| Daily భారత్
Logo




తిరుమల ప్రసాదంపై అనుచిత వ్యాఖ్యలు... వివాదంలో యాంకర్ శివజ్యోతి

News

Posted on 2025-11-22 15:26:25

Share: Share


తిరుమల ప్రసాదంపై అనుచిత వ్యాఖ్యలు... వివాదంలో యాంకర్ శివజ్యోతి

డైలీ భారత్, న్యూస్ తిరుమల:ప్రపంచంలోనే ఆధ్యాత్మిక పుణ్యక్షేత్రంగా వెలుగొందుతున్న తిరుమల  పవిత్రతను కాపాడేందుకు టీటీడీ ఇప్పటికే కట్టుదిట్టమైన చర్యలు చేపడుతోంది. ఇందులో భాగంగా ఆలయ పరిధిలో భక్తులు ఎవరూ రీల్స్ చేయొద్దనే నిషేధాజ్ఞలు కూడా అమల్లో ఉన్నాయి. కానీ, కొందరు అజ్ఞానులు నియమ నిబంధనలను తుంగలో తొక్కుతూ.. ఆలయ పవిత్రతను మంటగలిపే విధంగా వ్యవహరిస్తున్నారు. వారు సాధారణ ప్రజలైతే తెలీక చేశారని అనుకోవచ్చు.. కానీ, తాజాగా ప్రముఖ యాంకర్ శివజ్యోతి తిరుమల క్యూ లైన్‌లో నిలబడి శ్రీవారి ప్రసాదాన్ని కించపరిచేలా కామెంట్లు చేసింది. తాను చేసింది మంచి పని అన్నట్లుగా వీడియో తీసి ఏకంగా సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం పట్ల హిందూ సంఘాలు మండిపడుతున్నాయి.

ఇటీవల భర్త, స్నేహితులతో కలిసి యాంకర్ శివజ్యోతి తిరుమలకు వెళ్లింది. ఈ క్రమంలోనే వారు శ్రీవారి దర్శనం కోసం క్యూ లైన్‌లో నిలబడగా.. భక్తుల కోసం సేవకులు ప్రసాదాన్ని పంపిణీ చేశారు. అయితే, ఆ ప్రసాదం తీసుకున్న శివజ్యోతి, ఆమె స్నేహితుడు ‘తిరుమలలో కాస్ట్లీ ప్రసాదం అడుక్కుంటున్నాం’.. ‘రిచ్చెస్ట్ బిచ్చగాళ్లం మేమే’ అంటూ కామెంట్ చేశారు. ప్రస్తుతం ఆమె చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. అది చూసిన నెటిజన్లు, హిందూ ధార్మిక సంఘాలు శివజ్యోతితో పాటు ఆమె స్నేహితులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

Image 1

జనరల్ టికెట్ పై రైల్వే శాఖ హెచ్చరిక

Posted On 2026-06-14 09:20:07

Readmore >
Image 1

కామారెడ్డి పాఠశాలలపై చర్యలు తీసుకోవాలి : అఖిల భారతీయ విద్యార్థి పరిషత్

Posted On 2026-06-14 08:30:06

Readmore >
Image 1

హ్యూమన్‌ రైట్స్‌ జిల్లా చైర్మన్‌గా దేవోల్లా రాములు

Posted On 2026-06-13 20:33:57

Readmore >
Image 1

అశ్వారావుపేట 100 పడకల హాస్పిటల్ త్వరగా పూర్తి చేయాలి : బీజేపీ నాయకులు తంబళ్ల రవి

Posted On 2026-06-13 20:32:49

Readmore >
Image 1

ప్లాట్ఫారం మీద బ్రతికే కార్మికుల పై పంచాయతీ కన్ను

Posted On 2026-06-13 11:36:13

Readmore >
Image 1

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఇసుక కాంట్రాక్టులపై తుడుం దెబ్బ ఆందోళన

Posted On 2026-06-13 11:35:06

Readmore >
Image 1

కాసులకు కక్కుర్తితో అక్రమ కరెంట్ కలెక్షన్స్ ఇస్తున్న అధికారులు

Posted On 2026-06-13 11:33:30

Readmore >
Image 1

కాంగ్రెస్ పార్టీని వీడి బిఆర్ఎస్ పార్టీలోకి చేరికల గురించి చర్చలు జరిపిన జూలూరుపాడు మండల పాపకొల్లు గ్రామనికి చెందిన కాంగ్రెస్ యువజన నాయకులు

Posted On 2026-06-13 11:31:24

Readmore >
Image 1

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ నూతన కార్యవర్గంలో మీడియా కమిటీ కార్యదర్శిగా దన్నారపు రాజలింగం నియామకం

Posted On 2026-06-13 11:26:02

Readmore >
Image 1

రైతుల పొలాలకు చేరాల్సిన చెరువు మట్టి రియల్ ఎస్టేట్ వెంచర్లకు తరలింపు?

Posted On 2026-06-13 11:25:04

Readmore >