Posted on 2025-11-28 13:22:30
డైలీ భారత్ న్యూస్, రాజన్న సిరిసిల్ల:వర్షాకాలంలో విద్యుత్ స్తంభాల వలన ఎన్నో ప్రమాదాలు జరిగి అనేక ప్రాణాలు కోల్పోతున్నారు, దీనికి పరిష్కారంగా విద్యుత్ వైర్లు లేని విద్యుత్ సరఫరా ఇంటింటికి జరిగితే ఇటువంటి ప్రమాదాలను నివారించవచ్చు. దీనికి పరిష్కారంగా జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పెద్దలింగాపూర్, మండలo ఇల్లంతకుంట విద్యార్థిని ల్యాగల శ్రీలేఖ wireless electricity అనే ప్రాజెక్టును ఈరోజు గీతానగర్ పాఠశాలలో జరుగుతున్న వైజ్ఞానిక ప్రదర్శనలో ప్రదర్శించడం జరిగింది. విద్యుత్ ప్రవహిస్తున్న ఒక తీగ చుట్ట ఇంకొక తీగ చుట్టలో విద్యుతుని ప్రేరేపిస్తుంది అని భౌతిక శాస్త్రంలోని induced current జ్ఞానం తోటి ఒక చక్కటి ప్రాజెక్టును తయారు చేయడం జరిగింది. ఈ ప్రాజెక్టు సందర్శకులను ఆకట్టుకుంది. ఈ ప్రాజెక్టుకు గైడ్ టీచరుగా ఆ పాఠశాల భౌతిక శాస్త్ర ఉపాధ్యాయుడు రొండ్ల జగన్మోహన్ రెడ్డి వ్యవహరించారు.
తల్లిదండ్రులను కోల్పోయిన 42 మంది చిన్నారులకు జీతాన్ని అందజేసిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్
Posted On 2026-07-05 19:39:21
Readmore >
సకల సౌకర్యాలతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్లు...
Posted On 2026-07-04 16:57:14
Readmore >