| Daily భారత్
Logo




ప్రజాస్వామ్య వ్యవస్థకు రాజ్యాంగం బలమైన పునాది లాంటిది : టీ పీ సీ సీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్

News

Posted on 2025-11-26 20:00:56

Share: Share


ప్రజాస్వామ్య వ్యవస్థకు రాజ్యాంగం బలమైన పునాది లాంటిది : టీ పీ సీ సీ చీఫ్  మహేష్ కుమార్ గౌడ్

డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్:మన రాజ్యాంగం భారతదేశ ప్రజాస్వామ్య వ్యవస్థకు బలమైన పునాది లాంటిదని టీపీసీసీ అధ్యక్షులు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. రాజ్యాంగ వజ్రోత్సవాల సందర్భంగా మహేష్ కుమార్ గౌడ్ తెలంగాణ ప్రజలకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.రాజ్యాంగం మన ప్రజాస్వామ్య వ్యవస్థకు బలమైన పునాదని.  లౌకికత, సమానత్వ భావనలను సూచించే ప్రాథమిక పత్రంలా పని చేస్తుందని పేర్కొన్నారు.

భారత రాజ్యాంగం కేవలం చట్టాల సమాహారం కాకుండా, స్వాతంత్ర్య కోసం పోరాడిన వీరుల కలలు, త్యాగాలు, సంకల్పాలను ప్రతిబింబించే మహత్తర గ్రంథమని అన్నారు.రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ సహా అన్ని రాజ్యాంగ నిపుణులను స్మరించడం, వారికి గౌరవం తెలపడం ప్రతి భారతీయుడి కర్తవ్యమని ఆయన స్పష్టం చేశారు.

అనేక భాషలు, సంస్కృతులు, మతాలున్న భారతదేశాన్ని ఐక్యంగా ముందుకు నడిపించే శక్తిగా రాజ్యాంగాన్ని గుర్తించాలన్నారు.నేటి యువతకు రాజ్యాంగాన్ని చదవటం, అర్థం చేసుకోవటం అత్యంత కీలకమని, ప్రజాస్వామ్యంలో పౌర బాధ్యత ఓటు వేయడం మాత్రమే కాకుండా రాజ్యాంగ విలువలను గౌరవించి వాటిని ఆచరణలో పెట్టుకోవడమే నిజమైన బాధ్యతనని ఆయన గుర్తుచేశారు.

రాజ్యాంగ దినోత్సవం మన ప్రజాస్వామ్య భవిష్యత్తు కోసం రాజ్యాంగ విలువల పరిరక్షణకు అంకితభావాన్ని పునరుద్ఘాటించుకునే సమయం అని ఆయన  చెప్పారు. దేశ అభివృద్ధి పథంలో రాజ్యాంగమే శాశ్వత మార్గదర్శి అని ఆయన అన్నారు.

Image 1

ఇంటి వద్దే పాత సోఫాలు, ఫర్నిచర్, పరుపుల సేకరణ

Posted On 2026-07-06 21:54:53

Readmore >
Image 1

ప్రియుడి కోసం భర్తను హత్య చేసిన భార్య

Posted On 2026-07-06 08:04:19

Readmore >
Image 1

తల్లిదండ్రులను కోల్పోయిన 42 మంది చిన్నారులకు జీతాన్ని అందజేసిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్

Posted On 2026-07-05 19:39:21

Readmore >
Image 1

కాంగ్రెస్ పార్టీలోకి భారీ చేరికలు

Posted On 2026-07-05 19:32:47

Readmore >
Image 1

ఇంటింటా ఎన్యూమరేషన్ ఫారాలను అందించిన వార్డ్ కౌన్సిలర్

Posted On 2026-07-05 19:30:41

Readmore >
Image 1

కాలినడక ద్వారా తిరుమలకు చేరిన 116 ఏళ్ల వృద్ధురాలు

Posted On 2026-07-05 17:09:50

Readmore >
Image 1

ఒవైసీ కాలేజ్ నిర్మాణాలపై తెలంగాణ హైకోర్టు సీరియస్!!

Posted On 2026-07-05 17:08:44

Readmore >
Image 1

ఏలూరు జిల్లాలో విషాదం... రైలు ఢీకొని నలుగురి మృతి

Posted On 2026-07-05 11:44:43

Readmore >
Image 1

సకల సౌకర్యాలతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్లు...

Posted On 2026-07-04 16:57:14

Readmore >
Image 1

ఆహార కల్తీపై హెచ్‌-ఫాస్ట్‌ ఉక్కుపాదం!

Posted On 2026-07-04 15:07:29

Readmore >