| Daily భారత్
Logo




సర్పంచ్ ఎన్నికల్లో సోషల్ మీడియాతో ముందుకు పోతున్న అభ్యర్ధులు

News

Posted on 2025-12-09 11:21:25

Share: Share


సర్పంచ్ ఎన్నికల్లో సోషల్ మీడియాతో ముందుకు పోతున్న అభ్యర్ధులు

డైలీ భారత్ న్యూస్, రంగారెడ్డి జిల్లా: గత కొన్నేళ్లుగా ఎన్నికల ప్రచారంలో వాట్సప్, ఇన్‌స్టాగ్రామ్‌, ఫేస్‌బుక్ తదితర సోషల్ మీడియాలు కీలకంగా మారాయి. ప్రస్తుత తెలంగాణ గ్రామ పంచాయతీ ఎన్నికల్లోనూ సర్పంచి, వార్డు సభ్యుల అభ్యర్థులు ఈ మాధ్యమాల్లోకి చొచ్చుకుపోతున్నారు. తొలి దశ పోలింగ్‌కు ఇక ఎంతో టైం లేకపోవడంతో పోస్టులు, రీల్స్‌తో సెల్‌ఫోన్లను మోతమోగిస్తున్నారు. ఇంటింటి ప్రచారంలో తమ ఆలోచనల్ని, హామీలను ప్రతి ఓటరుకు వివరించే టైం ఉండదు. వాట్సప్‌ మెసేజ్‌లు, ఇన్‌స్టాగ్రామ్‌ రీల్స్‌తో అవన్నీ సులభంగా వివరిస్తున్నారు. క్షణాల్లో వందలు, వేల మందికి వారి ఆలోచనల్ని, హామీలను చేరవేస్తున్నారు. ప్రచార రథాలపై డిజిటల్‌ తెరల ద్వారానూ ప్రచారం నిర్వహిస్తూ ప్రజల్లోకి మెరుపు వేగంతో చొచ్చుకుపోతున్నారు.నిమిషంలోపు ఉండేలా తమ ఆడియో, వీడియో ప్రొఫైల్‌ రూపొందించి ఓటర్లకు సోషల్ మీడియా ద్వారా చేరవేస్తున్నారు సర్పంచి, వార్డు అభ్యర్థులు. తమ నేపథ్యం, వారు చేసిన సేవలను అందులో తెలియజేస్తున్నారు. 2 నుంచి 3 నిమిషాల నిడివితో హామీలు, మేనిఫెస్టో రీల్స్‌ను పోస్టు చేస్తున్నారు. వీటితోపాటు తమకు ఓటేయాలంటూ 30 నుంచి 40 సెకన్ల స్పీచ్‌తో ఆడియో ఫైల్స్‌ షేర్ చేస్తున్నారు. తనకు ఓటేస్తే గ్రామాన్ని ఎలా మారుస్తామన్నది స్వయంగా వివరిస్తున్నారు. తమ గెలుపుకి సహకరించాలని ఓటర్లను అభ్యర్థిస్తున్నారు. దీంతో ఇళ్లు, గోడలపై పోస్టర్లు తగ్గి పోస్టుల ప్రచారం తారస్థాయికి చేరుతోంది.

Image 1

ప్లాట్ఫారం మీద బ్రతికే కార్మికుల పై పంచాయతీ కన్ను

Posted On 2026-06-13 11:36:13

Readmore >
Image 1

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఇసుక కాంట్రాక్టులపై తుడుం దెబ్బ ఆందోళన

Posted On 2026-06-13 11:35:06

Readmore >
Image 1

కాసులకు కక్కుర్తితో అక్రమ కరెంట్ కలెక్షన్స్ ఇస్తున్న అధికారులు

Posted On 2026-06-13 11:33:30

Readmore >
Image 1

కాంగ్రెస్ పార్టీని వీడి బిఆర్ఎస్ పార్టీలోకి చేరికల గురించి చర్చలు జరిపిన జూలూరుపాడు మండల పాపకొల్లు గ్రామనికి చెందిన కాంగ్రెస్ యువజన నాయకులు

Posted On 2026-06-13 11:31:24

Readmore >
Image 1

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ నూతన కార్యవర్గంలో మీడియా కమిటీ కార్యదర్శిగా దన్నారపు రాజలింగం నియామకం

Posted On 2026-06-13 11:26:02

Readmore >
Image 1

రైతుల పొలాలకు చేరాల్సిన చెరువు మట్టి రియల్ ఎస్టేట్ వెంచర్లకు తరలింపు?

Posted On 2026-06-13 11:25:04

Readmore >
Image 1

బాల కార్మికులను గుర్తిస్తే సంబంధిత అధికారులకు సమాచారం అందించాలి

Posted On 2026-06-12 22:38:10

Readmore >
Image 1

పాఠశాల పునఃప్రారంభానికి ముందే అన్ని సౌకర్యాలు సిద్ధంగా ఉండాలి : అదనపు కలెక్టర్ డా. అశ్వని తానాజీ వాకడే

Posted On 2026-06-12 21:45:03

Readmore >
Image 1

దివ్యాంగుల వైద్యానికి ఆర్థిక సహాయం

Posted On 2026-06-12 21:34:48

Readmore >
Image 1

సానిటేషన్ సిబ్బంది సేవలను గుర్తించి అభినందించిన ఆలయ ఈవో

Posted On 2026-06-12 20:23:57

Readmore >