| Daily భారత్
Logo




నల్గొండ జిల్లాలో మాత శిశు ఆరోగ్య కేంద్రంలో అగ్ని ప్రమాదం

News

Posted on 2023-09-11 08:32:20

Share: Share


నల్గొండ జిల్లాలో మాత శిశు ఆరోగ్య కేంద్రంలో అగ్ని ప్రమాదం

డైలీ భారత్, నల్గొండ జిల్లా:నల్గొండ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రిలో ఇవాళ తెల్లవారుజామున అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది  మాతాశిశు ఆరోగ్య కేంద్రం స్టోర్ రూంలో షాక్ సర్క్యూట్​తో ఈ ఘటన జరిగినట్లు తెలిసింది.

స్టోర్ రూమ్​లో చెలరేగిన మంటలు ఇతర వార్డులకు వెంట వెంటనే వ్యాపించాయి. స్టోర్​ రూమ్​లో ఉన్న బ్లీచింగ్ పౌడర్ మండటంతో దట్టమైన పొగలు అలుముకున్నాయి. పొగలు వ్యాపించడంతో వార్డుల్లో ఉన్న రోగులు ఇబ్బందులు పడ్డారు. ప్రమాదం జరిగిన విషయం తెలిసిన వెంటనే చిన్నారులతో సహా తల్లులు బయటకు పరుగులు తీశారు.

పొగ దట్టంగా అలుముకోవడంతో సిబ్బంది అప్రమత్తమైంది. వెంటనే పొగ బయటకు పోయేలా కిటికీల అద్దాలు పగలగొట్టారు. ఎలాంటి ప్రాణ నష్టం జరగకపోవడంతో ఆస్పత్రి సిబ్బంది ఊపిరి పీల్చుకున్నారు.

సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకున్నారు. మంటలు పూర్తిగా ఆర్పిన తర్వాత.. షార్ట్ సర్క్యూట్ వల్లే ఘటన చోటుచేసుకుందని తెలిపారు.

​మరోవైపు దట్టమైన పొగ వల్ల చిన్నారులు ఊపిరి పీల్చుకునేందుకు కష్టమవుతోందని తల్లులు ఆవేదన వ్యక్తం చేశారు

Image 1

పెద్ది సుదర్శన్ రెడ్డి కి నివాళులు అర్పించిన వైరా నియోజకవర్గ నాయకులు లాకవత్ గిరిబాబు

Posted On 2026-08-10 07:42:21

Readmore >
Image 1

నర్సంపేట మాజీ శాసనసభ్యులు పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహ గద్దెను కూల్చివేయడం పిరికిపంద చర్య

Posted On 2026-08-10 07:40:54

Readmore >
Image 1

మిస్ యూనివర్స్ పోటీల్లో సత్తా చాటిన మాదినేని నిఖిత

Posted On 2026-08-10 07:39:20

Readmore >
Image 1

ఏపీలో జూనియర్ డాక్టర్ల నిరసనల హోరు...

Posted On 2026-08-10 07:37:01

Readmore >
Image 1

"నెలకొక మంచి పని... కామారెడ్డి విద్యార్థి రశ్వంత్‌కు 10వ నారాయణ సేవ"

Posted On 2026-08-10 03:31:22

Readmore >
Image 1

కట్ట మైసమ్మ బోనాల ఉత్సవాల్లో పాల్గొన్న ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్

Posted On 2026-08-09 18:12:44

Readmore >
Image 1

వైరాలో ఘోరం... 11 ఏళ్ల బాలికపై లైంగిక దాడికి యత్నం... తెలంగాణ రక్షణ సేన నేతపై పోక్సో కేసు!

Posted On 2026-08-09 12:53:35

Readmore >
Image 1

ఘోర ప్రమాదం.. ఢీకొట్టుకుని బ్రిడ్జిపై నుంచి కిందపడ్డ లగ్జరీ బస్సు, ఐషర్ వాహనం.. 20 మందికి తీవ్ర గాయాలు!

Posted On 2026-08-09 08:27:49

Readmore >
Image 1

ఏడాదిగా మూసి ఉన్న ఇంటి తలుపులు.. అనుమానంతో తెరిచి చూస్తే బయటపడ్డ అస్థిపంజరం!

Posted On 2026-08-09 08:09:49

Readmore >
Image 1

కామారెడ్డి : విద్యుత్ నగర్ లో భారీ చోరీ

Posted On 2026-08-09 06:28:48

Readmore >