Posted on 2025-10-25 13:38:37
బీఆర్ఎస్ నేతలు ఇప్పటికైనా ఆలోచించండి
ఇంట్లో జరుగుతున్న కుట్రలు వాస్తవాలను బయట పెట్టినందుకే కుట్ర చేసి నన్ను బయటకి పంపించారు.
ఇప్పుడు నా దారి నేను వెతుక్కుంటున్నా.
ఈ జిల్లా బిడ్డగా, కోడలిగా మీ ఆశీర్వాదం కోసం వచ్చా.
తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత.
డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్:5 నెలలుగా జరుగుతున్న రాజకీయ పరిణామాల కారణంగా నిజామాబాద్ రాలేకపోయానని అన్నారు. ఇన్ని రోజుల తర్వాత ఇక్కడికి రావటం సంతోషంగా ఉందన్నారు. నేను నిజామాబాద్ కోడలిని. ఇది నా గడ్డ. ఎప్పటికైనా ఈ గడ్డలోనే కలిసిపోతానని తీవ్ర స్థాయిలో ఉద్వేగపూరితంగా వ్యాఖ్యలు చేశారు. జనం బాట కార్యక్రమంలో భాగంగా మాజీ ఎంపీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత శనివారం నిజామాబాద్ జిల్లాలో కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ దేశ వ్యాప్తంగా ఎక్కడ ఉన్న సరే నా మనసు ఈ గడ్డపైకి కొట్టుకుంటుందన్నారు.ఆర్ఎస్ఎస్ వ్యవస్థాపకులు హెగ్డేవార్ ఈ జిల్లాలోని కందకుర్తిలో పుట్టారు. ఇంకో పక్క మనాల అడవుల్లో ఎన్ కౌంటర్లు జరిగినటువంటి చరిత్ర ఉందన్నారు. బీఆర్ఎస్ పార్టీ నుంచి మొట్టమొదటి సారి నిజామాబాద్ జెడ్పీ ఛైర్మన్ గెలిచారు. అప్పటి నుంచే ఉద్యమం ఊపందుకుందన్నారు. అన్ని భావాజాలలకు మద్దతునిస్తూ ముందున్నటువంటి జిల్లా మనది. మీ బిడ్డను కాబట్టి నన్ను ఇక్కడి నుంచి పార్లమెంట్ కు పంపించారు. మీ మర్యాద, గౌరవం కాపాడే విధంగా పనిచేసి మంచి పేరు తెచ్చుకున్నాను. బీఆర్ఎస్ పార్టీని కూడా దీవించి అన్ని సీట్లు గెలిపించారు. నేను 27 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు ఉద్యమంలోకి వచ్చానని, గత 20 ఏళ్లుగా తెలంగాణ కోసం, కేసీఆర్ కోసం, టీఆర్ఎస్, బీఆర్ఎస్ కోసం పనిచేశానని అన్నారు. మీ కోడలిగా, బిడ్డగా నాకు ఎన్ని కష్టాలు ఎదురైనా సరే సహనంతో ఎదురుచూశా, నేను బీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా ఏమీ చేయలే. కానీ నన్ను కుట్ర చేసి పంపించారు. నిజామాబాద్ లో ఉన్న బీఆర్ఎస్ కార్యకర్తలు ఆలోచించాలని కోరారు.
నిజామాబాద్ లో నా ఓటమి కుట్రనా కాదా ఆలోచించాలని అడుగుతున్నాని అన్నారు. ఇక్కడ ఏం కుట్ర జరిగిందో చిన్న పిల్లలను అడిగిన సరే చెబుతారని ఆమె పేర్కొన్నారు. ఎన్ని అవమానాలు జరిగినా సరే నాన్న అని భరించా, బీఆర్ఎస్ మీద ప్రేమతో భరించా, కానీ ఇంటి గుట్టు బయటపెట్టి నన్ను ఇబ్బంది పెట్టారు. నన్ను పార్టీ నుంచి కుట్రలు ఫన్ని పంపించారన్నారు. ఈ సమయంలో మీ ఆశీర్వాదం కావాలని మీ ముందుకు వచ్చా. తొలి అడుగు మన గడ్డ మీది నుంచే అని వచ్చాను అని అన్నారు.
ఈ ప్రభుత్వం రూ. 2500 పెన్షన్ ఇస్తలేదు. పెన్షన్ కోసం ప్రభుత్వం పై పిడికిలి బిగించి కొట్లాడాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వం మహిళలు, నిరుద్యోగులను చిన్నచూపు చూస్తోందన్నారు. గత 10 ఏళ్లలో మనం కొంత సాధించుకున్నాం. కానీ అమర వీరుల కుటుంబాలకు దక్కాల్సిన గౌరవం, న్యాయం దక్కలేదు. ఆనాటి ఉద్యమకారులకు, ఈనాటి ఉద్యమకారులకు కూడా అన్యాయం జరిగిందన్నారు. ప్రతి అమర వీరుల కుటుంబానికి కోటి రూపాయలు వచ్చే వరకు ఉద్యమం చేస్తాం. ప్రతి ఉద్యమకారునికి ఐడెంటిటీ కార్డు ఇవ్వాలన్నారు. స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొన్న వారికి వచ్చిన విధంగా తెలంగాణ రాష్ట్రం కోసం అసువులు బాసిన అమరవీరులకు ఉద్యమకారులకు పెన్షన్ ఇస్తేనే బంగారు తెలంగాణ సాధ్యమవుతుందన్నారు. ఇంకా అనేక అంశాలు, విషయాలు ఉన్నాయి. వాటిపై పోరాటం చేయాల్సి ఉంది.
జనం బాటలో మేధావులు, విద్యార్థులు సహా అన్ని వర్గాలతో మాట్లాడుతాను అని స్పష్టం చేశారు ఇలా అందరి మద్దతు వారి ఆలోచనలు తీసుకొని భవిష్యత్ కార్యాచరణలు రూపొందిస్తానని ఆమె అన్నారు. ప్రతి ఒక్కరినీ భాగస్వామిగా చేయడమే తన ప్రధాన కర్తవ్యం అన్నారు. ప్రతి ఒక్కరికి ఆత్మగౌరవంతో కూడిన అభివృద్ధి కావాలని నేను కోరుతున్నా అని అన్నారు. ఇంత పెద్ద సంఖ్యలో వచ్చి నాకు ఆశీర్వాదం ఇచ్చిన మీరు...ముందు ముందు కూడా నాకు అండగా ఉండాలని అభ్యర్థించారు. పేద వారికి ఇళ్లు, వైద్యం, విద్య అందాల్సిన అవసరం ఉందన్నారు. నిజామాబాద్ గవర్నమెంట్ హాస్పిటల్ లో పరిస్థితి దయనీయంగా మారిందన్నారు. గురుకులాల్లో ఆత్మహత్యలు, ఎలుకలు విద్యార్థులను కొరకటం, అత్యాచారాలు జరుగుతున్నాయి. ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం సిగ్గుపడాలె. కనీసం వారికి భద్రత, తిండి సరిగా పెట్టలేకపోతున్నారు. ఈ జిల్లాకే చెందిన పీసీసీ ప్రెసిడెంట్ మహేష్ గౌడ్ దీనిపై ఒక్క మాట ఎందుకు మాట్లాడటం లేదు ప్రజలే నిలదీయాలన్నారు.
సరైన విద్య, ఉద్యోగాలు, వైద్యం అందించలేక పోతున్నారని, బంగారు లేడినో, ఆకాశం లో పక్షినే మనం అడగటం లేదు. మనకు మంచి తిండి కావాలని అడుగుతున్నాం అది కూడా అందించలేని దౌర్భాగ్యస్థితి కాంగ్రెస్ పరిస్థితి అని విమర్శించారు. బీఆర్ఎస్ నన్ను కుట్ర చేసి పంపించటంతో నా దారి నేను వెతుకుతున్నా. అని అన్నారు. ఇన్నాళ్లు కేసీఆర్ గనీడలో ఉన్నా. ఇప్పుడు ఆ నీడలోంచి నన్ను బయట పడేశారు. అందుకే మీరు ఆశీర్వదిస్తారని మీ కోసం వచ్చా. మీరు అండగా ఉంటారని నమ్ముతున్నా అని అన్నారు.
మహిళలు, చిన్నారులకు భరోసా... బాధితులకు అండగా జిల్లా భరోసా కేంద్రం
Posted On 2026-07-08 14:21:40
Readmore >
సర్పంచుల ఫోరం రాష్ట్ర అధ్యక్షులు భూమన్న యాదవ్ ను కలిసిన బిక్కనూరు మండల సర్పంచులు
Posted On 2026-07-08 14:18:42
Readmore >
వైరా నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం దృష్టికి బహిరంగ విజ్ఞప్తి
Posted On 2026-07-08 07:55:23
Readmore >
ప్రభుత్వ ఆసుపత్రిలో దారుణ హత్య.. కత్తితో భార్య గొంతు కోసిన భర్త
Posted On 2026-07-08 07:13:19
Readmore >
రాజన్న సిరిసిల్ల డబుల్ మర్డర్: భూ వివాదంతో రెండు హత్యలు, నిందితుడికి యావజ్జీవ ఖైదు
Posted On 2026-07-07 14:17:19
Readmore >
ప్రియుడు కోసం మెడపై నుంచి తోసేసి చావకపోతే.. హార్పిక్ ఎక్కించి భర్తను చంపేసిన భార్య
Posted On 2026-07-07 14:04:52
Readmore >
ఆల్ ఇండియా కాంగ్రెస్ మహిళా అధ్యక్షురాలు ఆల్కలాంబ ని మర్యాదపూర్వకంగా కలిసిన మాజీ మున్సిపల్ చైర్‌పర్సన్ గడ్డం ఇందుప్రియ
Posted On 2026-07-07 14:03:47
Readmore >