| Daily భారత్
Logo




చదువుతోపాటు ఆటలోనూ రాణించాలి : ఇంచార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్

News

Posted on 2025-12-05 18:05:33

Share: Share


చదువుతోపాటు ఆటలోనూ రాణించాలి : ఇంచార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్

క్రీడలతో శారీరక, మానసిక అభివృద్ధి

ప్రణాళిక ప్రకారం చదివి లక్ష్యం చేరుకోవాలి

ఇంచార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్

కేంద్రీయ విద్యాలయం వార్షిక ఆటల పోటీలు ప్రారంభం.

అలరించిన విద్యార్థుల నృత్యాలు, ప్రదర్శనలు.

డైలీ భారత్ న్యూస్, రాజన్న సిరిసిల్ల జిల్లా : విద్యార్థులు చదువుతోపాటు ఆటలోనూ రాణించాలని ఇంచార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్ పిలుపు ఇచ్చారు. కేంద్రీయ విద్యాలయం వార్షిక ఆటల పోటీలు 2025- 26 కార్యక్రమాన్ని శుక్రవారం నిర్వహించగా, ముఖ్య అతిథిగా ఇంచార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్ హాజరు కాగా, స్కౌట్స్ అండ్ గైడ్స్  స్వాగతం పలికారు. ఆటల పోటీల జెండాను ఆవిష్కరించి, ప్రారంభించారు. విద్యార్థుల నృత్యాలు, ప్రదర్శనలు అలరించాయి. ఈ సందర్భంగా ఇంచార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్ మాట్లాడుతూ.. ప్రతి విద్యార్థి ప్రణాళిక ప్రకారం చదివి లక్ష్యం చేరుకోవాలని పిలుపు ఇచ్చారు. విద్యార్థులు ఆన్లైన్ గేమ్స్ ఆడవద్దని, ప్రతి రోజు గంట పాటు ఆటలు ఆడాలని సూచించారు. క్రీడలు, యోగా సాధనతో శారీరక, మానసిక సమతుల్యత, అభివృద్ధి సాధ్యమని వివరించారు. తరగతి గది పుస్తకాలతోపాటు లైబ్రరీ లోని ఇష్టమైన పుస్తకాలు, దిన పత్రికలు చదవాలని పేర్కొన్నారు. వివిధ అంశాలపై అవగాహన వస్తుందని వివరించారు. గత ప్రశ్నాపత్రాలు, మోడల్ పేపర్లు ప్రాక్టీస్ చేయాలని సూచించారు. దీంతో వార్షిక, పోటీ పరీక్షల్లో విజయం సాధించడం సులువు అవుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో కేంద్రీయ విద్యాలయం ప్రిన్సిపాల్ శేషా ప్రసాద్, ఉపాధ్యాయులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Image 1

రాజన్న ఆలయ అభివృద్ధికి రూ.1,00,116 విరాళం అందజేసిన దంపతులు

Posted On 2026-06-15 06:56:34

Readmore >
Image 1

విద్యుత్ తీగలు అపహరించిన ఐదుగురు నిందితులు అరెస్ట్

Posted On 2026-06-14 20:58:52

Readmore >
Image 1

నకిలీ "షాదీ ముబారక్" లబ్ధిదారులను సృష్టించి ప్రభుత్వ నిధులను మళ్లించినందుకు ఆరుగురి అరెస్టు

Posted On 2026-06-14 20:18:49

Readmore >
Image 1

AIADMK పార్టీకి సినీ నటి గౌతమి రాజీనామా

Posted On 2026-06-14 18:21:15

Readmore >
Image 1

పెట్రోల్ ట్యాంకర్ ఢీకొని యువకుడు మృతి

Posted On 2026-06-14 18:20:08

Readmore >
Image 1

మనిషిని మనిషిని కలిపే మానవతా బంధమే రక్తదానం

Posted On 2026-06-14 18:12:50

Readmore >
Image 1

కువైట్ స్క్రాప్‌యార్డ్‌లో భారీ అగ్నిప్రమాదం...

Posted On 2026-06-14 14:30:52

Readmore >
Image 1

దుబాయ్-అహ్మదాబాద్ విమానం టాయిలెట్‌లో రూ.4.26 కోట్ల బంగారం స్వాధీనం

Posted On 2026-06-14 14:08:47

Readmore >
Image 1

ఘనంగా భీమారం గ్రామ సర్పంచ్ గీత వీరేశం గుప్త జన్మదిన వేడుకలు

Posted On 2026-06-14 13:54:26

Readmore >
Image 1

అనుమానంతో భార్యను గొడ్డలితో నరికి చంపిన భర్త

Posted On 2026-06-14 13:20:56

Readmore >