Posted on 2025-11-16 14:43:19
డైలీ భారత్, హైదరాబాద్:తెలుగు సినీ పరిశ్రమను వణికించిన పైరసీ సైట్ల నిర్వాహకుడు ఇమ్మడి రవిని సైబర్ క్రైమ్ పోలీసులు హైదరాబాద్‌లో అరెస్ట్ చేశారు. విడాకుల విషయంపై వివాదాలతో ఉన్న రవిపై కీలక సమాచారాన్ని అతడి భార్య పోలీసులకు అందించడంతో ఈ ఆపరేషన్ విజయవంతమైంది. ఫ్రాన్స్ నుంచి వచ్చిన రవిని కూకట్‌పల్లి వద్ద అదుపులోకి తీసుకున్న పోలీసులు, అతడి సమక్షంలోనే iBomma, బప్పం TV వంటి పైరసీ వెబ్‌సైట్లను పూర్తిగా మూసివేశారు. రవితో పాటు హార్డ్‌డిస్క్‌లు, బ్యాంక్ అకౌంట్లపై దర్యాప్తు కొనసాగుతోంది.
తెలుగు సినీ పరిశ్రమను ఏళ్ల తరబడి వణికించిన పైరసీ మాఫియాకు చెక్ పడింది. ఐబొమ్మ బప్పం టీవీ వంటి పైరసీ వేదికల ప్రధాన నిర్వాహకుడు ఇమ్మడి రవి అరెస్ట్ కావడమే కాదు, అతని అరెస్టుకు కారణమైన నేపథ్యం బయటకు రావడం మరింత సంచలనం గా మారింది. ఈ మొత్తం ఆపరేషన్ వెనుక రవి భార్య కీలక పాత్ర పోషించిందన్న విషయమే ఇప్పుడు ఇంటర్నెట్‌ను కుదిపేస్తోంది. విదేశాల్లో ఉంటోన్న రవికి కొంతకాలంగా భార్యతో విభేదాలున్నాయి. ఆ నేపథ్యంలోనే విడాకుల చర్చ కోసం రవి హైదరాబాద్‌కు వస్తున్న సమాచారాన్ని ఆమె గోప్యంగా సైబర్ క్రైమ్ అధికారులకు అందించడంతో పోలీసులు ఈ ఆపరేషన్‌ను విజయవంతంగా పూర్తి చేశారు. ఆమె అందించిన టైమ్‌లైన్, లొకేషన్ వివరాల ఆధారంగా రవిని ట్రాక్ చేసిన పోలీసులు, ఫ్రాన్స్ నుండి అర్థరాత్రి హైదరాబాద్ చేరుకున్న రవిని కూకట్‌పల్లి వద్ద అదుపులోకి తీసుకున్నారు.
రవిని అరెస్ట్ చేయడంతోనే కాదు.. అతను కొన్నాళ్లుగా నడిపిస్తోన్న పైరసీ సామ్రాజ్యాన్ని పూర్తిగా నిలిపివేయించడంలో పోలీసులు విజయం సాధించారు. ‘నా వద్ద కోట్ల మంది డేటా ఉంది… ఈ వెబ్‌సైట్‌ను టచ్ చేయొద్దు’ అంటూ రవి గతంలో పోలీసులుపై విసిరిన సవాలే ఈ కేసులో మలుపు తెచ్చింది. అరెస్టు అనంతరం రవి ల్యాప్‌టాప్‌లు, వెబ్ లాగిన్‌లు, సర్వర్ వివరాలను పోలీసులు స్వాధీనం చేసుకుని అతడి సమక్షంలోనే iBomma, బప్పం TV వంటి పైరసీ వేదికలను శాశ్వతంగా బ్లాక్ చేయించారు. విదేశీ సర్వర్ల ద్వారా నడుస్తున్న ఈ ప్లాట్‌ఫార్మ్‌లను డీయాక్టివేట్ చేయడంలో రవి సహకారం తీసుకోవడం పోలీసుల వ్యూహాత్మక విజయంగా చెప్పుకోవచ్చు. ప్రస్తుతం పోలీసులు రవి నుంచి స్వాధీనం చేసుకున్న వందల సంఖ్యలో హార్డ్‌డిస్క్‌లను, అతని బ్యాంక్ లావాదేవీలను, పైరసీ ద్వారా వచ్చిన అక్రమ ఆదాయ మార్గాలను నిశితంగా పరిశీలిస్తున్నారు. ఈ పైరసీ నెట్‌వర్క్ వెనుక ఉన్న ఇతర వ్యక్తులపై కూడా దర్యాప్తు ప్రారంభమైంది. రవిని మరింత సమాచారం కోసం కస్టడీకి తీసుకోవాలని సైబర్ క్రైమ్ విభాగం సోమవారం నాంపల్లి కోర్టులో పిటిషన్ దాఖలు చేయనుంది.
రవాణా శాఖ ఆధ్వర్యంలో విద్యార్థులకు ఫైర్ సేఫ్టీపై అవగాహన కార్యక్రమం
Posted On 2026-06-19 19:17:58
Readmore >
గాంధీ సరోవర్ ప్రాజెక్ట్‌కు కేంద్ర రక్షణ శాఖ గ్రీన్ సిగ్నల్
Posted On 2026-06-19 19:11:46
Readmore >
దేవాలయం పక్కన ఉన్న వైన్స్ (మద్యం)షాప్ నీ వెంటనే తొలగించాలి..బీజేపీ నాయకులు తంబళ్ల రవి డిమాండ్
Posted On 2026-06-19 17:52:08
Readmore >
ధూప దీప నైవేద్య అర్చక సంఘం ఆధ్వర్యంలో దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ చిత్రపటానికి పాలాభిషేకం
Posted On 2026-06-19 16:50:47
Readmore >
హైదరాబాద్ యశోద హాస్పిటల్ హైటెక్ సిటీ కిడ్నీ చికిత్స విభాగంలో అరుదైన రికార్డు
Posted On 2026-06-19 16:24:52
Readmore >
అనుమతి లేని ఫాస్ట్ ఫుడ్ గోదాముపై దాడి చేసిన హెచ్-ఫాస్ట్ (H-FAST) బృందం
Posted On 2026-06-19 12:16:39
Readmore >