Posted on 2025-10-28 14:37:30
సాధ్యమైనంత త్వరగా పెండింగ్ కేసులు క్లియర్ చేయాలని ఆదేశాలు
పోక్సో, గ్రేవ్ కేసులలో త్వరితగతిన ఇన్వేస్టిగేషన్ పూర్తి చేయాలి
అసాంఘిక కార్యకలాపాలు గంజాయి, జూదం, పి.యడి. యస్ రైస్ అక్రమ రవాణలాంటి వాటిపై ప్రత్యేక దృష్టి, పటిష్టమైన చర్యలు
సైబర్ నేరాల పై ప్రజలలో అవగాహణ కార్యక్రమాలను నిర్వహించాలి
డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్: నిజామాబాద్ డివిజన్ పరిధిలోని అన్ని పోలీస్ స్టేషన్ అధికారులతో నెలవారి సమీక్ష సమావేశం పోలీస్ కార్యాలయంలోని కమాండ్ కంట్రోల్ హాల్ లో మంగళవారం నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య, ఐ.పి.యస్. ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్బంగా పలు విషయాలు క్షుణ్ణంగా చర్చించారు.
నిజామాబాద్ డివిజన్ పరిధిలోని అన్ని పోలీస్ స్టేషన్ అధికారులతో నిర్వహించిన నెలవారి నేర సమీక్ష సమావేశంలో పెండింగ్ కేసులు లేకుండా అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని పెండింగ్ కేసులను త్వరితగతిన పరిష్కరిస్తూ పెండింగ్ కేసుల సంఖ్య తగ్గించడానికి ప్రణాళిక ప్రకారం చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. పెండింగ్లో ఉన్న ( అండర్ ఇన్వేస్టిగేషన్ ) కేసులలో గ్రేవ్ , నాన్ గ్రేవ్ కేసుల గురించి అడిగి, గ్రేవ్ మరియు నాన్ గేవ్ కేసులలో ఇన్వేస్టిగేషన్ చేసేటప్పుడు ప్రతీకేసులలో క్వాలిటీ ఇన్వేస్టిగేషన్తో పూర్తి పారదర్శకంగా చేయాలి అన్నారు. కేసు నమోదు నుండి చార్జీషీటు వరకు ప్రతివిషయాన్ని కూలంకుశంగా పరిశోధన చేసి ఫైనల్ చేయాలి అని అన్నారు. పోక్సో, గ్రేవ్ కేసులలో త్వరితగతిన ఇన్వేస్టిగేషన్ పూర్తి చేసి కోర్టులో చార్జీషీటు దాఖాలు చేయాలి అన్నారు. ప్రతీ అధికారికి సి.సి.టి.ఎన్.ఎస్ పై పూర్తి అవగాహన కలిగి ఉండాలి అన్నారు. ఇన్వేస్టిగేషన్ , స్టేషన్ మేనేజ్మెంటు తెలిసిఉండాలన్నారు. దీర్ఘకాలంగా పెండింగ్ లో ఉన్న కేసులపై ప్రత్యేక దృష్టి సారించి వెంటనే పరిష్కరించే విధంగా తగు చర్యలు తీసుకోవాలని, పెండింగ్ కేసుల విషయంలో నిరంతర పర్యవేక్షణ ఉంటుందని, కొత్త కేసు లతో పాటు చాలా కాలంగా ఉన్న పెండింగ్ కేసులను ఎప్పటికప్పుడు సమీక్షించడం వలన కేసుల సంఖ్య తగ్గించే విధంగా అన్ని స్థాయిల అధికారులు పనిచేయాలని అన్నారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగిం చుకుంటూ ప్రజలకు అందుబాటులో ఉంటూ సమర్ధవంతమైన సేవలు అందజేస్తూ సత్వరన్యాయం చేసే లా కృషి చేయాలని అన్నారు. గ్రామ పోలీస్ అధికారులు ( వి.పి.ఓ ) ప్రతీ రోజు గ్రామాన్ని సందర్శించి ప్రజలతో మమేకంమవుతు నేర నియంత్రణకు కృషి చేయాలని అన్నారు. కమ్యూనిటీ పోలీసింగ్ ద్వారా గ్రామాలలో సి.సి కెమెరాల ప్రాముఖ్యత అవగాహణ కల్పిస్తూ ఏర్పాటుకు కృషి చేయాలని అన్నారు. సైబర్ క్రైమ్ , డయల్ 100 వాటి వినియోగం పై విద్యార్థులకు ప్రజలకు అవగాహణ కల్పించాలని అన్నారు. ఆన్లైన్ మోసాలకు గురి అయినట్లయితే 1930 కాల్ చేసి లేదా ఎన్.సి.ఆర్.పి https://www.cybercrime.gov. ఇంకా పోర్టల్ యందు ఫిర్యాదు నమోదు చేయాలని అన్నారు. రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రత్యేక దృష్టి పెట్టాలని ఎక్కువగా రోడ్డు ప్రమాదాలు జరుగుతున్న ప్రాంతాలలో బ్లాక్ స్పాట్లుగా గుర్తించి సైన్ బోర్డులను ఏర్పాటు చేయించాలని సూచించారు. హైవే రోడ్డులను కలుపుతుఉండే లింక్ రోడ్లకు స్పీడ్ బ్రేకర్స్ వేయించడం రోడ్డుకు అడ్డుగా ఉన్న పొదలను తొలగించే విధంగా చూడాలని అన్నారు. రోడ్డు ఇంజనీరింగ్ లోపాలు ఉన్నట్లయితే నేషనల్ హైవే స్టేట్ హైవే అథారిటి ఇతర సంబంధిత అధికారులతో సమన్వయంతో ప్రమాదాల నివారణకు కృషి చేయాలని అన్నారు. అలాగే రోడ్డు ప్రమాదాలు జరుగకుండా ప్రతీ రోజు మీ పోలీస్ స్టేషన్ పరిధిలో డ్రంకన్ డ్రైవ్ నిర్వహించి, ఓవర్ స్పీడ్, త్రిబల్ డ్రైవింగ్, మైనర్లు వాహనాలు నడుపుటలాంటి వాటిపై ప్రత్యేక దృష్టి పెట్టి స్పెషల్ డ్రైవ్ నిర్వహించాలని అన్నారు. రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రజలలో రోడ్డు భద్రత నిబం ధనల గురించి అవగాహణ కల్పించాలని అన్నారు. విజిబుల్ పోలిసింగ్, పెట్రోలింగ్ ముమ్మరం చేయాలని, బహిరంగ ప్రదేశాలలో మద్యం సేవించ కుండా చర్యలు తీసుకోవాలని దొంగతనాలు జరగకుండా పాతనేరస్థుల కదలికలపై నిఘా ఉంచాలని అన్నారు. అసాంఘిక కార్యకలాపాలు గంజాయి , ఇతర మాదకద్రవ్యాల అక్రమరవాణ క్రయవిక్రయాల పైన, జూదం , పి.డి.యస్. రైస్ అక్రమ రవాణలాంటి వాటిపై ప్రత్యేక దృష్టి సారించి పటిష్టమైన చర్యలు తీసుకోవాలని తెలిపారు. రిపిటెడుగా ఇలాంటి నేరాలకు పాల్పడేవారి పై పిడి యాక్టు కోసం పంపాలని ఆదేశాలు జరిచేశారు. ఈ సందర్భంగా అదనపు డి.సి.పి ( అడ్మిన్ )బస్వా రెడ్డి , నిజామాబాద్ ఎ.సి.పి రాజా వెంకట్ రెడ్డి లు, స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ శ శ్రీశైలం , సి.సి.ఆర్.బి ఇన్స్పెక్టర్ సతీష్ , సి.ఐలు , ఎస్.ఐ లు తదితరులు పాల్గొన్నారు.
మహిళలు, చిన్నారులకు భరోసా... బాధితులకు అండగా జిల్లా భరోసా కేంద్రం
Posted On 2026-07-08 14:21:40
Readmore >
సర్పంచుల ఫోరం రాష్ట్ర అధ్యక్షులు భూమన్న యాదవ్ ను కలిసిన బిక్కనూరు మండల సర్పంచులు
Posted On 2026-07-08 14:18:42
Readmore >
వైరా నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం దృష్టికి బహిరంగ విజ్ఞప్తి
Posted On 2026-07-08 07:55:23
Readmore >
ప్రభుత్వ ఆసుపత్రిలో దారుణ హత్య.. కత్తితో భార్య గొంతు కోసిన భర్త
Posted On 2026-07-08 07:13:19
Readmore >
రాజన్న సిరిసిల్ల డబుల్ మర్డర్: భూ వివాదంతో రెండు హత్యలు, నిందితుడికి యావజ్జీవ ఖైదు
Posted On 2026-07-07 14:17:19
Readmore >
ప్రియుడు కోసం మెడపై నుంచి తోసేసి చావకపోతే.. హార్పిక్ ఎక్కించి భర్తను చంపేసిన భార్య
Posted On 2026-07-07 14:04:52
Readmore >
ఆల్ ఇండియా కాంగ్రెస్ మహిళా అధ్యక్షురాలు ఆల్కలాంబ ని మర్యాదపూర్వకంగా కలిసిన మాజీ మున్సిపల్ చైర్‌పర్సన్ గడ్డం ఇందుప్రియ
Posted On 2026-07-07 14:03:47
Readmore >