| Daily భారత్
Logo




మెస్సీ క్రీడతో రాష్ట్రంలో రాక్షస క్రీడా జరగబోతుంది : నిజామాబాద్ జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షులు జీవన్ రెడ్డి

News

Posted on 2025-12-13 13:06:27

Share: Share


మెస్సీ క్రీడతో రాష్ట్రంలో రాక్షస క్రీడా జరగబోతుంది : నిజామాబాద్ జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షులు జీవన్ రెడ్డి

మెస్సీ,తో అవినీతి పరుడు గుంపు మేస్త్రి సీఎం రేవంత్ రెడ్డి ఫుడ్ బాల్ ఆడడం సిగ్గుచేటు

నిజామాబాద్ మీడియా సమావేశంలో మాజీ ఎమ్మెల్యే నిజామాబాద్ జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షులు జీవన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్: మెస్సి క్రీడతో రాష్ట్రంలో రాక్షస క్రీడ జరగబోతుందని ఆ క్రీడలో అవినీతిపరుడు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అని ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు జీవన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. శనివారం జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్ర అధ్యక్షులు శనివారం జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం అత్త సొమ్ము అల్లుడికి దానం చేసినట్లు మెస్సి ఫుట్బాల్ ఈవెంట్ ఉందని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ప్రజల సొమ్మును దుర్వినియోగం చేస్తున్నారని వ్యాఖ్యానించారు. మెస్సీ సాకర్ వీరుడు అయితే రేవంత్ రెడ్డి బ్రోకర్ వీరుడు అని విమర్శించారు. సింగరేణి ప్రజల రక్తపు చెమట 100 కోట్లను ఈ క్రీడలకు దుర్వినియోగం చేయటం దారుణమన్నారు. దుబాయ్ షేక్ ఎంరెడ్స్ జెర్సీ ప్రమోట్ చేస్తున్నందుకు సీఎం రేవంత్ రెడ్డి ఎంత వాటా తీసుకుంటున్నారో దీనిపై విచారణ జరపాలని ఆయన డిమాండ్ చేశారు. సమస్యల నుండి ప్రజల దృష్టిని మళ్లించేందుకే ఈ క్రీడా డ్రామా అని అన్నారు. రాష్ట్రంలో మొదటి విడత పంచాయితీ ఎన్నికల్లో 40 శాతం బి ఆర్ ఎస్ బలపరిచిన అభ్యర్థులను గెలిపించి కాంగ్రెస్ తో ప్రజలు ఫుడ్ బాల్ ఆడారని ఆయన అన్నారు. ఈ విలేకరుల సమావేశంలో జడ్పీ మాజీ చైర్మన్ దాదన్న గారి విట్టల్ రావు, మాజీ ఎమ్మెల్సీ వి. గంగాధర్ గౌడ్, మాజీ నూడా చైర్మన్ చామకూర ప్రభాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Image 1

శీర్షిక : ఆడది ఆటబొమ్మ కాదు-- మంజుల పత్తిపాటి

Posted On 2026-04-12 08:16:03

Readmore >
Image 1

డీ అడిక్షన్, కౌన్సెలింగ్ కేంద్రాన్ని ప్రారంభించిన జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్, ఎస్పీ మహేష్ బి గితే

Posted On 2026-04-11 22:48:59

Readmore >
Image 1

సిరిసిల్ల నేతన్న అద్భుత సృష్టి

Posted On 2026-04-11 21:25:59

Readmore >
Image 1

ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం ఉద్యోగ జేఏసీ నిరంతరం పోరాటం

Posted On 2026-04-11 21:20:31

Readmore >
Image 1

డి-అడిక్షన్ సెంటర్‌ను సందర్శించిన వరంగల్ పోలీస్ కమిషనర్

Posted On 2026-04-11 20:02:47

Readmore >
Image 1

జిల్లా పోలీస్ కార్యాలయంలో మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి వేడుకలు

Posted On 2026-04-11 19:50:42

Readmore >
Image 1

జంగంపల్లి గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో మహాత్మ జ్యోతిరావు పూలే జయంతి వేడుకలు

Posted On 2026-04-11 19:48:36

Readmore >
Image 1

ప్రజా పాలన - ప్రగతి ప్రణాళికలో భాగంగా జిల్లా ఆసుపత్రిలో ‘డి-అడిక్షన్’ సేవలు - ప్రారంభించిన జిల్లా ఎస్పీ

Posted On 2026-04-11 19:47:25

Readmore >
Image 1

శ్రీనిధి డిగ్రీ అండ్ పీజీ కాలేజీ మరియు మంజీరా డిగ్రీ అండ్ పీజీ కాలేజీ వార్షికోత్సవం

Posted On 2026-04-11 19:43:57

Readmore >
Image 1

సామాజిక న్యాయం చెప్పటం కాదు - అమలు చేయాలి

Posted On 2026-04-11 17:27:29

Readmore >