Posted on 2024-01-06 20:00:05
డైలీ భారత్, బెంగళూరు: సూర్యుడిని అధ్యయనం చేసేందుకు నింగిలోకి దూసుకెళ్లిన ఆదిత్య-ఎల్1 (Aditya-L1) తన గమ్యస్థానాన్ని విజయవంతంగా చేరుకుంది. ఈ స్పేస్‌క్రాఫ్ట్‌ను తుది కక్ష్యలోకి ప్రవేశపెట్టేందుకు భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) శనివారం చేపట్టిన కీలక ఘట్టం ఫలించింది. భూమి నుంచి సూర్యుని దిశగా 15 లక్షల కిలోమీటర్ల దూరంలోని లగ్రాంజ్ పాయింట్ చుట్టూ ఉన్న హాలో కక్ష్యలోకి దీన్ని పంపించారు. ఇక్కడి నుంచి ఇది నిరంతరం సూర్యుడిని పర్యవేక్షిస్తుంది. సౌర వాతావరణాన్ని లోతుగా అధ్యయనం చేయడం "ఆదిత్య ఎల్1"లక్ష్యం. భారత్ తరఫున సూర్యుడిని పరిశోధించేందుకు ఇస్రో చేపట్టిన తొలి మిషన్ ఇదే కావడం గమనార్హం.
నకిలీ "షాదీ ముబారక్" లబ్ధిదారులను సృష్టించి ప్రభుత్వ నిధులను మళ్లించినందుకు ఆరుగురి అరెస్టు
Posted On 2026-06-14 20:18:49
Readmore >
దుబాయ్-అహ్మదాబాద్ విమానం టాయిలెట్‌లో రూ.4.26 కోట్ల బంగారం స్వాధీనం
Posted On 2026-06-14 14:08:47
Readmore >
ఘనంగా భీమారం గ్రామ సర్పంచ్ గీత వీరేశం గుప్త జన్మదిన వేడుకలు
Posted On 2026-06-14 13:54:26
Readmore >
ఇందిరమ్మ ఇళ్ళను పరిశీలించిన బిజెపి నియోజకవర్గ నాయకులు తంబళ్ల రవి
Posted On 2026-06-14 13:11:06
Readmore >