తను చంపేసిన భార్య
Posted On 2026-07-07 14:04:52
Readmore >
ఆల్ ఇండియా కాంగ్రెస్ మహిళా అధ్యక్షురాలు ఆల్కలాంబ ని మర్యాదపూర్వకంగా కలిసిన మాజీ మున్సిపల్ చైర్‌పర్సన్ గడ్డం ఇందుప్రియ
Posted On 2026-07-07 14:03:47
Readmore >