Posted on 2025-11-16 13:45:58
125వ నెల 576 మందికి ఉచితంగా వైద్య సేవలు
డైలీ భారత్, వైరా:వైరా సిపిఎం కార్యాలయం బోడేపూడి వెంకటేశ్వరరావు భవనంలో ప్రతి నెల మూడవ ఆదివారం బోడేపూడి కళానిలయం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న బోడేపూడి వైద్య శిబిరాన్ని 125వ నెల విజయవంతంగా నిర్వహించారు. ఆదివారం బోడేపూడి వైద్య శిబిరం ద్వారా షుగర్, బిపి, కొలెస్ట్రాల్, గ్యాస్, అల్సర్ తదితర వ్యాధులతో బాధపడుతున్న 576 మంది పేద, మద్యతరగతి ప్రజలు ఉచితంగా వైద్య సేవలు పోందినారు. నెల రోజులకు సరిపడా మందులను కేవలం100 రూపాయలకే అందించారు. బోడేపూడి వైద్య వైద్య శిబిరంపై పూర్తి నమ్మకంతో వేలాది మంది ప్రజలు గత పది సంవత్సరాల క్రితం నుంచి ఉచితంగా వైద్య సేవలు పొందుతున్నారు. ఈ సందర్భంగా బోడేపూడి కళానిలయం కార్యదర్శి బొంతు రాంబాబు మాట్లాడుతూ ఆహార అలవాట్లు, నిత్యజీవితంలో ఎదుర్కొంటున్న ఒత్తిడి వలన అనేక ఆరోగ్య సమస్యలు వస్తున్నాయని అన్నారు. శరీర బరువును నియంత్రించుకోవాలని, చక్కెర, స్వీట్లు ,కూల్డ్రింక్స్ మొదలైన వాటిని పూర్తిగా మానేయాలని, కూరగాయలు, ఆకుకూరలు, గింజలు ఎక్కువగా తినాలని, ఒత్తిడి తగ్గించుకోవాలని, ప్రతిరోజు క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలని సూచించారు. శీతాకాలంలో చలి తీవ్రత పెరుగుతున్న దృష్ట్యా షుగర్ పేషంట్స్ గుండె సంబంధించిన పరీక్షలు చేయించుకోవాలని సలహా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో బోడేపూడి వైద్య శిబిరం బాధ్యులు సుంకర సుధాకర్, వాలంటీర్లు చింతనిప్పు చలపతిరావు, బొంతు సమత, గుడిమెట్ల మోహనరావు, అనుమోలు రామారావు, మాదినేని రజిని, మోదుగు నాగరాణి, మల్లెంపాటి ప్రసాదరావు, హరి వేంకటేశ్వరరావు, కంభంపాటి సత్యనారాయణ, మందడపు నాగేశ్వరావు, పూనాటి సూరయ్య తదితరులు పాల్గొన్నారు.
నీట్ రీ-ఎగ్జామ్ అభ్యర్థులకు టీజీఎస్ ఆర్టీసీ ఉచిత బస్సు ప్రయాణ సదుపాయం
Posted On 2026-06-19 20:54:23
Readmore >
గాంధారి పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, ఐపీఎస్
Posted On 2026-06-19 20:36:40
Readmore >
ఏసీబీకి చిక్కిన సర్వే ల్యాండ్ రికార్డు డిప్యూటీ ఇన్స్‌పెక్టర్
Posted On 2026-06-19 20:33:12
Readmore >
రవాణా శాఖ ఆధ్వర్యంలో విద్యార్థులకు ఫైర్ సేఫ్టీపై అవగాహన కార్యక్రమం
Posted On 2026-06-19 19:17:58
Readmore >
గాంధీ సరోవర్ ప్రాజెక్ట్‌కు కేంద్ర రక్షణ శాఖ గ్రీన్ సిగ్నల్
Posted On 2026-06-19 19:11:46
Readmore >
దేవాలయం పక్కన ఉన్న వైన్స్ (మద్యం)షాప్ నీ వెంటనే తొలగించాలి..బీజేపీ నాయకులు తంబళ్ల రవి డిమాండ్
Posted On 2026-06-19 17:52:08
Readmore >
ధూప దీప నైవేద్య అర్చక సంఘం ఆధ్వర్యంలో దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ చిత్రపటానికి పాలాభిషేకం
Posted On 2026-06-19 16:50:47
Readmore >