Posted on 2025-12-07 14:24:59
కేంద్ర మంత్రిగా ఉండి కూడా రాష్టానికి ఆయన చేసింది శూన్యం
బిజెపి మహా ధర్నాపై పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ సంచలన వ్యాఖ్యలు
డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్:కేంద్ర మంత్రిగా ఉన్న తెలంగాణ రాష్ట్రానికి చెందిన బిజెపి మాజీ అధ్యక్షుడు కిషన్ రెడ్డికి తెలంగాణ రాష్ట్రం గురించి మాట్లాడే నైతిక హక్కు లేదని పిసిసి అధ్యక్షుడు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ విమర్శించారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలో మీడియాతో మాట్లాడిన ఆయన బిజెపి పార్టీ హైదరాబాద్లో ఇందిరాపార్క్ వద్ద నిర్వహిస్తున్న మహా ధర్నాపై సంచలన వ్యాఖ్యలు చేశారు. కేంద్ర మంత్రిగా ఉండి కూడా రాష్ట్రానికి ఏ ఒక్క అభివృద్ధి పనులు చేపట్టని అసమర్ధత కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అని ఇప్పుడు ఏ మొహం పెట్టుకొని ఆ బిజెపి పార్టీ నేతలు ఇందిరాపార్క్ వద్ద మహా ధర్నా నిర్వహిస్తున్నారని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.
తెలంగాణ లో కాంగ్రెస్ ప్రభుత్వం అభివృద్ధి సంక్షేమం విషయంలో ప్రజలతో శభాష్ కొట్టించుకుంటుందని ఇది చూసి ఓర్వలేక బిజెపి నేతలు మహా ధర్నా పేరిట ప్రజలను ముఖ్యంగా తెలంగాణ ప్రజలను మోసం చేసే కుట్ర పన్నుతున్నారని ఆయన అన్నారు. ఇందుకు ఉదాహరణనే జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఫలితాలు అని వ్యాఖ్యానించారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలు కనీసం బీజేపీ పార్టీ డిపాజిట్ దక్కించుకోలేని కిషన్ రెడ్డి ఆలోచించాలన్నారు. గ్లోబల్ సమ్మిట్ గర్వంగా జరుపుకుంటున్నాం అని అన్నారు. ప్రజల మెప్పుపొంది ప్రజల ముందు గర్వంగా నిల్చున్నామన్నారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్వాకం వల్ల 8 లక్షల కోట్ల అప్పుతో రాష్టాన్ని కాంగ్రెస్ పార్టీకి ఇచ్చారన్నారు. ఒకవైపు వడ్డీలు కడుతూ సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని వచ్చే మూడేళ్లలో ఇచ్చిన హామీలు అన్ని తప్పకుండా నెరవేరుస్తామన్నారు.
కామారెడ్డి పాఠశాలలపై చర్యలు తీసుకోవాలి : అఖిల భారతీయ విద్యార్థి పరిషత్
Posted On 2026-06-14 08:30:06
Readmore >
అశ్వారావుపేట 100 పడకల హాస్పిటల్ త్వరగా పూర్తి చేయాలి : బీజేపీ నాయకులు తంబళ్ల రవి
Posted On 2026-06-13 20:32:49
Readmore >
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఇసుక కాంట్రాక్టులపై తుడుం దెబ్బ ఆందోళన
Posted On 2026-06-13 11:35:06
Readmore >
కాసులకు కక్కుర్తితో అక్రమ కరెంట్ కలెక్షన్స్ ఇస్తున్న అధికారులు
Posted On 2026-06-13 11:33:30
Readmore >
కాంగ్రెస్ పార్టీని వీడి బిఆర్ఎస్ పార్టీలోకి చేరికల గురించి చర్చలు జరిపిన జూలూరుపాడు మండల పాపకొల్లు గ్రామనికి చెందిన కాంగ్రెస్ యువజన నాయకులు
Posted On 2026-06-13 11:31:24
Readmore >
తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ నూతన కార్యవర్గంలో మీడియా కమిటీ కార్యదర్శిగా దన్నారపు రాజలింగం నియామకం
Posted On 2026-06-13 11:26:02
Readmore >
రైతుల పొలాలకు చేరాల్సిన చెరువు మట్టి రియల్ ఎస్టేట్ వెంచర్లకు తరలింపు?
Posted On 2026-06-13 11:25:04
Readmore >