Posted on 2025-11-23 16:55:35
సంజయ్ తండ్రికి తగ్గ తనయుడిగా పేరు తెచ్చుకోవాలి
ప్రభుత్వ సలహాదారులు తెచ్చుకోవాలిసుదర్శన్ రెడ్డి, మహమ్మద్ షబ్బీర్ అలీ వెల్లడి
నా రాజకీయ గురువు డి. శ్రీనివాస్
ఆయన ద్వారానే రాజకీయాల్లో ఓనమాలు నేర్చుకున్నాను..
పిసిసి చీఫ్ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ వ్యాఖ్యలు
అట్ట హాసంగా మున్నూరు కాపు జిల్లా అధ్యక్షుని బాధ్యతలు స్వీకరించిన మాజీ మేయర్ సంజయ్
డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్:నిజామాబాద్ జిల్లా మున్నూరు కాపు నూతన అధ్యక్షునిగా నియామకమైన మాజీ మేయర్ ప్రస్తుత మున్నూరుకాపు జిల్లా అధ్యక్షుడు ధర్మపురి సంజయ్ ప్రమాణస్వీకారం అంగరంగ వైభవంగా అతిరథ మహారధుర నడుమ ఆదివారం జిల్లా కేంద్రంలోని మున్నూరు కాపు సంఘంలో ప్రమాణ స్వీకార కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమానికి ప్రభుత్వ సలహాదారులు మాజీ మంత్రులు బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి, షబ్బీర్ అలీలు పాల్గొన్నారు. అదేవిధంగా టిపిసిసి అధ్యక్షుడు డి శ్రీనివాస్ శిష్యుడు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రభుత్వ సలహాదారులు సుదర్శన్ రెడ్డి, షబ్బీర్ అలీలు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీతోనే బీసీలకు సరైన గౌరవం దక్కుతుందని వారు అన్నారు. అలాగే మాజీ మేయర్ సంజయ్ అటు మున్నూరు కాపుల ఐక్యతను చూస్తూనే, తనకున్న రాజకీయ అనుభవంతో ఇకపై జిల్లా కాంగ్రెస్ పార్టీలో క్రియాశీలకంగా పనిచేయాలని వారు కోరారు. కష్టపడ్డ వారికి నిజాయితీతో ఉన్నవారికి కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ ద్రోహం చేయదని అన్నారు. ఇందూరు అంటేనే డిఎస్ గా అపార రాజకీయ అనుభవం కలిగిన సంజయ్ తండ్రి పెద్దవారు డి శ్రీనివాస్ అడుగుజాడల లో నడవడం అభినందనీయం అన్నారు. అలాగే రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో ముఖ్యంగా నిజామాబాద్ కార్పొరేషన్ ఎన్నికల్లో సంజయ్ కాంగ్రెస్ పార్టీ తరపున చురుకైన పాత్ర పోషించాలని వారు అన్నారు. అనంతరం టిపిసిసి చీఫ్ తన రాజకీయ గురువు అప్పటి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు ధర్మపురి శ్రీనివాస్ అని, ఆయనే తనకు రాజకీయ ఓనమాలు నేర్పారని అప్పటి జ్ఞాపకాలను నెమరు వేసుకున్నారు. అనంతరం జిల్లా వ్యాప్తంగా మున్నూరు కాపు సోదరులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.
నకిలీ "షాదీ ముబారక్" లబ్ధిదారులను సృష్టించి ప్రభుత్వ నిధులను మళ్లించినందుకు ఆరుగురి అరెస్టు
Posted On 2026-06-14 20:18:49
Readmore >
దుబాయ్-అహ్మదాబాద్ విమానం టాయిలెట్‌లో రూ.4.26 కోట్ల బంగారం స్వాధీనం
Posted On 2026-06-14 14:08:47
Readmore >
ఘనంగా భీమారం గ్రామ సర్పంచ్ గీత వీరేశం గుప్త జన్మదిన వేడుకలు
Posted On 2026-06-14 13:54:26
Readmore >
ఇందిరమ్మ ఇళ్ళను పరిశీలించిన బిజెపి నియోజకవర్గ నాయకులు తంబళ్ల రవి
Posted On 2026-06-14 13:11:06
Readmore >