Posted on 2025-11-24 19:53:03
డైలీ భారత్, రంగారెడ్డి జిల్లా: ఇందిరా మహిళా శక్తి చీరలు రాష్ట్రం లోని మహిళల ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలు స్తున్నాయని జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మన్ ఎలుగంటి మధుసూదన్ రెడ్డి తెలిపారు.సోమవారం షాబాద్ మండలం ఎట్ల ఎర్రవల్లి గ్రామంలో మహిళలకు ఇందిరా మహిళా శక్తి చీరల పంపిణీ కార్యక్రమంలో చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్యతో కలిసి ఆయన పాల్గొన్నారు . ఈ సందర్భంగా ఛైర్మన్ ఎలుగంటి మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ ప్రజా ప్రభుత్వం ఏర్పడిన రెండోరోజు నుంచే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించమని తెలియచేసారు. ఇందిరమ్మ ఇండ్లు మహిళల పేరిట ఇస్తున్నామని వివరించారు. ప్రతి ప్రభుత్వ పథకం అమలులో మహిళల కు అధిక ప్రాధాన్యం ఇస్తోందని తెలిపారు. వారి ఆర్థిక ప్రగతితో రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వాములు కావాలనే ఉద్దే శ్యంతో పథకాలకు రూపకల్పన చేస్తున్నారన్నారు. అర్హులైన ప్రతి మహిళకు ఇందిరా మహిళా శక్తి చీరలు పంపిణీ చేస్తామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో షాబాద్ మండల మహిళా సమాఖ్య అధ్యక్షురాలు కోట లక్ష్మీ,గుడిమల్కాపూర్ మార్కెట్ వైస్ చైర్మన్ కావలి చంద్రశేఖర్, సర్దార్ నగర్ మార్కెట్ చైర్మన్ సురేందర్ రెడ్డి, చేవెళ్ల మార్కెట్ చైర్మన్ పెంటయ్య గౌడ్, కాంగ్రెస్ సీనియర్ నాయకులు ఆగి రెడ్డి, వెంకటరెడ్డి, జనార్దన్ రెడ్డి, వీరేందర్ రెడ్డి, చెన్నయ్య, ప్రతాప్ రెడ్డి, కాజా మియా, రవీందర్ నాయక్, మహేందర్ గౌడ్, శ్రీనివాస్ గౌడ్, కిషోర్, ప్రభాకర్ రెడ్డి, కృష్ణారెడ్డి, మహేష్, సూర్య అధికారులు,పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
ప్రజలు చెయిన్ సిస్టం వ్యాపారాల జోలికి వెళ్ళవద్దు. జిల్లా ఎస్పీ : డాక్టర్.వినీత్ IPS
Posted On 2026-06-19 21:55:09
Readmore >
నీట్ రీ-ఎగ్జామ్ అభ్యర్థులకు టీజీఎస్ ఆర్టీసీ ఉచిత బస్సు ప్రయాణ సదుపాయం
Posted On 2026-06-19 20:54:23
Readmore >
గాంధారి పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, ఐపీఎస్
Posted On 2026-06-19 20:36:40
Readmore >
ఏసీబీకి చిక్కిన సర్వే ల్యాండ్ రికార్డు డిప్యూటీ ఇన్స్‌పెక్టర్
Posted On 2026-06-19 20:33:12
Readmore >
రవాణా శాఖ ఆధ్వర్యంలో విద్యార్థులకు ఫైర్ సేఫ్టీపై అవగాహన కార్యక్రమం
Posted On 2026-06-19 19:17:58
Readmore >
గాంధీ సరోవర్ ప్రాజెక్ట్‌కు కేంద్ర రక్షణ శాఖ గ్రీన్ సిగ్నల్
Posted On 2026-06-19 19:11:46
Readmore >
దేవాలయం పక్కన ఉన్న వైన్స్ (మద్యం)షాప్ నీ వెంటనే తొలగించాలి..బీజేపీ నాయకులు తంబళ్ల రవి డిమాండ్
Posted On 2026-06-19 17:52:08
Readmore >
ధూప దీప నైవేద్య అర్చక సంఘం ఆధ్వర్యంలో దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ చిత్రపటానికి పాలాభిషేకం
Posted On 2026-06-19 16:50:47
Readmore >