Posted on 2025-12-14 12:02:41
డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్:రెండవ విడత ఎన్నికలలో భాగంగా ఆదివారం నిజామాబాద్ రూరల్ డివిజన్ పరిధిలోని మొగుపాల్ , డిచ్పల్లి మండలంల కేంద్రం లోని కంజర, కులాస్పూర్ , ఘన్పూర్ , ధర్మారం (బి) గ్రామాలలోని జిల్లా పరిషత్ హై స్కూల్ పోలింగ్ కేంద్రoలను సందర్శించిన నిజామాబాదు పోలీస్ కమీషనర్ పి. సాయి చైతన్య, ఐ. పి. ఎస్. ఆయా పోలింగ్ కేంద్రాల వద్ద బందోబస్తు ఏర్పాట్లు , భద్రతా చర్యలను పరిశీలించారు. ఈ సందర్బంగా సంబంధిత అధికారులతో మాట్లాడుతూ ఎన్నికలు పూర్తిగా ప్రశాంత వాతావరణంలో స్వేచ్ఛాయుతంగా నిర్వహించేందుకు అవసరమైన అన్ని రకాల చర్యలను తీసుకోవాలని , సిబ్బంది అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ప్రజలు శాంతియుత వాతావరణం లో తమ ఓటు హక్కు ను సధ్వినియోగం పర్చుకోవాలని సూచించారు.
ఈ సందర్భంగా నిజామాబాద్ ఏ.సి.పిరాజా వెంకటరెడ్డి, సీఐ చందర్ రాథోడ్ ఎస్సైలు మహేష్ ఆరిఫ్ సుమలత , ఆర్వో అధికారులు శ్రీనివాస్ , షేక్ మస్జీద్ , రాజ నరసయ్య , మధుసూదన్ అధికారులు ఉన్నారు.
తల్లిదండ్రులను కోల్పోయిన 42 మంది చిన్నారులకు జీతాన్ని అందజేసిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్
Posted On 2026-07-05 19:39:21
Readmore >
సకల సౌకర్యాలతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్లు...
Posted On 2026-07-04 16:57:14
Readmore >
అడవి జంతువుల వల్ల పంట నష్టాన్ని PMFBY పరిధిలోకి తీసుకురావాలి : కవయిత్రి మంజుల పత్తిపాటి
Posted On 2026-07-04 14:03:34
Readmore >