Posted on 2025-11-22 15:35:42
డైలీ భారత్ న్యూస్, హైదరాబాద్:స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి రిజర్వేషన్ల విధివిధానాలను రాష్ట్ర ప్రభుత్వం ఖరారు చేసింది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు 50 శాతం మించకుండా రిజర్వేషన్లు కల్పించేలా మార్గదర్శకాలను జారీ చేసింది.
ఈ మేరకు శనివారం జీవోను విడుదల చేసింది. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో రిజర్వేషన్లను ఎలా అమలులోకి తీసుకురావాలో స్పష్టమైన ప్రక్రియను వివరించింది.
భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 244 ప్రకారం షెడ్యూల్డ్ ఏరియాల్లో రిజర్వేషన్లను అమలు చేయనున్నట్లు జీవోలో పేర్కొంది. ఇక మహిళలకు 50 శాతం వరకు రిజర్వేషన్లకు కల్పించాలని నిర్ణయించింది. ఈ రిజర్వేషన్లను ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓసీ సహా అన్ని కేటగిరీల్లో సమానంగా అమలు చేయాలని మార్గదర్శకాల్లో పేర్కొంది. గత (2019) ఎన్నికల్లో ఏ కేటగిరీకి రిజర్వేషన్లు కేటాయించారో , వాటిని పరిగణనలోకి తీసుకుని తాజా రొటేషన్ ప్రకారం రిజర్వేషన్లు అమలు చేయాలని స్పష్టం చేసింది. ఇక వార్డు మెంబర్లకు 2024 కుల సర్వే ఆధారంగా, సర్పంచులకు 2011 సెన్సస్ ఆధారంగా( బీసీ సర్పంచ్ అభ్యర్థులకు 2024 కుల సర్వే) రిజర్వేషన్లు కల్పించింది.
కామారెడ్డి పాఠశాలలపై చర్యలు తీసుకోవాలి : అఖిల భారతీయ విద్యార్థి పరిషత్
Posted On 2026-06-14 08:30:06
Readmore >
అశ్వారావుపేట 100 పడకల హాస్పిటల్ త్వరగా పూర్తి చేయాలి : బీజేపీ నాయకులు తంబళ్ల రవి
Posted On 2026-06-13 20:32:49
Readmore >
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఇసుక కాంట్రాక్టులపై తుడుం దెబ్బ ఆందోళన
Posted On 2026-06-13 11:35:06
Readmore >
కాసులకు కక్కుర్తితో అక్రమ కరెంట్ కలెక్షన్స్ ఇస్తున్న అధికారులు
Posted On 2026-06-13 11:33:30
Readmore >
కాంగ్రెస్ పార్టీని వీడి బిఆర్ఎస్ పార్టీలోకి చేరికల గురించి చర్చలు జరిపిన జూలూరుపాడు మండల పాపకొల్లు గ్రామనికి చెందిన కాంగ్రెస్ యువజన నాయకులు
Posted On 2026-06-13 11:31:24
Readmore >
తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ నూతన కార్యవర్గంలో మీడియా కమిటీ కార్యదర్శిగా దన్నారపు రాజలింగం నియామకం
Posted On 2026-06-13 11:26:02
Readmore >
రైతుల పొలాలకు చేరాల్సిన చెరువు మట్టి రియల్ ఎస్టేట్ వెంచర్లకు తరలింపు?
Posted On 2026-06-13 11:25:04
Readmore >