Posted on 2025-11-24 20:58:58
ఘటనా స్థలాన్ని పరిశీలించిన జిల్లా కలెక్టర్ మరియు పోలీస్ కమిషనర్
హైదరాబాద్ ఫోరెన్సిక్ నిపుణుల బృందంతో ఆధారాల సేకరణ
సహజంగా జరిగిందా లేక విధ్వంసమా అనే కోణంలో దర్యాప్తు ముమ్మరం
డైలీ భారత్ న్యూస్, కరీంనగర్:కరీంనగర్ పోలీస్ కమిషనరేట్, జమ్మికుంట పట్టణ పరిధిలోని తనుగుల గ్రామ శివారులో మానేరు వాగుపై నిర్మించిన చెక్ డ్యామ్ దెబ్బతిన్న ఘటనపై జిల్లా యంత్రాంగం మరియు పోలీస్ శాఖ సీరియస్ గా స్పందించింది. సోమవారం నాడు కరీంనగర్ జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి, కరీంనగర్ పోలీస్ కమిషనర్ గౌస్ ఆలం సంయుక్తంగా ఘటనా స్థలాన్ని సందర్శించి పరిస్థితిని సమీక్షించారు.
నవంబర్ 21వ తేదీ రాత్రి సమయంలో ఈ చెక్ డ్యామ్ దెబ్బతిన్న విషయం తెలిసిందే. అయితే ఈ ఘటన నీటి ప్రవాహానికి సహజంగా జరిగిందా? లేక ఎవరైనా గుర్తు తెలియని వ్యక్తులు ఉద్దేశపూర్వకంగా విధ్వంసానికి పాల్పడ్డారా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో, జమ్మికుంట పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
శాస్త్రీయ విచారణ - క్లూస్ టీం పరిశీలన:
ఘటనా స్థల పరిశీలనలో భాగంగా అధికారులతో పాటు హైదరాబాద్ నుండి వచ్చిన ఫోరెన్సిక్ ల్యాబ్ అసిస్టెంట్ డైరెక్టర్ వెంకట్ రాజ్ నేతృత్వంలోని బృందం, కరీంనగర్ క్లూస్ టీం సభ్యులు, మరియు ఫింగర్ ప్రింట్ ఇన్స్పెక్టర్లు రాజు, స్వర్ణజ్యోతి అక్కడ క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహించారు.
ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ.. "ఈ ఘటనకు గల అసలు కారణాలను వెలికితీయడానికి పూర్తి స్థాయి విచారణ జరుపుతున్నాం. సాంకేతిక నిపుణుల సహకారంతో అక్కడి నుండి నమూనాలు (Samples) సేకరించాము. వీటిపై ప్రయోగశాలలో అవసరమైన పరీక్షలు నిర్వహించి, సమగ్ర నివేదిక వచ్చిన తర్వాత తదుపరి చర్యలు తీసుకుంటాము" అని తెలిపారు.
నివేదిక ఆధారంగా ఎవరైనా బాధ్యులని తేలితే చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
ఈ తనిఖీల్లో హుజురాబాద్ ఏసీపీ మాధవి , పెద్దపల్లి ఏసీపీ కృష్ణ, ఇన్స్పెక్టర్లు రామకృష్ణ గౌడ్, లక్ష్మీనారాయణ లతో పాటు ఎస్సైలు శేఖర్ రెడ్డి , ఆవుల తిరుపతి , నీటి పారుదల శాఖ అధికారులు , ఇతర అధికారులు సిబ్బంది పాల్గొన్నారు.
ప్రజలు చెయిన్ సిస్టం వ్యాపారాల జోలికి వెళ్ళవద్దు. జిల్లా ఎస్పీ : డాక్టర్.వినీత్ IPS
Posted On 2026-06-19 21:55:09
Readmore >
నీట్ రీ-ఎగ్జామ్ అభ్యర్థులకు టీజీఎస్ ఆర్టీసీ ఉచిత బస్సు ప్రయాణ సదుపాయం
Posted On 2026-06-19 20:54:23
Readmore >
గాంధారి పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, ఐపీఎస్
Posted On 2026-06-19 20:36:40
Readmore >
ఏసీబీకి చిక్కిన సర్వే ల్యాండ్ రికార్డు డిప్యూటీ ఇన్స్‌పెక్టర్
Posted On 2026-06-19 20:33:12
Readmore >
రవాణా శాఖ ఆధ్వర్యంలో విద్యార్థులకు ఫైర్ సేఫ్టీపై అవగాహన కార్యక్రమం
Posted On 2026-06-19 19:17:58
Readmore >
గాంధీ సరోవర్ ప్రాజెక్ట్‌కు కేంద్ర రక్షణ శాఖ గ్రీన్ సిగ్నల్
Posted On 2026-06-19 19:11:46
Readmore >
దేవాలయం పక్కన ఉన్న వైన్స్ (మద్యం)షాప్ నీ వెంటనే తొలగించాలి..బీజేపీ నాయకులు తంబళ్ల రవి డిమాండ్
Posted On 2026-06-19 17:52:08
Readmore >
ధూప దీప నైవేద్య అర్చక సంఘం ఆధ్వర్యంలో దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ చిత్రపటానికి పాలాభిషేకం
Posted On 2026-06-19 16:50:47
Readmore >